• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • WHATSAPP CHAT MIGRATION THIS FEATURE WILL TRANSFER CHATS BETWEEN SYNCED DEVICES MK GH

WhatsApp chats: మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోన్న వాట్సాప్.. చాట్ లిస్టులను వేరే డివైజ్‌కు సింక్ చేసే అవకాశం

WhatsApp chats: మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోన్న వాట్సాప్.. చాట్ లిస్టులను వేరే డివైజ్‌కు సింక్ చేసే అవకాశం

(ప్రతీకాత్మక చిత్రం)

వినియోగదారులకు డేటా ట్రాన్స్‌ఫర్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను వాట్సాప్ తొలగించనుంది. ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు వాట్సాప్ డేటాను సింక్ చేసే కొత్త ఫీచర్‌ను సంస్థ పరీక్షిస్తోంది.

  • Share this:
మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. కొత్త ప్రైవసీ పాలసీ, ఇతర నియమాలకు యూజర్లు అంగీకరించాల్సిన గడువును సంస్థ ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజా వార్త మాత్రం వివాదానికి సంబంధించింది కాదు. ఆ సంస్థ కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులకు డేటా ట్రాన్స్‌ఫర్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను వాట్సాప్ తొలగించనుంది. ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు వాట్సాప్ డేటాను సింక్ చేసే కొత్త ఫీచర్‌ను సంస్థ పరీక్షిస్తోంది. దీని ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ల మధ్య చాట్ లిస్టును మైగ్రేషన్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ తరువాత వినియోగదారులు తమ వాట్సాప్ చాట్‌లను ఆండ్రాయిడ్ డివైజ్‌ నుంచి ఐఓఎస్‌కు.. లేదా ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్ డివైజ్‌లకు సులభంగా అప్‌లోడ్ చేసుకోవచ్చు.

కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను WABetaInfo వెల్లడించింది. ‘సింకింగ్ విత్ వాట్సాప్ ఆన్ అనదర్ డివైజ్’ పేరుతో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోందని తెలిపింది. దీని ద్వారా వాట్సాప్ చాట్‌లను మరో డివైజ్‌కు మైగ్రేట్ చేసే అవకాశం ఉంటుందని ప్రకటించింది. రెండు డివైజ్‌లు సింక్ చేసినప్పుడు.. కొన్ని చాట్ ఫంక్షన్లు రెండిట్లోనూ పనిచేస్తాయి. చాట్ పిన్ చేయడం లేదా స్టార్ ఇవ్వడం వంటి ఫీచర్లు రెండు డివైజ్‌లలో ఒకేసారి పని చేస్తాయి. అయితే మరికొన్ని ఫీచర్లు మాత్రం సింక్ అయిన డివైజ్‌లలో పనిచేయవని WABetaInfo నివేదించింది. చాట్‌లను డిలీట్ చేయడం, ఏదైనా చాట్ లిస్ట్‌లో కొన్ని మెస్సేజ్‌లను డిలీట్ చేయడం.. వంటి ఫీచర్లు సింక్ అయిన రెండు డివైజ్‌లలో ఒకేసారి పనిచేయవు.

ఈ ఫీచర్‌ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తరువాత ఫీచర్‌ను బీటా వెర్షన్‌లో పరీక్షించనున్నారు. ఆ తరువాతే పనితీరు ఆధారంగా దీన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఫీచర్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ కొత్త అప్‌డేట్‌పై స్పష్టమైన సమాచారం లేదు. దీనికి సంబంధించిన వివరాలను వాట్సాప్ అధికారికంగా వెల్లడించలేదు.
Published by:Krishna Adithya
First published: