ఏటీఎంలో డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

ఏటీఎంలో కార్డు స్వైప్ చేసిన తర్వాత డబ్బులు రాకపోయినా మీ అకౌంట్‌లో క్యాష్ తగ్గిందా? అయితే ఏం చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 31, 2018, 3:55 PM IST
ఏటీఎంలో డబ్బులు రాకపోతే ఇలా చేయండి!
ఏటీఎంలో కార్డు స్వైప్ చేసిన తర్వాత డబ్బులు రాకపోయినా మీ అకౌంట్‌లో క్యాష్ తగ్గిందా? అయితే ఏం చేయాలో తెలుసుకోండి.
 • Share this:
మీరు ఏటీఎంకు వెళ్తే ప్రతీసారి అందులోంచి డబ్బులు రావు. మెషీన్‌లో డబ్బులు ఉన్నాసరే ఒక్కోసారి ట్రాన్సాక్షన్ డిక్లైన్ అవుతుంది. మెషీన్‌లోంచి డబ్బులు రాకపోయినా కొన్ని సందర్భాల్లో అకౌంట్‌లో డబ్బులు తగ్గుతుంటాయి. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు. మీకూ అలాంటి అనుభవమే ఎదురైతే ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.


 • మొదట బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి. మీ సమస్య చెప్పండి.
  అయినా మీ సమస్య పరిష్కారం కాకపోతే దగ్గర్లోని బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లండి. అక్కడి సిబ్బందికి కంప్లైంట్ ఇవ్వండి.

 • బ్యాంకు సిబ్బందిని కలిసినా ఫలితం లేకపోతే బ్రాంచ్ మేనేజర్‌ని కలవండి.
  బ్యాంకు మేనేజర్ కూడా సమస్య పరిష్కరించకపోతే గ్రీవెన్స్ సెల్‌లో కంప్లైంట్ ఇవ్వండి. ఈ సెల్‌లో చేసే ఫిర్యాదులన్నీ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి దగ్గరకు వెళ్తాయి.

 • మీరు నేరుగా బ్యాంకు వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు పోస్ట్ చేయొచ్చు. వాటిని సంబంధిత శాఖలు పరిష్కరిస్తాయి.
 • మీరు ఇన్ని ప్రయత్నాలు చేసినా మీ సమస్య పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించిన ఉన్నతాధికారి కస్టమర్ల కంప్లైంట్లను స్వీకరించి పరిష్కరిస్తారు. కమర్షియల్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, సహకార బ్యాంకులన్నీ అంబుడ్స్‌మన్ పరిధిలోకి వస్తాయి. ప్రతీ రాష్ట్ర రాజధానిలో ఈ ఆఫీస్ ఉంటుంది. అడ్రస్ వివరాలు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉంటాయి.

 • చివరకు అంబుడ్స్‌మన్ అధికారికి ఫిర్యాదు చేసినా మీ సమస్య పరిష్కారం కాకపోతే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ http://ncdrc.nic.in/ వెబ్‌సైట్‌ని ఆశ్రయించండి. ఇక్కడ మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది.

 • మీరు ఇన్నిరకాలుగా ప్రయత్నించినా అకౌంట్‌లో తగ్గిన డబ్బులు జమ కాకపోతే కోర్టును కూడా ఆశ్రయించొచ్చు. సంబంధిత బ్యాంకుపై జిల్లా కోర్టులో కేసు వేయొచ్చు. భారత పౌరులకు ఆ హక్కు ఉంది. మీ డబ్బులు పొందడమే కాదు... న్యాయం కోసం మీరు ఖర్చుపెట్టిన ప్రతీ రూపాయిని తిరిగి పొందొచ్చు.

 • అయితే మీకు బ్యాంకుల దగ్గర ఈ సమస్యలు పరిష్కారమవుతాయి. మరీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే రాదు. అకౌంట్‌లో తగ్గిన మీ డబ్బులు ఖచ్చితంగా తిరిగివస్తాయి. కాకపోతే కొన్నిరోజుల సమయం పడుతుంది.


ఇవి కూడా చదవండి:

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి కొత్త రూల్స్

రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్ల ఫీచర్స్ ఇవే!

సెప్టెంబర్ 6న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఎల్జీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
Published by: Santhosh Kumar S
First published: August 31, 2018, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading