WHAT TO DO IF YOU TRANSFER FUNDS TO THE WRONG ACCOUNT HOW TO GET REVERSAL MONEY MK
What to do if you Transfer Money to the Wrong Account: పొరపాటుగా మీ డబ్బును వేరే అకౌంట్‌కు బదిలీ చేశారా.. అయితే వారి నుంచి ఇలా రికవరీ చేయండి.
(ప్రతీకాత్మక చిత్రం)
కొన్ని సార్లు మీ డబ్బు పొరపాటును తప్పుడు బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేసినప్పుడు చాలా కంగారు పడతారు. అకౌంట్ నంబర్లో ఒక్క అంకె తప్పుగా వేసినా అది భారీ నష్టాన్ని మిగిల్చవచ్చు. పొరపాటున ఇతరుల బ్యాంకు అకౌంట్‌కి డబ్బులు పంపించేస్తాం.
What to do if you Transfer Money to the Wrong Account: కొన్ని సార్లు మీ డబ్బు పొరపాటును తప్పుడు బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేసినప్పుడు చాలా కంగారు పడతారు. అకౌంట్ నంబర్లో ఒక్క అంకె తప్పుగా వేసినా అది భారీ నష్టాన్ని మిగిల్చవచ్చు. పొరపాటున ఇతరుల బ్యాంకు అకౌంట్‌కి డబ్బులు పంపించేస్తాం. కానీ, వాటిని ఎలా తిరిగి డబ్బులు పొందాలో అర్థం కాదు. తప్పుడు డిటైల్స్ వలన మన అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతే తిరిగి పొందడానికి కొన్ని మార్గాలున్నాయి. అయితే ఎవరి అకౌంట్ కు డబ్బు పోయిందో అది కనుక హోం బ్యాంకు కాకుండా ఇతర బ్యాంకు అయితే అది ఆమోదించకపోతే, ఆ డబ్బును తిరిగి పొందడం కష్టమని నియమం చెబుతోంది. ఈ పరిస్థితిలో మీ బ్యాంకు కూడా మధ్యవర్తిగా మాత్రమే పనిచేస్తుంది. దీన్ని నివారించడానికి, ఏ పొరపాటు వల్ల డబ్బు తప్పు అకౌంట్ కు బదిలీ చేయబడిందని మనం తెలుసుకోవాలి. మీరు అకౌంట్ సంఖ్యను చేతితో వ్రాసినా లేదా టైప్ చేసినా, దానిలో అంకెలు తారుమారు కావచ్చు. అకౌంట్ నంబరు , IFSC కోడ్ రాయడంలో పొరపాటు కూడా మిమ్మల్ని నష్టపరుస్తుంది. బ్యాంకులో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే, అప్పుడు డబ్బు తప్పు అకౌంట్ కు వెళ్లవచ్చు.
తప్పు బదిలీ విషయంలో ఏమి చేయాలి
తప్పు అకౌంట్ కు డబ్బు బదిలీ అయితే, వెంటనే బ్యాంక్ బ్రాంచ్‌కు కాల్ చేసి మేనేజర్‌తో మాట్లాడండి. మీరు నమోదు చేసిన అకౌంట్ నెంబర్ ఏదైనా బ్యాంకులో ఉన్నప్పటికీ పొరపాటున దానికి నగదు బదిలీ అయినట్లయితే, వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు తప్పుడు అకౌంట్ లోకి వెళ్లిందని నిరూపించడానికి అన్ని ఆధారాలను బ్యాంకుకు ఇవ్వండి. పేరును తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల డబ్బు బదిలీ చేయబడితే, ఆ పేరు , అకౌంట్ నంబర్ మొదలైన వాటికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీ బ్యాంక్‌కి ఇవ్వండి. త్వరిత చర్య కోసం మీ ఫిర్యాదును బ్యాంక్‌కి ఇమెయిల్ చేయాలి.
తప్పు అకౌంట్ కు డబ్బు బదిలీ అయినప్పుడు బ్యాంకు కేవలం మధ్యవర్తి పాత్రను మాత్రమే పోషిస్తుంది. ఒకే బ్యాంక్‌కి చెందిన రెండు వేర్వేరు అకౌంట్ ల మధ్య తప్పు బదిలీ జరిగితే, ఆ లావాదేవీని రద్దు చేయడానికి బ్యాంక్ అభ్యర్థనను పంపవచ్చు. డబ్బు బదిలీ చేయబడిన బ్యాంక్ అకౌంట్ రివర్సల్‌ను అనుమతించినట్లయితే, అది తిరిగి చెల్లించబడుతుంది. 7 పని దినాలలోపు డబ్బు వాపసు చేయవచ్చు. వేరే బ్యాంకుకు నగదు బదిలీ అయితే ఆ శాఖకు వెళ్లి బ్యాంకు అధికారులను కలవాల్సి ఉంటుంది.
బ్యాంకు డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే ఏమి చేయాలి
డబ్బులు పొరపాటున పంపిన అకౌంట్ వేరే బ్యాంక్‌కు చెందినది అయితే కొద్దిగా ఇబ్బందులు తప్పువు. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులు కనీసం రెండు నెలల టైమ్ తీసుకుంటాయి. పొరపాటున మనీ పంపిన బ్యాంక్ అకౌంట్‌కు చెందిన బ్రాంచును కలవాలి. ఎవరికి డబ్బులు పంపారో ఆ వ్యక్తిని సంబంధిత బ్యాంక్ బ్రాంచు కాంటాక్ట్ అవుతుంది. ఆ వ్యక్తి డబ్బులు తిరిగి ఇచ్చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు.
ఎవరి అకౌంట్ లో డబ్బులు పోయాయో, ఆ వ్యక్తి దీనిని అంగీకరిస్తే, మీరు ID రుజువు, చిరునామా రుజువు , కొన్ని పత్రాలను అతని బ్యాంకుకు సమర్పించవలసి ఉంటుంది. అయినప్పటికీ, ఆ వ్యక్తి డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే, అతను అతనిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంకు , లబ్ధిదారుడి బ్యాంకు వేర్వేరుగా ఉన్నప్పుడు పరిస్థితి మరింత దిగజారుతుంది. డబ్బును తిరిగి ఇవ్వడానికి వ్యక్తి సిద్ధంగా ఉన్నారా లేదా అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. అతడు నిరాకరిస్తే, పరిస్థితి క్లిష్టంగా మారవచ్చు.
డబ్బు బదిలీ చేయడానికి ముందు, మీరు తప్పనిసరిగా అకౌంట్ నంబర్ , IFSC కోడ్‌ను తనిఖీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ స్పష్టమైన సూచన ఉంది. ఈ రెండూ సరైనవే అయితే తప్పుడు బదిలీ అనే ప్రశ్నే తలెత్తదు. పేరు ఒకేలా ఉండవచ్చు, కానీ అకౌంట్ సంఖ్య ఒకేలా ఉండకపోవచ్చు, అది కూడా IFSC కోడ్ సరైనది అయితే. పొరపాటున డబ్బు బదిలీ చేయబడితే, వెంటనే మీ బ్యాంకుకు ఫిర్యాదు చేసి, రివర్సల్ కోసం అభ్యర్థించండి. కాగితంపై లేదా ఇమెయిల్ ద్వారా ఎల్లప్పుడూ వ్రాతపూర్వక ఫిర్యాదును ఫైల్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.