హోమ్ /వార్తలు /బిజినెస్ /

The Best Insurance Policy : సీనియర్ సిటిజన్లకు బెస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఏది? నిపుణులు చెబుతోంది ఇదే..

The Best Insurance Policy : సీనియర్ సిటిజన్లకు బెస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఏది? నిపుణులు చెబుతోంది ఇదే..

The Best Insurance Policy : సీనియర్ సిటిజన్లకు బెస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఏది? నిపుణులు చెబుతోంది ఇదే..

The Best Insurance Policy : సీనియర్ సిటిజన్లకు బెస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఏది? నిపుణులు చెబుతోంది ఇదే..

The Best Insurance Policy : తల్లిదండ్రులకు అవసరమైన ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ సెలక్ట్‌ చేసుకోవడం కష్టమైన పని. సాధారణంగా సీనియర్‌ సిటిజన్లకు జనరల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అందుబాటులో ఉండవు. హెల్త్ హిస్టరీ కారణంగా అప్లికేషన్‌లను రిజెక్ట్‌ చేస్తాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

తల్లిదండ్రులకు అవసరమైన ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ (Insurance Plan)సెలక్ట్‌ చేసుకోవడం కష్టమైన పని. సాధారణంగా సీనియర్‌ సిటిజన్ల (Senior Citizens)కు జనరల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అందుబాటులో ఉండవు. హెల్త్ హిస్టరీ కారణంగా అప్లికేషన్‌లను రిజెక్ట్‌ చేస్తాయి. అందుకే కొన్ని కంపెనీలు సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేకంగా పాలసీలు అందిస్తాయి. సీనియర్ సిటిజన్ పాలసీలను సాధారణంగా నిర్దిష్ట వయస్సు 45 కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు మాత్రమే అందిస్తాయి. ఇటువంటి ప్లాన్‌లకు ఎక్కువ లిమిట్స్‌ అప్లై అవుతాయి. ప్లాన్ ఫీచర్‌లు కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి. దాదాపు అన్ని ప్లాన్‌ల ప్రధాన ప్రయోజనాలు ఒకేలా ఉంటాయి. అయితే కార్పొరేట్‌ సంస్థలు అందించే వాలంటరీ గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు మారవచ్చు.

చాలా కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగులకు తమ తల్లిదండ్రులను వాలంటరీ గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకంలో రిజిస్టర్‌ చేసుకునే అవకాశం ఇస్తాయి. అయితే సీనియర్‌ సిటిజన్‌ హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలా? లేదా కంపెనీ అందిస్తున్న వాలంటరీ గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వీటి రెండింటి మధ్య తేడాలు ఇప్పుడు చూద్దాం.

గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో ఇన్సూరెన్స్‌కు గ్యారంటీ ఉంటుంది. మినిమం ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో ఆధారంగా గ్రూప్‌ ఏర్పడుతుంది. ఇందులో ఉద్యోగుల తల్లిదండ్రులకు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎలాంటి వివరాలు కోరరు.

పర్సనల్‌ సీనియర్ సిటిజన్ ప్లాన్ విషయంలో.. ఇన్సూరెన్స్‌ కంపెనీలు తల్లిదండ్రుల పూర్తి హెల్త్‌ హిస్టరీని పరిశీలిస్తాయి. కొన్ని సందర్భాల్లో పాలసీని జారీ చేయడానికి ముందు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తాయి. వైద్య పరిస్థితి ప్రతికూలంగా ఉంటే కంపెనీ అప్లికేషన్‌ను రిజెక్ట్‌ చేసే అవకాశం కూడా ఉంది.

* వెయిటింగ్ పీరియడ్

పర్సనల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌కు ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వరకు వెయిటింగ్‌ పీరియడ్‌(Waiting Period) ఉంటుంది. ఈ వ్యవధిలో పేర్కొన్న మినహాయింపులు, ముందుగా ఉన్న అనారోగ్యాలకు కవరేజీ అందదు. వాలంటరీ గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు ఈ సమస్య ఉండదు.

ఇది కూడా చదవండి : గవర్నమెంట్ ఉద్యోగులకు కొత్త LTC రూల్స్.. వీటిలో హైలైట్స్ ఇవే..

* బిల్స్‌లో ఎక్కువ శాతం ఇన్సూరెన్స్‌ కంపెనీ కవర్ చేస్తుంది

గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో మూడో ప్రయోజనం ఏంటంటే.. కో-పే ఆప్షన్‌. ఇన్సూరెర్‌ చెల్లించాల్సిన మొత్తం కంపెనీ చెల్లించే మొత్తాని కంటే తక్కువే ఉంటుంది. గ్రూప్ ప్లాన్‌లు ప్రతి క్లెయిమ్‌పై 10 శాతం, 20 శాతం మధ్య కో- పే ఆప్షన్‌ అందిస్తాయి. ఖర్చులను కవర్‌ చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. సీనియర్ సిటిజన్ల పర్సనల్‌ ప్లాన్స్‌లో 20-30 శాతం అధిక కో-పే ఆప్షన్‌ ఉండవచ్చు. ఇది క్లెయిమ్ సమయంలో గణనీయమైన అవుట్‌గోకు దారి తీస్తుంది. కొన్ని ప్లాన్‌లు నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్‌లకు మాత్రమే కో-పే ఆప్షన్‌ను వర్తింపజేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health Insurance, Personal Finance, Senior citizens

ఉత్తమ కథలు