హోమ్ /వార్తలు /బిజినెస్ /

MF Investments: ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? సిప్, లంప్‌సమ్ ఆప్షన్స్‌లో ఏది మంచిదో తెలుసుకోండి..

MF Investments: ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? సిప్, లంప్‌సమ్ ఆప్షన్స్‌లో ఏది మంచిదో తెలుసుకోండి..

MF Investments: ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? సిప్, లంప్‌సమ్ ఆప్షన్స్‌లో ఏది మంచిదో తెలుసుకోండి..

MF Investments: ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? సిప్, లంప్‌సమ్ ఆప్షన్స్‌లో ఏది మంచిదో తెలుసుకోండి..

MF Investments: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి లంప్‌ సమ్‌(Lump Sum) లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో ఏది బెస్ట్‌ ఆప్షన్ అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు వేర్వేరు పరిస్థితులలో ఉపయోగపడతాయి. ఈ రెండింటి మధ్య తేడాలేంటో చూడండి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చాలా మంది తమ సేవింగ్స్‌ (Savings)ను స్థిరమైన లాభాలు అందించే ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్‌ (Invest) చేయాలని అనుకుంటారు. డబ్బును పెట్టుబడి పెట్టడం, లాభం పొందడం అనేది తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసే నైపుణ్యం, సమయం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే మ్యూచువల్‌ ఫండ్స్‌ను బెస్ట్‌ ఆప్షన్‌గా నిపుణులు సూచిస్తున్నారు. అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి లంప్‌ సమ్‌(Lump Sum) లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో ఏది బెస్ట్‌ ఆప్షన్ అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు వేర్వేరు పరిస్థితులలో ఉపయోగపడతాయి. ఈ రెండింటి మధ్య తేడాలేంటో చూడండి.

లంప్ సమ్ అనేది ఫండ్ కొనుగోలుదారు చేసే వన్‌ టైమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌. పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తారు. ఉదాహరణకు బోనస్‌, ఎన్‌క్యాష్‌మెంట్ లేదా ఇతరత్రా మార్గాల్లో డబ్బు అందినప్పుడు లంప్‌సమ్‌ ఆప్షన్ సెలక్ట్‌ చేసుకుంటారు. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో స్థిరమైన పద్ధతిలో పెట్టుబడి పెట్టవచ్చు. క్రమం తప్పకుండా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. నెలకు మినిమం రూ.500 నుంచి సిప్‌ మొదలుపెట్టవచ్చు. ఇండియాలో సిప్‌ ఎక్కువగా పాపులర్‌ అయింది. మార్కెట్ అస్థిరత గురించి ఆందోళన అవసరం లేకుండా క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టవచ్చు.

* లక్ష్యాల ఆధారంగా పెట్టుబడులు

సిప్‌, లంప్‌ సమ్‌ పెట్టుబడి మార్గాల్లో ఒకటి ఎంచుకోవడం.. షార్ట్ టర్మ్‌, లాంగ్‌ టర్మ్‌ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా మ్యూచువల్ ఫండ్‌ను సెలక్ట్‌ చేసుకునే ముందు నెలవారీ ఆదాయం, ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ వంటి కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. లంప్‌సమ్‌ లేదా SIP పెట్టుబడి నుంచి వచ్చే రాబడి మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

మార్కెట్‌ బుల్లిష్‌గా ఉంటే.. లంప్‌ సమ్‌ లాభదాయకంగా ఉంటుంది. ట్రెండ్ బేరిష్ లేదా అస్థిరత కొనసాగుతుంటే.. రుపీ-కాస్ట్‌ యావరేజింగ్‌తో SIPలు స్థిరమైన లాభాలు అందిస్తుంది. అయితే రెండింటినీ పోల్చి.. SIP, లంప్‌ సమ్‌లో ఏది బెస్ట్‌ అనేది చెప్పలేం. అందుకే ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఆధారంగా ఫండ్ పోర్ట్‌ఫోలియోను వివిధ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లతో నిర్మించాలి.

* మార్కెట్‌ రిస్క్‌కు లోబడి లాభాలు

నువామా వెల్త్ ప్రెసిడెంట్, హెడ్ రాహుల్ జైన్ న్యూస్‌18తో మాట్లాడుతూ.. ఈక్విటీ ఫండ్‌లను ఉపయోగించి సంపదను సృష్టించడానికి SIP అనుకూలమైన, సమర్థవంతమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ అని చెప్పారు. నిర్ణీత తేదీలో, డబ్బు ఆటోమేటిక్‌గా మానవ ప్రమేయం లేకుండా ఫండ్‌లో ఇన్వెస్ట్‌ అవుతుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : ఐటీ రంగంలో లేఆఫ్స్ భయాలు.. వేల మంది ఉద్యోగులను తొలగించనున్న దిగ్గజ కంపెనీ..

* SIPs పెరుగుదల

SIPలు దీర్ఘకాలంలో సంపదను సృష్టించే ఇన్‌స్ట్రుమెంట్స్‌గా వృద్ధిని సాధించాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ప్రకారం.. 2022 డిసెంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్ SIP అకౌంట్లు 6.12 కోట్లు ఉన్నాయి. 2022 డిసెంబర్‌లో SIP ద్వారా సేకరించిన మొత్తం రూ.13,573 కోట్లు. నెలవారీ SIPలు సగటున రూ.14,000 కోట్లకు చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

First published:

Tags: Investment Plans, Mutual Funds, Personal Finance

ఉత్తమ కథలు