హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Investments: పండుగ సీజన్‌లో బంగారం ఏ రూపంలో కొనాలి? ఫిజికల్ గోల్డ్, డిజిటల్‌ గోల్డ్, ఈటీఎఫ్‌ గోల్డ్‌లో ఏది బెస్ట్ ఆప్షన్?

Gold Investments: పండుగ సీజన్‌లో బంగారం ఏ రూపంలో కొనాలి? ఫిజికల్ గోల్డ్, డిజిటల్‌ గోల్డ్, ఈటీఎఫ్‌ గోల్డ్‌లో ఏది బెస్ట్ ఆప్షన్?

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

ఒకప్పుడు బంగారం అంటే బిస్కట్‌ లేదా ఆభరణాల రూపంలోనే లభించేది. ఇప్పుడు అనేక రూపాల్లో స్వర్ణం అందుబాటులో ఉంది. సందర్భం, అవసరాన్ని బట్టి ఎవరికి నచ్చింది వారు ఎంచుకోవడం మేలు.

పెట్టుబడులకు ఎన్ని మార్గాలు ఉన్నా చాలా మంది ఇప్పటికీ బంగారాన్ని బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ టూల్‌గా పరిగణిస్తుంటారు. కాలం, ఆదాయంతో సంబంధం లేకుండా బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు గోల్డ్‌ కొనుగోలులో కొత్త ట్రెండ్స్‌ కనిపిస్తున్నాయి. బంగారం కొనేందుకు పండుగల సీజన్‌.. ముఖ్యంగా దసరా, దీపావళి సమయాలు బెస్ట్‌ అనే భావన చాలా మందిలో ఉంది. పెళ్లిళ్ల సీజన్‌, శరన్నవ రాత్రుల్లో (wedding season and festivals) అమ్మవారి పూజలు, ఆ తర్వాత థన్‌తేరాస్‌, దీపావళి వంటి పర్వదినాల్లో బంగారానికి డిమాండ్‌ బాగా ఉంటుంది. ఆ సమయంలో కొనడం శుభప్రదంగా భావిస్తారు.

ఒకప్పుడు బంగారం అంటే బిస్కట్‌ లేదా ఆభరణాల రూపంలోనే లభించేది. ఇప్పుడు అనేక రూపాల్లో స్వర్ణం అందుబాటులో ఉంది. సందర్భం, అవసరాన్ని బట్టి ఎవరికి నచ్చింది వారు ఎంచుకోవడం మేలు.

Viral: మ్యారేజ్ ప్రపోజల్‌కు బ్రేక్ వేసిన పెంపుడు కుక్క.. అది చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు


ఏ రూపంలో బంగారం మంచిదని చెప్పడం కుదరకపోవచ్చు. డిజిటల్‌ రూపంలో ఉన్న బంగారం ధరించేందుకు వీలు కాదు. అలాగని నగల రూపంలో ఉంటే దాని వల్ల పూర్తి లబ్ధి అందదు. సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌కు ఇటీవలి కాలంలో చాలా మంది మొగ్గుచూపుతున్నారు. వడ్డీ లభిస్తుండటం, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ద్వారా సులభంగా విక్రయించుకునే వెసులుబాటు దీని ప్లస్ పాయింట్స్. అదే ఫిజికల్‌ గోల్డ్‌ను అయితే ఎప్పుడైనా అవసరాలను బట్టి విక్రయించుకునే వీలు ఉంటుంది.

ఫిజికల్‌ గోల్డ్‌ (physical gold), సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (Sovereign Gold Bonds), గోల్డ్ ఈటీఎఫ్‌ (Gold ETF), గోల్డ్ ఫండ్స్‌ రూపంలో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారు గోల్డ్‌ ఫండ్స్‌ (Gold Funds) ఎంచుకోవచ్చు. ఈ పెట్టుబడులపై టీడీఎస్‌ వర్తించదు. కేవలం బంగారం కొనుగోలు, అమ్మకంపై విధించే పన్నులు మాత్రమే విధిస్తారు.

Lucky Couple: పెళ్లి జరిగాక హనీమూన్ పక్కన పెట్టిన దంపతులు.. వాళ్లు చేసిన పని కోట్ల వర్షం కురిపించింది.. నాలుగు రోజులకే..


దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉండి బంగారంలోనూ పెట్టుబడి పెట్టదలిచిన వారికి డిజిటల్‌ మార్గం ఉత్తమమని చెప్పాలి. కానీ ఈ పెట్టుబడి.. పెట్టుబడిదారు రిస్క్‌ తీసుకునే తత్వం, అవసరంపై ఆధారపడి ఉంటుంది. బంగారంలో ఇన్వెస్ట్ చేసి, దాని ద్వారా వడ్డీ ఆర్జించే వెసులుబాటు ఉన్న పెట్టుబడి సాధనం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌. ఈ సదుపాయం మరే రూపంలోని బంగారం పెట్టుబడుల్లో లేదు.

Raw Meat Diet: మూడేళ్లుగా పచ్చి మాంసమే అతడి ఆహారం.. ఆరోగ్యం గురించి అతడు ఏం చెప్పాడంటే..


కొవిడ్‌ కారణంగా ఈ మధ్యలో డిజిటల్‌ గోల్డ్‌కు (Digital gold) బాగా ఆదరణ పెరుగుతోంది. ఈ విధానంలో కేవలం ఒక్క రూపాయితో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. మరే ఇతర సాధనంలో ఈ సౌకర్యం లేదు. అమ్మకం, కొనుగోలులో ఉండే సౌలభ్యం కారణంగా చాలా మంది దీని వైపు ఆకర్షితులవుతున్నారు. కొవిడ్‌-19, భౌతిక దూరం కారణంగా సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో చాలా మంది తమ ఇళ్లలోనే కూర్చొని పెట్టుబడిగా పెడుతున్నారు. వీటిల్లో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్‌ అకౌంట్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

పెట్టుబడుల విషయంలో వైవిధ్యాన్ని పాటించాలన్నది నిపుణుల సూచన. స్టాక్స్‌, బాండ్స్‌, గోల్డ్, రియల్‌ ఎస్టేట్‌ వంటి వాటిల్లో పెట్టుబడులు విస్తరించాలని ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్లు సూచిస్తున్నారు. మొత్తం పెట్టుబడుల్లో బంగారాన్ని 5-10 శాతానికి పరిమితం చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Gold, Investment Plans

ఉత్తమ కథలు