Indian Railways | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలెక్కింది. సికింద్రాబాద్, విశాఖ పట్నం మధ్యలో ఈ ట్రైన్ పరుగులు పెడుతోంది. ప్రధాన నరేంద్ర మోదీ జనవరి 15న ఈ ట్రైన్‌ను (Railways) ప్రారంభించారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ట్రైన్ (Train) జర్నీ చేసే వారికి మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ హైస్పీడ్ రైలు వల్ల ప్రయాణ సమయం దాదాపు 4 గంటలు తగ్గుతుందని చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణికులకు మరెన్నో సౌకర్యాలు లభించనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో తెలియజేశారు. విమానాల్లో ఉన్న సౌకర్యాల కన్నా ఈ ట్రైన్ ఇంకా మెరుగైన సర్వీసులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఏ ఏ సౌకర్యాలు ప్రయాణికులకు లభిస్తున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
షాక్‌ల మీద షాక్‌లు.. బంగారం కొనే వారికి ప్రతి రోజూ చుక్కలే, ఒకేసారి రూ.1800 పెరిగిన రేట్లు!
ఇతర ట్రైన్స్‌తో పోలిస్తే.. వందే భారత్ ట్రైన్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో, పూర్తిగా దేశీ పరిజ్ఞానంతో రూపొందిందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు. ఎయిర్ రెసిస్టెన్సీ తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఎనర్జీ వినియోగం కూడా ఈ కొత్త ట్రైన్‌లో 30 శాతం తక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఇంటీరియర్ డిజైన్ చేశారని తెలిపారు. సీటు 180 డిగ్రీ రొటేట్ అవుతుందని, అలాగే బుక్ రీడింగ్ లైట్స్, ప్రతి కోచ్‌లో జీపీఎస్ ఫెసిలిటీ ఉంటుందని వివరించారు. విమానంలో మాదిరి డైనింగ్ టేబుల్ ఫెసిలిటీ ఉందన్నారు. ఇంకా వెడల్పుగా ఉన్న కిటికీలు ఉన్నాయని, దీని వల్ల సైట్ సీయింగ్ బాగుంటుందని తెలిపారు.
యమ క్రేజ్, ఫుల్ డిమాండ్.. జనాలు ఎక్కువగా కొంటున్న టాప్ 7 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
జర్నీ ప్రారంభం అయితే డోర్స్ క్లోజ్ అవుతాయని పేర్కొన్నారు. దీని వల్ల ట్రైన్‌లో నుంచి పడిపోవడం అనే సంఘటనలు ఉండవని తెలిపారు. ప్రతి కోచ్‌లో సీసీ కెమెరా ఉంటుందని, దీని వల్ల ప్రయాణికులకు అధిక భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే వందే భారత్ ట్రైన్‌లో కవచ్ సిస్టమ్ ఉందన్నారు. అలాగే స్టూడెంట్స్, బిజినెన్‌మెన్‌లకు అందుబాటులోనే టికెట్ ధరలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కేటరింగ్ చార్జీల వల్ల వచ్చేటప్పుడు, పోయేటప్పుడు టికెట్ ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చని పేర్కొన్నారు.
సీటింగ్ పరంగా చూస్తే.. ప్రయాణికులకు చాలా కంఫర్ట్‌గా ఉంటుందని తెలిపారు. లెగ్ స్పేస్, రొటేషన్ వంటివి విమానాల్లో కూడా ఉండవన్నారు. రెగ్యులర్ ఇన్‌ఫర్మేషన్ అప్‌డేట్ ఉంటుందని తెలిపారు. చాలా విమానాలతో పోలిస్తే.. వందే భారత్ ట్రైన్‌లో ఇంకా మెరుగైన సర్వీసులు ఉన్నాయని తెలిపారు. ట్రైన్ గరిష్ట స్పీడ్ గంటకు 160 కిలోమీటర్లు అని, కానీ ట్రాక్ గరిష్ట స్పీడ్ గంటలకు 130 కిలోమీటర్లు అని తెలిపారు. 700 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ 8.3 గంటల్లో కవర్ చేస్తుందన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఈట్రైన్ నడుస్తుందని, ఆదివారం మెయింటెనెన్స్ కారణంగా ట్రైన్ ఉండదని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High speed trains, Indian Railways, Railways, South Central Railways, Vande Bharat Train