Home /News /business /

WHAT IS THE RISKS AND REWARDS OF PENNY STOCKS MK

Risks of Penny Stocks: వారెవ్వా..! లక్ష పెట్టుబడి పెడితే..ఆరు నెలల్లో 1 కోటి లాభం లాంటి కాశీ మజిలీ కథలు చూసి మోసపోవద్దు...అసలు కథ ఇదే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

అరెరె ఎంత పనైపోయంది..ఛస్..ఒక లక్ష మనది కాదు అనుకొని ఈ స్టాక్ మీద పెట్టుబడి పెట్టి ఉంటే కోటీశ్వరులు అయిపోయే వాళ్లం కదా అని ఊహల్లో ఊరేగుతున్నారా...అయితే అసలు కథ తెలుసుకోండి...

  What is the Risks and Rewards of Penny Stocks: ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్క మదుపుదారుడి కల Multbagger Stocks తమ పోర్టు ఫోలియోలో ఉండాలి అనుకోవడం. ఇందుకోసం రికమండేషన్ల వెంట పడుతుంటారు. అంతేకాదు అలాంటి రికమండేషన్ల కోసం తమ చేతి చమురుకూడా వదిలించుకుంటారు. దానికి తోడు వార్తా మాధ్యమాల్లో లక్ష పెట్టుబడిని నెలతిరిగే లోపు కోటిగా మార్చేసిన స్టాక్ ఇదే అంటూ ఏమార్చేస్తుంటారు. వాటిని చూసి, అరెరె ఎంత పనైపోయంది..ఛస్..ఒక లక్ష మనది కాదు అనుకొని ఈ స్టాక్ మీద పెట్టుబడి పెట్టి ఉంటే కోటీశ్వరులు అయిపోయే వాళ్లం కదా అని ఊహల్లో ఊరేగుతారు. కానీ ఇవన్నీ అద్భుతాలు మాత్రమే...స్టాక్ మార్కెట్లో ఇలాంటి అద్భుతాలు ప్రతిరోజు జరుగుతుంటాయి. ఓ కవి అన్నట్టుగా అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తరువాత గుర్తించాల్సిన అవసరం లేదు. అన్నట్టుగా కొన్ని పెన్నీ స్టాక్స్ మల్ట్ బ్యాగర్లుగా నిలుస్తుంటాయి. వాటిని మన పోర్టు ఫోలియోలో ఒడిసి పట్టలేకపోయామనే నిరాశ చెందవద్దు. అలాగని చవకబారు వెబ్ సైట్లు, మార్కెట్ తలాతోకా తెలీని మెట్టవేదాంతం వల్లించే సోకాల్డ్ స్వయంప్రకటిత మార్కెట్ పండితుల ఉచ్చులో పడొద్దు. అలాంటి ఆషాఢభూతి లాంటి వాళ్ల మాటలు నమ్మి ఊరుపేరు లేని పెన్నీ స్టాక్స్ లో పెట్టుబడులు పెడితే, మీరు పెట్టిన లక్ష బూడిదపాలు కావడం ఖాయం.

  మరి పెన్నీ స్టాక్స్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం....నిజానికి పెన్నీ స్టాక్‌ లలో డబ్బు పెట్టుబడి పెట్టడం అంటే చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది జూదం అనే చెప్పాలి.

  పెన్నీ స్టాక్స్ అంటే ఏమిటి?

  పెన్నీ స్టాక్స్ లో మార్కెట్ క్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిని నానో లేదా మైక్రో-క్యాప్ స్టాక్‌లు అని కూడా అంటారు. లార్జ్ క్యాప్ కంపెనీలతో పోల్చితే ఈ స్టాక్‌ల గురించి పెద్దగా మీకు సమాచారం లభించదు. ఈ స్టాక్‌లలో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. US స్టాక్ ఎక్స్ చేంజ్ లో ఒక స్టాక్ 5 డాలర్ల కంటే తక్కువగా ఉంటే  దాన్ని పెన్నీ స్టాక్‌గా పరిగణిస్తారు. ఇక బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ లో అయితే స్టాక్ ధర రూ. 10 కంటే తక్కువగా ఉండటంతో పాటు, వీటి మార్కెట్ క్యాప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

  పెన్నీ స్టాక్స్ లో లొసుగులు ఎక్కువగా ఉంటాయి...వీటిని ఆపరేట్ చేయడం సులభం

  పెన్నీ స్టాక్స్ ధర చాలా తక్కువ రేంజులో ఉంటుంది. కాబట్టి వీటిని కొందరు వ్యక్తులు ఆపరేట్ చేస్తుంటారు. అంటే కృత్రిమంగా వాటి ధరను పెంచే ప్రయత్నం చేయడం. ఇందులో మాయాజాలం ఏంటో అర్థం చేసుకుందాం. ఇలాంటి పెన్నీ స్టాక్స్ ను ఆపరేట్ చేయడానికి ముందు, కొందరు వ్యక్తులు ఎంపిక చేసుకున్న పెన్నీ షేర్లలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా దాని ధరను అమాంతం పెంచుతారు. అయితే వేగంగా పెరుగుతున్న స్టాక్ ధరను చూసి బయ్యర్లు ఈ స్టాక్‌లలో భారీగా పెట్టుబడి పెడుతుంటారు. ఒక్కసారిగా స్టాక్ ధర పెరగిన అనంతరం. స్టాక్ ఆపరేటర్లు విడతల వారిగా స్టాక్స్ ను అమ్మేసి, లాభాల స్వీకరణతో బయటికి వెళ్లిపోతారు. గరిష్ట స్థాయిలో డబ్బు పెట్టి ఇరుక్కుపోయిన వారు నాలుక్కరుచుకోవడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోతుంది.

  Samsung Galaxy M52 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,500 డిస్కౌంట్... ఆఫర్ 3 రోజులే

  పూర్తి వివరాలను తెలుసుకున్నాకే పెట్టుబడి పెట్టండి..

  అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే...పెన్నీ స్టాక్స్ అన్నీ అంబాజీపేట ఆముదం కాదు.. అయితే పెన్నీ స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు, కంపెనీ గురించి, దాని వ్యాపారం ఏమిటి, భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి, మార్కెట్ క్యాప్ ఎంత, తాని టెక్నికల్స్, ఫండమెంట్స్, ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి బాగా తెలుసుకోండి. ఆ కంపెనీ భవిష్యత్తుపై మీకు పూర్త నమ్మకం ఉంటేనే అందులో డబ్బు పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే నేడు మార్కెట్లో 4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి బజాజ్ ఫైనాన్స్ ప్రస్థానం ఒక పెన్నీ స్టాకుగానే మొదలైంది. 2001లో ఈ స్టాక్ ధర అక్షరాల రూ.2.40 పైసలు కానీ ప్రస్తుతం రూ. 7000 రేంజులో ఉంది.

  Xiaomi 11i Hypercharge: కేవలం 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ప్రత్యేకతలివే

  పెన్నీ స్టాక్ అంటే, తక్కువలోనే ఎక్కువ షేర్లు లభిస్తాయని ధరను చూసి పెట్టుబడి పెట్టకండి. ఒక్క స్టాక్ ధర పదివేలు ఉన్నప్పటికీ, మంచి రాబడిని, ఫండమెంటల్స్ బలంగా ఉన్న స్టాక్‌లో పెట్టుబడి పెట్టండి. అటు రెగ్యులేటర్లు సైతం ఇలాంటి పెన్నీ స్టాక్స్ లలో ఆపరేటింగ్ చేయడం లాంటివి దృష్టిలోకి వస్తే వాటిని ట్రేడింగ్ నుంచి నిషేధించారు.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Multibagger stock, Stock Market

  తదుపరి వార్తలు