Home /News /business /

WHAT IS THE DIFFERENCE BETWEEN PAY LATER AND CREDIT CARDS WHICH IS THE BEST PAYMENT OPTION KNOW HERE GH VB

Credit Vs Pay Later Cards: పే లేటర్, క్రెడిట్ కార్డ్స్ మధ్య తేడా ఏంటి..? ఈ రెండింట్లో ఏది బెస్ట్ పేమెంట్ ఆప్షన్..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో పే లెటర్ కార్డ్స్ (Pay Later Cards) ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్డులు ఉపయోగించి ప్రజలు వస్తువులను కొనుగోలు చేసి తర్వాత చెల్లించొచ్చు. నిజానికి క్రెడిట్ కార్డ్స్ (Credit Cards) కూడా ప్రజలకు ఎలాంటి ఫీచర్స్ యే అందిస్తాయి.

ఇంకా చదవండి ...
ఫైనాన్షియల్ కంపెనీలు ప్రజలను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త పేమెంట్ కార్డ్స్ (Payment Cards) ఇంట్రడ్యూస్ చేస్తుంటాయి. అలా ఇప్పటికే క్రెడిట్, డెబిట్ కార్డ్స్ తీసుకొచ్చి ప్రజలకు ఆర్థికంగా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అయితే రీసెంట్ టైంలో భారతదేశంలో పే లెటర్ కార్డ్స్ (Pay Later Cards) ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్డులు ఉపయోగించి ప్రజలు వస్తువులను కొనుగోలు చేసి తర్వాత చెల్లించొచ్చు. నిజానికి క్రెడిట్ కార్డ్స్ (Credit Cards) కూడా ప్రజలకు ఎలాంటి ఫీచర్స్ యే అందిస్తాయి. దీంతో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చాలామంది తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో పే లేటర్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మధ్య వ్యత్యాసం ఏంటి? ఇవి రెండు ఎలా పనిచేస్తాయి వంటి విషయాలు కూడా తెలుసుకుందాం.

మామూలుగా క్రెడిట్ కార్డు యూజర్లు తాము తీసుకునే క్రెడిట్ మొత్తాన్ని నెలాఖరులో కట్టాల్సి ఉంటుంది. ఆ మొత్తం సకాలంలో చెల్లించకపోతే లేదా తక్కువగా చెల్లించినా.. మొత్తం అమౌంట్ పై ప్యానల్ ఇంట్రెస్ట్ ఛార్జెస్, లేట్ ఛార్జెస్ పడతాయి. అయితే పే లేటర్ కార్డ్‌ని యూజ్ చేసి తీసుకున్న క్రెడిట్ మొత్తం ఒకేసారి చెల్లించనక్కర్లేదు. ఈ మొత్తాన్ని యూజర్లు కాలక్రమేణా వాయిదాలలో కడితే సరిపోతుంది. ఒకవేళ ఏదైనా ఇన్‌స్టాల్‌మెంట్ ని సకాలంలో చెల్లించకపోతే.. అప్పుడు ఆ ఇన్‌స్టాల్‌మెంట్ వరకు మాత్రమే లేట్ ఫీజు, క్యారీ ఫార్వర్డ్ ఫీజు పే చేయాల్సి వస్తుంది. ఈ క్యారీ ఫార్వార్డ్ ఫీజు సాధారణంగా 3-5 శాతం మధ్య ఉంటుంది. ఈ విధంగా పే-లేటర్ కార్డ్‌తో మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి చాలా ఎక్కువ సౌలభ్యం ఉండటమే కాకుండా, క్రెడిట్ కార్డ్‌తో పోలిస్తే ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.

అప్రూవల్ ప్రాసెస్
పే లేటర్ - వెంటనే కార్డు అప్రూవల్ లభిస్తుంది. ఈ కార్డు జారీ చేసే కంపెనీలు క్రెడిట్ స్కోర్‌ల గురించి అంతగా పట్టించుకోవు.

క్రెడిట్ కార్డ్ - క్రెడిట్ స్కోర్‌లపై ఆధారపడి ఉంటుంది. పేపర్ వర్క్ అవసరం అవుతుంది. అప్రూవల్ కు కొన్ని రోజులు పట్టవచ్చు.

Global Insurance: యుద్ధ సమయాల్లో గ్లోబల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు వర్తించవు.. కారణాలు ఇవే..!


 రీపేమెంట్ టెన్యూర్

పే లేటర్ - ఇంట్రెస్ట్-ఫ్రీ క్రెడిట్ వ్యవధి గరిష్టంగా 15 రోజుల వరకు ఉంటుంది. యూని, స్లైస్ మొదలైన కంపెనీలు 90 రోజుల వడ్డీ రహిత క్రెడిట్‌ను అందిస్తాయి. మరికొన్ని కంపెనీలు 45 రోజుల ఇంట్రెస్ట్-ఫ్రీ క్రెడిట్‌ను ఆఫర్ చేస్తాయి.

క్రెడిట్ కార్డ్ - సాధారణంగా ఇంట్రెస్ట్-ఫ్రీ క్రెడిట్ 45 రోజులు రీపేమెంట్ టెన్యూర్ కలిగి ఉంటుంది.

యాన్యువల్ అండ్ జాయినింగ్ ఫీజు

పే లేటర్ - నిల్

క్రెడిట్ కార్డ్ - క్రెడిట్ కార్డ్‌లు జాయినింగ్ ఫీజులు, రికరింగ్ యాన్యువల్ ఫీజులు వంటి ఛార్జీలతో వస్తాయి. ఇవి ప్రీమియం కార్డ్‌లకు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా జాయినింగ్ ఫీజు రూ. 1,000 వరకు ఉంటుంది. ఇది కంపెనీలను బట్టి మారుతూ ఉంటుంది.

బెనిఫిట్స్
పే లేటర్ - పార్ట్ నర్ ప్లాట్‌ఫామ్‌లపై తగ్గింపులు, ఆఫర్‌లు పొందవచ్చు.

క్రెడిట్ కార్డ్ - చాలా కొనుగోళ్లపై రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు లేదా ఎయిర్ మైల్స్ లభిస్తాయి.

లేట్ పేమెంట్ ఇంట్రెస్ట్

పే లేటర్ - స్లాబ్ ప్రకారం లేట్ పేమెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ - కార్డు నుంచి కార్డుకు మారుతూ ఉంటుంది.

లేట్ పేమెంట్ వడ్డీ

పే లేటర్ - చాలా మంది ఫిన్‌టెక్ కంపెనీల గరిష్ట వడ్డీ నెలకు 2.5 శాతంగా ఉంటుంది. ఇది చెల్లించని పక్షంలో సంవత్సరానికి 30 శాతం (నాన్ రివాల్వింగ్) వడ్డీ పడుతుంది.

క్రెడిట్ కార్డ్ - క్రెడిట్ కార్డ్‌పై రివాల్వింగ్ క్రెడిట్ తరచుగా నెలవారీగా 3 శాతం నుండి 3.5 శాతం వరకు ఉంటుంది, ఇది ఏటా 36-42 శాతంగా ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Credit cards, Pay later, Paytm payment bank, Pyment bank

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు