హోమ్ /వార్తలు /బిజినెస్ /

ధనలక్ష్మి తలుపు తడితే... లాక్ డౌన్‌లో రూ.1 లక్షను 8 లక్షలు చేసిన బంగారు కోడిపెట్ట ఇదే...

ధనలక్ష్మి తలుపు తడితే... లాక్ డౌన్‌లో రూ.1 లక్షను 8 లక్షలు చేసిన బంగారు కోడిపెట్ట ఇదే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Xelpmoc Stock: ఈస్టాక్ సరిగ్గా భారత దేశంలో లాక్ డౌన్ ప్రకటించక ముందు అంటే మార్చి 18 నుంచి ప్రస్తుతం అంటే నవంబర్ 20 నాటికి ఈ స్టాక్ ఏకంగా 680 శాతం పెరిగింది.

Xelpmoc Stock: కరోనా కాలంలో చాలా మంది తమ ఆదాయాలను కోల్పోయారు. అంతేకాదు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందుల పాలయ్యారు. చాలా మందిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇక అటు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయి, తిరిగి పుంజుకున్నాయి. అయితే అటు రియల్ ఎస్టేట్ తో పాటు బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా దెబ్బ తిన్నాయనే చెప్పాలి. స్టాక్ మార్కెట్లో కూడా కొన్ని స్టాక్స్ తమ జీవిత కాల కనిష్ట స్థాయిని తాకాయి. అయితే కొన్ని స్టాక్స్ మాత్రం విచిత్రంగా ఊహకు అందనంత స్థాయిలో రాబడిని అందించాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన స్టాక్ ఏదైన ఉందంటే Xelpmoc Stock గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈస్టాక్ సరిగ్గా భారత దేశంలో లాక్ డౌన్ ప్రకటించక ముందు అంటే మార్చి 18 నుంచి ప్రస్తుతం అంటే నవంబర్ 20 నాటికి ఈ స్టాక్ ఏకంగా 680 శాతం పెరిగింది. అంటే సరిగ్గా మార్చి 18న ఎవరైతే ఈ స్టాక్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారో వారికి అక్టోబర్ 6 (జీవిత కాల గరిష్ట స్థాయి తాకింది) నాటికి సుమారు 8 లక్షల రూపాయలకు పైగా లాభం పొందారు. కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఈ స్టాక్ ఏకంగా ఒక రూపాయికి 8 రెట్లు లాభం అందించింది. ఇది ఒక రకంగా బంగారు బాతు అనే చెప్పాలి. ఎందుకంటే కరోనా కాలంలో ప్రతీ ఒక్కరి ఆదాయాలు తరిగిపోయాయి. కానీ ఈ కంపెనీ మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ సాధించింది.

Xelpmoc కథ ఏంటంటే...?

ఇక ఈ కంపెనీ పేరు స్పెల్లింగ్ చదవగానే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. Xelpmoc ఏంటా అనుకుంటాం...కానీ దీని వెనుక ఒక కథ ఉంది. ఏంటంటే...ఈ కంపెనీ డిజైనింగ్ విభాగంలో ఉంది. వీరి కంపెనీ ఉద్దేశ్యం ఏంటంటే...చాలా జటిలమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కారం చూపిస్తామని అంటుంటారు. అంటే Complex Things ను కూడా సింపుల్ గా తేల్చేస్తారన్నమాట..ఇక కంపెనీ పేరు విషయానికి వస్తే Complex అనే పదాన్ని తిరగేస్తే Xelpmoc అనే పదం వస్తుంది. ఇదే కంపెనీ పేరుగా ప్రమోటర్లు నిర్ణయించారు.

Xelpmoc బిజినెస్ ఏంటి...?

ఈ కంపెనీని 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ పలు స్టార్టప్ కంపెనీలు సీడ్ ఫండింగ్ చేస్తుంటుంది. 2015 సంవత్సరంలోనే వీరు ఫార్టిగో లాజిస్టిక్స్ అనే కంపెనీలో సీడ్ ఫండింగ్ చేశారు. 2019లో Xelpmoc ఐపీఓ ద్వారా ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్స్ లో లిస్ట్ అయ్యింది. ఈ కంపెనీ ప్రధానంగా ఈ కామర్స్, ట్రాన్స్ పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, సోషల్ మీడియా, కన్ స్ట్రక్షన్, ఎడ్యుకేషన్ లాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఈ కంపెనీ ఇఫ్పటి వరకూ 15 స్టార్టప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటి వరకూ ఈ కంపెనీ స్టార్టప్స్ లో 3.73 కోట్లు పెట్టుబడి పెట్టింది. కాగా వీటి విలువ పెరిగి 34 కోట్లకు పెరిగింది.

ఇన్వెస్టర్లకు పండగే...

Xelpmoc స్టాక్ మార్చిలో కేవలం రూ.40 నుంచి రూ.50 మధ్యలో కదలాడింది. అయితే లాక్ డౌన్ కాలంలో కూడా ఈ స్టాక్ దూకుడు ప్రదర్శించింది. అయితే ప్రస్తుతం ఈ స్టాక్ రూ.240 వద్ద ట్రేడవుతుంది. (నవంబర్ 20 మార్కెట్ ముగిసే నాటికి రూ. 247.80 వద్ద స్థిరపడింది) ఇక ఈ స్టాక్ అక్టోబర్ 8 నాటికి ఈ స్టాక్ జీవిత కాల గరిష్ట స్థాయి రూ.355 పలికింది.

First published:

Tags: Money making, Stock Market

ఉత్తమ కథలు