news18-telugu
Updated: November 23, 2020, 12:44 PM IST
ప్రతీకాత్మకచిత్రం
బ్యాంకులకు కొన్ని సందర్భాల్లో అనేక కారణాల వల్ల మీ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేస్తుంటాయి. అయితే ఈ చర్య ప్రధానంగా బ్యాంక్ ఖాతా నుండి అనుమానాస్పద మోసపూరిత చర్యలు ఏవైనా గమనించినప్పుడు బ్యాంకులు ఇలా చేస్తుంటాయి. అలాగే కోర్టు ఇచ్చిన డిక్రీ, చెల్లించని ప్రైవేట్ రుణాలు, పన్ను బకాయిలు, మనీలాండరింగ్, ఒక వ్యక్తికి లేదా సంస్థకు డబ్బు చెల్లించకపోవడం లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిధుల దుర్వినియోగం చేయడం వంటి సందర్భాల్లో బ్యాంకులు మీ ఖాతాను ఫ్రీజ్ చేస్తుంటాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో బ్యాంకులు ఖాతా స్తంభింపజేసిన తర్వాత, ఖాతాదారుడే డబ్బు విత్ డ్రా చేయలేడు కాని ఖాతా స్తంభింపజేసే వరకు వారి ఖాతాలో డబ్బు జమ చేయడానికి మాత్రం అనుమతి ఉంటుంది.
బ్యాంక్ ఖాతాను అన్‌ఫ్రీజ్ చేయడం ఎలా?ఖాతా ఫ్రీజ్ అంటే, ఖాతాదారుడు బ్యాంకు నుండి తదుపరి నోటీసు వచ్చేవరకు వారి బ్యాంకు ఖాతాతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు. అంతేకాదు అన్ని రకాల చెల్లింపులు, లావాదేవీలు నిలిచిపోతాయి. మనదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆదాయపు పన్ను అధికారులు, కోర్టులు, సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసే అధికారం ఉంది.
చాలా బ్యాంకులు ఖాతాదారులకు నోటీసు ఇవ్వడం ద్వారా వారి ఖాతాను స్తంభింపజేసే అవకాశం ఉంది. చట్టబద్ధమైన కారణాల వల్ల ఖాతా స్తంభింపజేస్తే అది స్తంభింపజేయడం సుదీర్ఘమైన, శ్రమతో కూడుకున్న ప్రక్రియ.
బ్యాంక్ ఖాతా స్తంభింపజేసినప్పుడు ఖాతాదారుడు ఏమి చేయాలి?
బ్యాంక్ ఖాతా ఎందుకు స్తంభింపజేయబడింది అనే దానిపై, బ్యాంకులు వివిధ నియమాలు తయారు చేశాయి. మోసపూరిత లావాదేవీల విషయంలో, ఖాతాదారుడు నేరుగా బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా లేదా వారికి మెయిల్ చేయడం ద్వారా లేదా కస్టమర్ కేర్ సేవలను డయల్ చేయడం ద్వారా ఈ పరిస్థితిని నేరుగా పరిష్కరించవచ్చు.
కొన్నిసార్లు, అసాధారణమైన పెద్ద కొనుగోళ్లు చేసినప్పుడు కూడా, బ్యాంక్ అకౌంట్ ఫ్లాగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ అధికారులకు తెలియజేయకుండా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించి విదేశాలలో చేసిన కొనుగోళ్లకు, కార్డు దొంగిలించబడిందని బ్యాంక్ పరిగణించవచ్చు. అందువల్ల మీ ఖాతాను రక్షించడానికి లావాదేవీలు ఫ్లాగ్ చేసే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో, ఖాతాదారుడు బ్యాంక్ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించడానికి మీ గుర్తింపును నిరూపించుకోవాలి.
దివాలా
ఒకవేళ, ఖాతాదారుడు దివాళా తీసినట్లయితే, రుణదాతలు మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు తీసుకోకుండా నిరోధించడానికి మీరు దివాలా కోసం దాఖలు చేయవచ్చు. దివాలా కోసం దాఖలు చేయడం ద్వారా, మీ ఖాతా నుంచి డబ్బు సేకరణ కార్యకలాపాలను నిలిపివేస్తుంది. మీ బ్యాంక్ ఖాతాను స్తంభింపజేయదు. కోర్టు ఉత్తర్వుల ద్వారా బ్యాంకు ఖాతాను స్తంభింపచేసే బాధ్యత కలిగిన బ్యాంకు అధికారికి దివాలా దాఖలు చేసిన రుజువును అందించాలి.
Published by:
Krishna Adithya
First published:
November 23, 2020, 12:44 PM IST