హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Loans: గోల్డ్ లోన్స్.. బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన?

Gold Loans: గోల్డ్ లోన్స్.. బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన?

Gold Loans: గోల్డ్ లోన్స్.. బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన?

Gold Loans: గోల్డ్ లోన్స్.. బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన?

Budget 2023-24 | కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో గోల్డ్ లోన్స్‌కు సంబంధించి కీలక ప్రకటన చేయనుందా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. మోదీ సర్కార్ గోల్డ్ లోన్స్‌పై కీలక ప్రతిపాదనలు చేయొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Gold News | గోల్డ్ లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బంగారు రుణాలు అనేవి చాలా సర్వసాధారణంగా. అలాగే చాలా మంది గోల్డ్ లోన్స్ (Gold Loans) తీసుకుంటూ ఉంటారు. చెల్లిస్తూ ఉంటారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో బంగారు రుణాలకు చాలా పెద్ద మార్కెట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే బ్యాంకులు (Bank) కూడా ప్రత్యేకంగా గోల్డ్ లోన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి గ్యాంరటీ లోన్స్. తనఖా పెట్టుకొని లోన్ ఇస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇంతటి ప్రాధాన్యం ఉన్న గోల్డ్ లోన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో కీలక ప్రకటన చేయొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. పరిశ్రమ వర్గాలు కూడా ఈసారి బడ్జెట్‌లో గోల్డ్ లోన్స్‌కు సంబంధించి కీలక ప్రకటన చేయొచ్చని అంచనా వేస్తున్నాయి. గోల్డ్ లోన్స్ విభాగంలో క్రెడిట్ డిమాండ్ పెరుగుతోందని, దీన్ని పరిష్కరించే దిశగా బడ్జెట్ 2023లో కేంద్రం కీలక ప్రతిపాదనలు చేయొచ్చని పేర్కొంటున్నాయి. అలాగే మైక్రో లోన్స్, రైతులకు రుణాలు, మైక్రో బిజినెస్‌ లోన్స్ సహా అర్హత ఉన్న బంగారు రుణాలకు ప్రియారిటీ సెక్టార్ స్టేటస్‌ను (ప్రాధాన్యతా రంగ స్థాయి) పునరుద్ధరించే నిర్ణయాన్నిమోదీ సర్కార్ బడ్జెట్‌లో ప్రకటించే ఛాన్స్ ఉందని తెలియజేస్తున్నాయి.

2 నెలల కోర్సు .. అరటితో ఏటా రూ.15 లక్షల ఆదాయం!

ఇండల్ మనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో ఉమేష్ మోహనన్ ప్రకారం.. గోల్డ్ లోన్స్ విభాగంలో డిమాండ్ పెరుగుతోందని, అలాగే గోల్డ్ లోన్ మంజూరులో కూడా స్థిరమైన వృద్ధి నమోదు అవుతూ వస్తోందని తెలిపారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు పొందేందుకు గోల్డ్ లోన్స్ ఒక ప్రభావవంతమైన సాధనంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

జస్ట్ 6 నెలల్లోనే రూ.లక్షకు రూ.3 లక్షలు.. డబ్బుల వర్షం కురిపించిన బ్యాంక్‌!

బడ్జెట్ 2023లో ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ కంపెనీలకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. దీని వల్ల గోల్డ్ లోన్ మార్కెట్ మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందని, చాలా మందికి రుణాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే గోల్డ్ లోన్స్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు గోల్డ్ లోన్ కంపెనీలు, బ్యాంకుల మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం అని, దీన్ని ప్రోత్సహించేలా సమర్థవంతమైన కో-లెండింగ్ మార్గదర్శకాలను బడ్జెట్ ప్రతిపాదించాలని కోరారు.

ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ మాట్లాడుతూ.. చాలా మంది వాటి ఆర్థిక అవసరాల కోసం గోల్డ్ లోన్స్ తీసుకుంటూ ఉన్నారని, అందువల్ల గోల్డ్ లోన్స్‌కు కూడా ప్రియారిటీ సెక్టార్ స్టేటస్ ఇవ్వాలని ఈయన తెలియజేశారు. ఇకపోతే కేంద్రం బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆవిష్కరించనున్నారు.

First published:

Tags: Budget 2023, Gold, Gold jewellery, Gold loans

ఉత్తమ కథలు