HOME »NEWS »BUSINESS »what is upi and how it works full details here ms gh

What Is UPI: యూపీఐ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది..? ఈ వివరాలు మీ కోసమే..

What Is UPI: యూపీఐ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది..?  ఈ వివరాలు మీ కోసమే..
ప్రతీకాత్మక చిత్రం

What Is UPI: ఈ డిజిటల్  చెల్లింపుల యుగంలో   యూపీఐ గురించిన ప్రాథమిక సమాచారం కూడా తెలుసుకోవడం అత్యావశ్యకం. అందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

  • News18
  • Last Updated: December 21, 2020, 22:44 IST
  • Share this:
యూపీఐ (Unified Payment Interface-UPI) గురించి ఈ రోజుల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరోక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. UPI ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది.  ఈ డిజిటల్  చెల్లింపుల యుగంలో   యూపీఐ గురించిన ప్రాథమిక సమాచారం కూడా తెలుసుకోవడం అత్యావశ్యకం. అందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

UPIని ఉపయోగించడానికి మీరు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అంతేకాకుండా ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి మీ బ్యాంకు మిమ్మల్ని అనుమతించాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, ICICI లాంటి బ్యాంకులు సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. ఏ బ్యాంకులైతే యూపీఐ లావాదేవీలను అనుతిస్తాయో వాటి జాబితాను పరిశీలించి మీ స్మార్ట్ ఫోన్ లో UPI సపోర్ట్ చేసే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. సాధారణంగా యూపీఐ విధానాన్ని BHIM యాప్ లో వినియోగిస్తారు. దీన్ని NPCI అభివృద్ధి చేసింది. ఈ యాప్ కాకుండా ప్రైవేట్ అనువర్తానాలైన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమేజాన్ పే లాంటి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ధ్రువీకరణ కోసం మీ ఫోన్ నెంబరును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలి.



UPIని ఎలా ఏర్పాటు చేయాలి?
మీరు ఎంచుకున్న యూపీఐ యాప్ ను డౌన్ లోడ్ చేసిన తర్వాత మీ ఎంపికల ద్వారా బ్యాంకును ఎన్నుకోవాలి. ఇది మీ బ్యాంకు ఖాతా అని ధ్రువీకరించడానికి బ్యాంకు వన్ టైమ్ పాస్వర్డ్(One Time Password-OTP) పంపుతుంది. మీ ఓటీపీ ధ్రువీకరించిన తర్వాత మీ వర్చువల్ చెల్లింపు చిరునామా(VPA) సృష్టించబడుతుంది.

BHIM యాప్ ను ఉపయోగించి యూపీఐ ఖాతాను ఇలా ఏర్పాటు చేసుకోండి..

  • స్టెప్-1: ముందుగా BHIM యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.

  • స్టెప్-2: అనంతరం భాషను(Language) ఎంచుకోవాలి.

  • స్టెప్-3: మీ బ్యాంకుతో రిజిస్టరైన మొబైల్ నెంబరు ఏ సిమ్ కార్డు దాన్ని సెలక్ట్ చేసుకోవాలి.

  • స్టెప్-4: నాలుగు అంకెల లాగిన్ పాస్వర్డ్ ను సెటప్ చేయండి. మీరు ఈ నాలుగు అంకెల పాస్వర్డ్ ను నమోదు చేయాలి.

  • స్టెప్-5: అనంతరం మీ బ్యాంకు ఖాతాను ఎంచుకోండి. దాన్ని మీరు లింక్ చేయండి. మీ డెబిట్ కార్డుకు చెందిన చివరి ఆరు అంకెల సంఖ్య, చివరి గడువు తేదీని అందిచడం ద్వారా యూపీఐ పిన్ సెట్ చేయండి.


దీంతో మీ ఖాతా ఇప్పుడు నమోదు చేయబడింది. అంతేకాకుండా మీరు మీ ఖాతాకు డబ్బు బదిలీ చేయమని పంపవచ్చు లేదా అభ్యర్థింవచ్చని (Request) గుర్తించుకోండి. మీరు మీ మొబైల్ వాలెట్ ను యూపీఐకి(UPI) లింక్ చేయలేరు. బ్యాంక్ ఖాతాను మాత్రమే యూపీఐకి లింక్ చేయవచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాను UPI కి లింక్ చేయవచ్చు.

UPI ద్వారా డబ్బును ఎలా బదిలీ చేయాలి..

యూపీఐ ద్వారా డబ్బు బదిలీ(Transfer) చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. రిసీవర్ VPA, ఖాతా సంఖ్య, IFSC కోడ్ లేదా క్యూఆర్ కోడ్(QR Code) ఎంటర్ చేయడం ద్వారా బదిలీ చేయవచ్చు.
డబ్బు బదిలీకి గరిష్ఠ పరిమితి..

NPCI వెబ్ సైట్ ప్రకారం ప్రస్తుతం యూపీఐ లావాదేవీకి గరిష్ఠ పరిమితి రోజులో ఖాతాకు లక్ష రూపాయల వరకు బదిలీ చేయవచ్చు. ఈ గరిష్ఠ పరిమితి లో వేర్వేరు బ్యాంకులు తమ సొంత ఉపపరిమితులను కలిగి ఉండవచ్చు. అందువల్ల ఒకరు బ్యాంకుతో తనిఖీ చేయాలి.
Published by:Srinivas Munigala
First published:December 21, 2020, 22:44 IST

टॉप स्टोरीज