హోమ్ /వార్తలు /బిజినెస్ /

ULIP Plan: యూలిప్ ప్లాన్ అంటే ఏంటీ? ఈ ప్లాన్‌తో లాభమెంత?

ULIP Plan: యూలిప్ ప్లాన్ అంటే ఏంటీ? ఈ ప్లాన్‌తో లాభమెంత?

ULIP Plan: యూలిప్ ప్లాన్ అంటే ఏంటీ? ఈ ప్లాన్‌తో లాభమెంత?
(ప్రతీకాత్మక చిత్రం)

ULIP Plan: యూలిప్ ప్లాన్ అంటే ఏంటీ? ఈ ప్లాన్‌తో లాభమెంత? (ప్రతీకాత్మక చిత్రం)

ULIP Plan | మీ పెట్టుబడికి మంచి రిటర్న్స్ పొందడంతో పాటు ఇన్స్యూరెన్స్ కవర్ కూడా కావాలనుకుంటున్నారా? అయితే యూలిప్ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ గురించి తెలుసుకోండి.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC లో మీరు ఏదైనా పాలసీ వివరాలు చూస్తే అందులో ULIP అని కనిపిస్తుంది. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. చాలావరకు ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ యూలిప్ పేరుతో ఉంటాయి. అసలు యూలిప్ అంటే ఏంటీ? ఈ ప్లాన్ తీసుకుంటే లాభమేనా? నష్టాలు ఏవైనా ఉన్నాయా? ఈ సందేహాలు పాలసీదారుల్లో ఉంటాయి. క్యాపిటల్ మార్కెట్‌కు లింక్ అయి ఉండే పాలసీలను యూలిప్ పాలసీలు అంటారు. అంటే మీరు ఆ పాలసీకి కట్టే డబ్బులను సదరు ఇన్స్యూరెన్స్ సంస్థ ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందులో కాస్త రిస్క్ ఉంటుంది. రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌తో పాటు రిస్క్ కవర్ కోరుకునేవారు యూలిప్ పాలసీ తీసుకోవచ్చు. పాలసీదారులు చెల్లించే డబ్బులో ఎక్కువ భాగం ఈక్విటీ మార్కెట్లలోకి వెళ్తుంది. గడువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలే ఎక్కువ. మెచ్యూరిటీ సమయంలో సదరు పాలసీదారులకు ఉండే యూనిట్లను లెక్కించి వారి పెట్టుబడిపై వచ్చిన రిటర్న్స్‌ను ఇన్స్యూరెన్స్ సంస్థ అందిస్తుంది. అయితే పాలసీదారుల డబ్బులు క్యాపిటల్ మార్కెట్‌లోకి వెళ్తాయి కాబట్టి రిస్కును దృష్టిలో పెట్టుకొని పాలసీ ఎంచుకోవడం మంచిది.

Prepaid Plans: రూ.300 లోపు రీఛార్జ్ చేయాలా? Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే

SBI ATM cash: మీ ఏటీఎం కార్డుతో ఎంత డ్రా చేయొచ్చో తెలుసా? లిమిట్ ఇదే

యూలిప్ పాలసీ ఎవరైనా తీసుకోవచ్చు. అయితే అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాలసీ ఎంచుకోవడం మంచిది. ఇప్పుడే కొత్తగా కుటుంబం ప్రారంభిస్తున్న అంటే కొత్తగా పెళ్లైనవారు దీర్ఘకాలం దృష్టిలో పెట్టుకొని యూలిప్ పాలసీ తీసుకోవచ్చు. ఎక్కువకాలం టర్మ్ ఉంటుంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి. పెట్టుబడిపై ఎక్కువ లాభాలు రావడంతో పాటు మంచి రిస్క్ కవర్ ఉండాలనుకునేవారు ఈ రెండింటి కోసం ఒక యూలిప్ పాలసీ తీసుకుంటే చాలు. యూలిప్ పాలసీలో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్‌ ఎలా ఉందని ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి ఎప్పుడైనా పాలసీ తీసుకోవచ్చు. మీరు ప్రీమియం మూడు నెలలకోసారి లేదా ఆరునెలలకు ఓసారి లేదా ఏడాదికి ఓసారి చెల్లిస్తారు కాబట్టి మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అని ఆలోచించాల్సిన అవసరం లేదు.

SBI Debit Card: మీ ఏటీఎం కార్డు పోయిందా? రెండు నిమిషాల్లో బ్లాక్ చేయండిలా

IRCTC Ooty Tour: ఆరు వేలకే ఊటీ హాలిడే ట్రిప్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

యూలిప్ పాలసీని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ప్లాన్‌గా చూడాలి. అంటే ఎక్కువ కాలం మీరు పెట్టుబడి కొనసాగించాలి. ఒకట్రెండేళ్లకు విత్‌డ్రా చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు. కనీసం 5 ఏళ్లకు పైనే ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందొచ్చు. అయితే లాక్ ఇన్ పీరియడ్‌లో విత్‌డ్రా చేస్తే లాభాలు తక్కువగా వస్తాయి. ఒకవేళ మీరు 15 నుంచి 20 ఏళ్లు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు పొందొచ్చు.

First published:

Tags: Insurance, LIC, Personal Finance

ఉత్తమ కథలు