హోమ్ /వార్తలు /బిజినెస్ /

Debit Card Charges: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా టాప్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్, ఏటీఎం చార్జీలు ఇలా!

Debit Card Charges: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా టాప్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్, ఏటీఎం చార్జీలు ఇలా!

ఎస్‌బీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ వరకు.. టాప్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్, ఏటీఎం చార్జీలు ఇలా!

ఎస్‌బీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ వరకు.. టాప్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్, ఏటీఎం చార్జీలు ఇలా!

Bank Charges | బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే మీకు మీ బ్యాంక్ డెబిట్ కార్డు చార్జీల రూపంలో ఎంత వసూలు చేస్తోందో తెలుసా? లేదంటే ఏటీఎం చార్జీలు ఎలా ఉన్నాయో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  ATM Charges | బ్యాంకులు చాలా సర్వీసులు అందిస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని ఉచిత సేవలు ఉండొచ్చు. అలాగే మరికొన్ని సేవలకు చార్జీలు చెల్లించుకోవాలి. అలాగే కొంత మంది కస్టమర్లకు బ్యాంకులు (Banks) ఏ ఏ చార్జీలు వసూలు చేస్తున్నాయో కూడా తెలియకపోవచ్చు. అయితే బ్యాంక్ అకౌంట్ తెరిచేటప్పుడే అన్ని వివరాలు తెలుసుకోవాలి. బ్యాంక్ కస్టమర్‌గా బ్యాంకులు ఏ ఏ చార్జీలు వస్తున్నాయో తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి ఎలాంటి చార్జీలు వసూలు చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి చాలా వరకు డెబిట్ కార్డులు ఉచితంగానే లభిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు, కార్డ్ రిప్లేస్‌మెంట్ ఫీజు వంటివి చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎస్‌బీఐ విషయానికి వస్తే.. కొన్ని డెబిట్ కార్డులపై రూ. 300 వరకు జాయినింగ్ ఫీజు చెల్లించుకోవాలి. వార్షిక ఫీజు రూ. 125 నుంచి రూ. 350 వరకు ఉంది. కార్డు రిప్లేస్‌మెంట్ చార్జీలు రూ. 300గా ఉన్నాయి.

  బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. దిగివచ్చిన ధరలు

  పీఎన్‌బీలో పలు డెబిట్ కార్డులపై జాయినింగ్ ఫీజు కింద రూ. 250 చెల్లించుకోవాలి. వార్షిక ఫీజు రూ. 500 వరకు ఉంది. కార్డు రిప్లేస్‌మెంట్ చార్జీ రూ. 150గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అయితే పలు డెబిట్ కార్డులపై జాయినింగ్, వార్షిక ఫీజులు రూ.200 నుంచి రూ. 750 వరకు ఉన్నాయి. కార్డు రిప్లేస్‌మెంట్ చార్జీలు రూ. 200 దాకా ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌లో వివిధ డెబిట్ కార్డులపై జాయినింగ్ ఫీజు రూ. 1,999 వరకు ఉంది. వార్షిక ఫీజురూ. 99 నుంచి రూ. 1499 చెల్లించుకోవాలి. అన్ని బ్యాంకులు డూప్లికేషన్ లేదా రీజనరేషన్ ఆఫ్ పిన్ కోసం రూ. 50 వసూలు చేస్తుంటాయి.

  బంపర్ సేల్.. 50 లక్షల ఉచిత విమాన సీట్లు

  ఏటీఎం చార్జీల విషయానికి వస్తే.. ఎస్‌బీఐ కస్టమర్లు నెలలో ఎస్‌బీఐ ఏటీఎం నుంచి ఆరు కన్నా ఎక్కువ సార్ల ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే.. రూ.10, ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉచిత లిమిట్ దాటిన తర్వాత ఉపయోగిస్తే రూ. 20 మేర చార్జీ వసూలు చేస్తోంది. పీఎన్‌బీలో కూడా దాదాపు ఇదే రకమైన చార్జీలు ఉన్నాయి. ఉచిత లిమిట్ దాటితే చార్జీలు పడతాయి.

  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో నెలకు ఐదు సార్ల కన్నా ఎక్కువగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంనుంచి క్యాష్‌ విత్‌డ్రా చేస్తే రూ. 21 చార్జీ పడుతుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంను మూడు సార్ల కన్నా ఎక్కువగా వాడితే అప్పుడు ఇదే చార్జీని చెల్లించుకోవాలి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌లో కూడా దాదాపు ఇలాంటి చార్జీలే ఉన్నాయి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: ATM, Bank charges, Banks, HDFC bank, Personal Finance, Sbi, State bank of india

  ఉత్తమ కథలు