Home /News /business /

WHATSAPP LAUNCHES SCAM SE BACHO ONLINE PAYMENTS SAFETY CAMPAIGN TO HELP PUBLIC TO AVOID SCAMS AND FRAUDS SS

Scam Se Bacho: వాట్సప్ నుంచి పేరడీ సాంగ్... ఆన్‌లైన్ మోసాలపై అవగాహన

Scam Se Bacho: వాట్సప్ నుంచి పేరడీ సాంగ్... ఆన్‌లైన్ మోసాలపై అవగాహన
(ప్రతీకాత్మక చిత్రం)

Scam Se Bacho: వాట్సప్ నుంచి పేరడీ సాంగ్... ఆన్‌లైన్ మోసాలపై అవగాహన (ప్రతీకాత్మక చిత్రం)

Scam Se Bacho | ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) ఫ్రాడ్స్ పెరిగిపోతుండటంతో వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాట్సప్ స్కామ్ సే బచో పేరుతో ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.

వాట్సప్ 'స్కామ్ సే బచో' (Scam Se Bacho) పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) చేసేవారు మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తోంది. స్కామ్‌లు, మోసాలు ఎలా జరుగుతాయో వివరిస్తూ ఓ సాంగ్ రిలీజ్ చేసింది. ఎవర్‌గ్రీన్ సాంగ్ అయిన 'దేఖ్ కే ఛలో' పాటకు పేరడీగా 'స్కామ్ సే బచో' పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది వాట్సప్ (WhatsApp). ఈ వీడియోలో పాట ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది. భారతీయ డిజిటల్ పేమెంట్స్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో రూపొందించింది వాట్సప్.

వాట్సప్ రూపొందించిన ఈ వీడియోలో వేర్వేరు మోసాల గురించి ఉంది. లక్కీ లాటరీ, ఓటీపీ, క్యూఆర్ కోడ్, క్యాష్ ప్రైజ్, కాల్ సెంటర్ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు, బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందంటూ వచ్చే ఫోన్ కాల్స్, యూపీఐ పిన్... ఇలా అనేక రకాల మోసాలకు ఎలా అడ్డుకట్ట వేయాలో వివరించింది. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు.

SBI Alert: ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్


ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారిని సైబర్ మోసగాళ్లు అనేక రకాలుగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. లక్కీ లాటరీ తగిలిందంటూ నమ్మించి కార్డు వివరాలు తెలుసుకోవడం, ఓటీపీ చెప్పకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని నమ్మించడం, యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తామని, మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలని చెప్పడం... ఇలా అన్ని మోసాల్లో చివరకు జరిగేది అమాయకుల అకౌంట్ ఖాళీ కావడమే.

ఇలాంటి మోసాలకు బ్రేక్ వేయాలంటే ప్రతీ ఒక్కరూ ప్రతీ నిమిషం అప్రమత్తంగా ఉండటం అవసరం. వాట్సప్ మాత్రమే కాదు, బ్యాంకులు, ఇతర యూపీఐ ప్లాట్‌ఫామ్స్ కస్టమర్లకు కాల్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగవు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇక యూజర్లు తమకు వచ్చే అనుమానాస్పద లింక్స్ అస్సలు క్లిక్ చేయకూడదు.

SBI ATM Card: పిన్ నెంబర్ అవసరం లేకుండా ఏటీఎం కార్డుతో పేమెంట్స్... మీరూ యాక్టివేట్ చేయండి ఇలా



పేమెంట్స్ స్వీకరించడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఎవరికైనా డబ్బులు పంపాలంటేనే యూపీఐ పిన్ అవసరం. ఇక తరచూ యూపీఐ పిన్ మారుస్తూ ఉండాలి. యూపీఐ పిన్ మాత్రమే కాదు బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్స్, ఏటీఎం కార్డ్ పిన్, క్రెడిట్ కార్డ్ పిన్ నెలకోసారైనా మారుస్తూ ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో ఈ వివరాలు స్మార్ట్‌ఫోన్‌‌లో సేవ్ చేయకూడదు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Online fraud, Personal Finance, Upi payments, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు