హోమ్ /వార్తలు /బిజినెస్ /

PPF Account: పీపీఎఫ్‌ అకౌంట్ ఓపెన్ చేసి 15 సంవత్సరాలు పూర్తయిందా.. తర్వాత మీరు చేయవలసినవి ఇవే..

PPF Account: పీపీఎఫ్‌ అకౌంట్ ఓపెన్ చేసి 15 సంవత్సరాలు పూర్తయిందా.. తర్వాత మీరు చేయవలసినవి ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PPF అనేది 15 సంవత్సరాలకు మెచ్యూర్‌ అవుతుంది. సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాలు అందుతాయి. వడ్డీ, మినహాయింపులకు కూడా పన్ను ఉండదు. అయితే PPF అకౌంట్ ఓపెన్ చేసి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎలాంటి సౌలభ్యాలు ఉన్నాయో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

ఇతర పథకాల మాదిరిగా కాకుండా మెచ్యూరిటీ(Maturity) తర్వాత డబ్బును తీసుకోవడం లేదా ప్రస్తుత వడ్డీ రేటులో (Interest Rates) ఆదాయాన్ని తిరిగి పెట్టుబడి పెట్టడం వంటి సౌలభ్యాలను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అందిస్తుంది. PPF అనేది 15 సంవత్సరాలకు మెచ్యూర్‌ అవుతుంది. సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాలు అందుతాయి. వడ్డీ, మినహాయింపులకు కూడా పన్ను ఉండదు. అయితే PPF అకౌంట్ ఓపెన్(Account Open) చేసి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎలాంటి సౌలభ్యాలు ఉన్నాయో తెలుసుకోండి. కొన్ని సంవత్సరాల పాటు PPF డబ్బు అవసరం లేకపోతే, అకౌంట్‌ మెచ్యూరిటీని మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవడం ఉత్తమం. నిజానికి బాగా సంపాదన ఉంటే వారు ఎక్స్‌టెన్షన్-విత్-కంట్రిబ్యూషన్స్(Extension With Contribution) ఆప్షన్‌ను(Option) కూడా ఎంచుకోవచ్చు. వివిధ అవసరాలు ఉన్న వ్యక్తులు మెచ్యూర్‌ అయిన PPF అకౌంట్‌కు సంబంధించి స్థూలంగా మూడు ఎంపికలు చేసుకోవచ్చు..

* PPF అకౌంట్‌ను మూసివేయాలి

మొత్తం PPF కార్పస్‌ను పన్ను రహితంగా తీసుకొని, అకౌంట్‌ను మూసి వేయవచ్చు.

* నగదు జమ చేయకుండా 5 సంవత్సరాల పాటు పొడిగింపు

ఇందులో PPF అకౌంట్‌ కాలం మరో 5 సంవత్సరాలు పొడిగిస్తారు. కానీ ఎలాంటి నగదు అకౌంట్‌లోకి జమ చేయాల్సిన అవసరం లేదు. ఈ 5 పొడిగించిన సంవత్సరాలకు అకౌంట్‌లో ఉన్న మొత్తానికి వడ్డీ అందుతుంది. డబ్బు విత్‌డ్రా చేయవలసి వస్తే.. సంవత్సరంలో ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎంత మొత్తం ఉపసంహరించుకోవాలనే దానిపై ఎలాంటి పరిమితి లేదు.

* నగదు జమ చేస్తూ.. 5 సంవత్సరాల పాటు పొడిగింపు

ఈ సందర్భంలో పొడిగించిన వ్యవధిలో ప్రతి సంవత్సరం మీ PPF అకౌంట్‌లో (కనీసం కనిష్టంగా) నగదు జమ చేయవచ్చు. అకౌంట్‌ బ్యాలెన్స్, కొత్తగా జమ చేసిన డబ్బుకు వడ్డీ లభిస్తుంది. కానీ కొన్ని ఉపసంహరణ పరిమితులు ఉన్నాయి. 5 సంవత్సరాలలో పొడిగింపు వ్యవధి ప్రారంభంలో ఉన్న అకౌంట్‌ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే డబ్బు తీసుకొనేందుకు అనుమతి ఉంటుంది. అకౌంట్ వ్యవధిని పొడిగించడం గురించి బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు తెలియజేయకపోతే, నగదు జమ లేకుండా పొడిగింపు అనేది డీఫాల్ట్‌గా తీసుకొంటారు. అలాగే ఇన్‌స్ట్రుమెంట్ వ్యవధిలో వడ్డీ రేటులో ఏదైనా మార్పు ఇప్పటికే ఉన్న PPF అకౌంట్‌లను, వాటి మొత్తం బ్యాలెన్స్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. పొడిగింపు ప్రక్రియలో కనీసం ఒక్కసారైనా శాఖను భౌతికంగా సందర్శించవలసి ఉంటుంది.

* సరైన మెచ్యూరిటీ ఎక్స్‌టెన్షన్ ఎలా ఎంచుకోవాలి?

రాబోయే 5 సంవత్సరాలకు PPF డబ్బు అవసరం లేకుంటే, అప్పుడు దానిని నగదు జమతో పొడిగించడం ఉత్తమం. PPF బ్యాలెన్స్‌ ఎక్కువగా ఉండి పదవీ విరమణ చేసినట్లయితే, దానిని పెన్షన్ సాధనంగా కూడా ఉపయోగించవచ్చు. పీపీఎఫ్‌లో రూ.50 లక్షలు ఉంటే.. ఇప్పుడు నగదు జమ చేయకుండా పొడిగింపు ఎంచుకొంటే.. ఏటా 7 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంటే ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో రూ.3.5 లక్షలు. ఆ విధంగా వడ్డీ 7.1 శాతం అయితే, ప్రిన్సిపల్ అమౌంట్‌ అలాగే ఉంటుంది. PPF వడ్డీ పన్ను రహితం కాబట్టి, ప్రతి సంవత్సరం పన్ను రహిత పెన్షన్ ఆదాయంగా రూ.3.5 లక్షలు పొందుతారు.

ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం PPFని ఉపయోగిస్తుంటే, పిల్లల చదువు కోసం రూ.20 లక్షలు ఉంటే, అకౌంట్‌ నుండి డబ్బును తీసుకోలేరు. అకౌంట్‌ను మూసివేయడం అనేది స్పష్టమైన ఎంపికగా కనిపించవచ్చు. అయితే ఈ సందర్భంలో కూడా ఎప్పుడైనా పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు కాబట్టి అకౌంట్‌ను మూసివేయడానికి బదులుగా తదుపరి నగదు జమ లేకుండా పొడిగింపు కోసం వెళ్లడం మంచి ఎంపిక. లేదా 4 సంవత్సరాల కోర్సు కోసం, ప్రతి సంవత్సరం PPF బ్యాలెన్స్‌లో 25 శాతం మాత్రమే ఉపసంహరించుకోవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Interest rates, Investments, PPF

ఉత్తమ కథలు