Home /News /business /

WHAT IS THE PROBLEM WITH RBL BANK MK

What is the problem with RBL bank: నివురుగప్పిన నిప్పులా మండుతున్న RBL వివాదం...అసలు కథ ఏంటి...ఈ ప్రశ్నలకు జవాబులేవి..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆర్‌బిఎల్ బ్యాంక్ లో జరుగుతున్న వరుస పరిణామాలు డిపాజిటర్లను కంగారుకు గురిచేస్తున్నాయి. దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకులో ఒకటైన రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్ ఇలా వరుస వివాదాల్లో కూరుకుపోవడం, కంపెనీ డిపాజిటర్లతో పాటు మదుపరులను కూడా ఆలోచనలో పడేసింది.

ఇంకా చదవండి ...
  What is the problem with RBL bank: ఆర్‌బిఎల్ బ్యాంక్ లో జరుగుతున్న వరుస పరిణామాలు డిపాజిటర్లను కంగారుకు గురిచేస్తున్నాయి. దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకులో ఒకటైన రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్ ఇలా వరుస వివాదాల్లో కూరుకుపోవడం, కంపెనీ డిపాజిటర్లతో పాటు మదుపరులను కూడా ఆలోచనలో పడేసింది. ముఖ్యంగా కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ ఆదివారం సాయంత్రం ఇచ్చిన వివరణ మరింత కన్ఫ్యూజన్ కు గురిచేసింది.

  RBI తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో ఇప్పటికీ ఆందోళనలు మాత్రం అలాగే నిలిచి ఉన్నాయి. డిసెంబరు 25న ఆర్‌బిఐ అత్యవసరంగా జోక్యం చేసుకోనని బ్యాంక్ బోర్డులో అదనపు డైరెక్టర్‌ని నియమించింది. బ్యాంకు MD, CEO విశ్వవీర్ అహుజా సెలవుపై అకస్మాత్తుగా నిష్క్రమించగా, ఆర్‌బిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ అహుజా తాత్కాలిక సిఇఒగా నియమితులయ్యారు.

  నిజానికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 36AB ఇలా పేర్కొంటోంది, “బ్యాంకింగ్ కంపెనీ లేదా దాని డిపాజిటర్ల ప్రయోజనాలను రక్షించాలని RBI భావిస్తే, బ్యాంకింగ్ కంపెనీకి అదనపు డైరెక్టర్లుగా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నియమించే వీలుంది. RBL బ్యాంక్ "సంతృప్తికరమైన ఆర్థిక స్థితిని కలిగి ఉంది" అని RBI తెలిపింది. మరి ఏ సమస్య లేనట్లయితే , ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటే, సెక్షన్ 36ABని ఎందుకు అమలు చేయాలి అనేది చిక్కు ప్రశ్నగా మారింది. అంటే బ్యాంకు నిర్వహణలో ఏదో లోపాలు ఉంటేనే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందుని నిపుణులు భావిస్తున్నారు.

  ఎండీ & సీఈఓ విశ్వవీర్ అహుజా హఠాత్తుగా ఎందుకు సెలవుపై వెళ్లారు?

  సీఈవో విశ్వవీర్ అహుజా సెలవుపై వెళ్లడంపై వివరణ కూడా సంతృప్తికరంగా లేదు. 2010 నుండి బ్యాంకు అధినేతగా ఉండి, ఇలా సడెన్ గా మాయం అవ్వడం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటో అర్థం కావడం లేదు. చిన్న ప్రైవేట్ బ్యాంకుల్లో బ్యాంకుకు మంచి పేరు తెచ్చిపెట్టడంలో అహుజా కీలకపాత్ర పోషించారు. అతడి హయాంలో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 25 రెట్లు పెరిగింది. ఆగస్ట్ 2016లో, అతను ఇటీవలి చరిత్రలో దేశం యొక్క అత్యంత విజయవంతమైన IPOని తీసుకురావడంలో సఫలీకృతం అయ్యాడు. ఇంత అనుభవమున్న అహూజా అకస్మాత్తుగా షేర్ హోల్డర్లకు లేదా కస్టమర్లకు ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వకుండా ఎందుకు వెళ్లిపోయారు? అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. డిసెంబర్ 27న, RBI తీసుకున్న నిర్ణయం కారణంగా, RBL బ్యాంక్ స్టాక్ 18 శాతానికి పైగా పతనాన్ని నమోదు చేసింది.

  RBL ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటే, అసలు సమస్య ఏమిటి?

  ఆదివారం జరిగిన కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా, తాత్కాలిక సీఈఓ అహుజా బ్యాంకు వద్ద రూ.15,000 కోట్ల మిగులు నగదు ఉందని ప్రకటించారు. ఆస్తి నాణ్యత నిరంతరం మెరుగుపడుతుందని, ఇప్పుడు స్థిరంగా కనిపిస్తోందని అహుజా నొక్కిచెప్పారు.  ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుత యాజమాన్యం ఇస్తున్న సమాధానాలతో కాస్త ఆందోళనలను తొలగిస్తున్నప్పటికీ, క్రిస్మస్ రోజున ఆకస్మిక పరిణామాల అసలు కారణాలపై ప్రశ్నలకు ఇంకా సమాధానం రాలేదు.
  Published by:Krishna Adithya
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు