• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • WHAT IS THE RIGHT VALUE FOR YOUR RELIANCE INDUSTRIES RIGHTS ENTITLEMENT SS

Reliance: రిలయెన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఎన్‌టైటిల్మెంట్ సరైన వ్యాల్యూ ఎంతంటే

Reliance: రిలయెన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఎన్‌టైటిల్మెంట్ సరైన వ్యాల్యూ ఎంతంటే

Reliance: రిలయెన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఎన్‌టైటిల్మెంట్ సరైన వ్యాల్యూ ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Reliance Industries Limited Rights Entitlements | రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఎంత వరకు వెళ్లొచ్చన్న దానిపైనా ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ షేర్ ధర పెరుగుతుందనుకుంటే, మరో 18 నెలల్లో ఇప్పుడు ఉన్న దానికన్నా ఎక్కువ ధరలో షేర్ ఉంటుందనుకుంటే మీకు ఇది లాంగ్ టర్మ్ కాల్ ఆప్షన్.

  • Share this:
    మీరెప్పుడైనా 'టైమ్ వ్యాల్యూ ఆఫ్ మనీ' గురించి విన్నారా? ఈ కాన్సెప్ట్ అర్థమైతే రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్ల రైట్స్ ఎన్‌టైటిల్మెంట్ వ్యాల్యూ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న డబ్బుకు ఉన్న విలువ 12 నెలలు లేదా 18 నెలల తర్వాత ఉండే విలువ కన్నా ఎక్కువ. ఎందుకంటే మీరు ఆ డబ్బు ద్వారా వడ్డీ లేదా రిటర్న్స్ పొందొచ్చు. రిలయెన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఆఫర్‌లో మీరు ఇప్పుడు చెల్లించేది 25 శాతం మాత్రమే. మిగతా మొత్తాన్ని 2021 మేలో 25 శాతం, 2021 నవంబర్‌లో 50 శాతం చొప్పున చెల్లించాలి. అంటే 2021 మేలో 25 శాతంగా చెల్లించే రూ.314.25 పై 12 నెలలు, నవంబర్‌లో 50 శాతంగా చెల్లించే రూ.628.50 పై 18 నెలల రిటర్న్స్ పొందొచ్చు. ఈ రిటర్న్స్ ఎలా ఉండొచ్చు? మీరు ఒకవేళ తక్కువ రిస్క్ ఉండే ఫిక్స్‌డ్ ఇన్‌కమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 7.5% వడ్డీ పొందొచ్చు. కాస్త రిస్క్ చేసి ఈక్విటీస్, కమాడిటీస్, బులియన్‌లో ఇన్వెస్ట్ చేస్తే 20% అదనంగా పొందొచ్చు. రిలయెన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఎన్‌టైటిల్మెంట్ వ్యాల్యూను ఈ చార్ట్‌లో చూడండి.

    Reliance Industries Limited, RIL Share price, RIL rights issue, RIL Rights Entitlements, Rights Entitlement platform, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ ధర, ఆర్ఐఎల్ షేర్ ధర, ఆర్ఐఎల్ రైట్స్ ఎన్‌టైటిల్మెంట్, రైట్స్ ఎన్‌టైటిల్మెంట్ ప్లాట్‌ఫామ్

    మీరు ఎంటైటిల్మెంట్ కొనేందుకు చెల్లించాల్సిన ధర ఎంతుండాలి? ప్రస్తుత మార్కెట్ ధర, ఆఫర్ మనీలో 75% వాయిదా వేసిన చెల్లింపు నుంచి పొందే ప్రయోజనం ద్వారా విలువను లెక్కించొచ్చు. అంటే మీ ఆపర్చ్యునిటీ కాస్ట్‌ని బట్టి ఒక షేర్ విలువ రూ.237 నుంచి రూ.417 మధ్య ఉండొచ్చు. కాబట్టి ఎన్‌టైటిల్మెంట్ రూ.151 కన్నా ఎక్కువలో ట్రేడ్ కావాలి. అయితే ఇది ఎక్కడివరకు వెళ్తుందన్నది ప్రీమియం సెల్లర్లు నిర్ణయించగలరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఎంత వరకు వెళ్లొచ్చన్న దానిపైనా ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ షేర్ ధర పెరుగుతుందనుకుంటే, మరో 18 నెలల్లో ఇప్పుడు ఉన్న దానికన్నా ఎక్కువ ధరలో షేర్ ఉంటుందనుకుంటే మీకు ఇది లాంగ్ టర్మ్ కాల్ ఆప్షన్. కేవలం మీరు 25 శాతం చెల్లించి మీరు అధిక ప్రీమియం ఇవ్వడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఒకవేళ మీరు నెగిటీవ్‌గా ఉన్నట్టైతే మీరు ప్రైస్ డిఫరెన్స్‌లో డిస్కౌంట్ అడగొచ్చు. అయితే రైట్స్ ఎన్‌టైటిల్మెంట్ ఏ ధర దగ్గర ఆగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ధరలో తేడా, టైమ్ వ్యాల్యూ ఆఫ్ మనీ, ప్రీమియం లాంటివి ఖచ్చితంగా కనిపిస్తాయి.

    ఇవి కూడా చదవండి:

    Special Trains: జూన్ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లు... టికెట్ బుకింగ్ ఇలా

    Credit Card: క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్... కోవిడ్ 19 సమాచారంతో ఎర

    IRCTC Refund Rules: రైలు టికెట్లపై మారిన రీఫండ్ రూల్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published: