SBI Mogo: ఎస్​బీఐ మోగో విజువల్​ క్యాంపెయిన్​ ప్రారంభం.. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే...

SBI (ప్రతీకాత్మక చిత్రం)

ఎస్​బీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. బ్యాంకు మోగో అనే వినూత్న క్యాంపెయిన్​ను చేపట్టింది. బ్రాండ్ వ్యూహంలో భాగంగా మ్యూజికల్ లోగో (మోగో), మొగోస్కేప్ (సోనిక్ పాలెట్)లను సృష్టించింది. వీటిలో ఆహ్లాదకరమైన సిగ్నేచర్​ ట్యూన్​ను చేర్చింది. ఎస్​బీఐ మోగో ప్రమోషన్​ను ‘ది బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్’ అనే ట్యాగ్​లైన్​తో చేపట్టింది.

  • Share this:
దేశంలోనే అతిపెద్ద రుణదాత, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) ఏర్పాటై 65 సంవత్సరాలు పూర్తయింది. 2021 జూలై 1న 66వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తమ ఉద్యోగులు, కస్టమర్ల కోసం ఎస్​బీఐ ప్రత్యేక కార్యక్రమాలును చేపట్టింది. వాటిలో ఒకటి మోగో లేదా మ్యూజికల్ లోగో. ఈ విజువల్​ క్యాంపెయిన్​ను 45 కోట్ల మంది కస్టమర్లకు అంకితం చేసింది. 'ది బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్' అనే ట్యాగ్‌లైన్‌తో దీన్ని ఆవిష్కరించింది. ఈ నూతన ప్రచారంపై ఎస్​బీఐ చైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ ‘‘మ్యూజిక్​ అనేది మన లోతైన భావోద్వేగాలతో సులభంగా కనెక్ట్ అవ్వగలదు. మా కస్టమర్లందరికీ మెరుగైన సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాం. వారిలో నూతన ఉత్సాహం నింపేందుకు ఈ కొత్త క్యాంపెయిన్​ను ప్రారంభించాం" అని అన్నారు.

ఎస్​బీఐ మోగో అంటే ఏమిటి?

ఎస్​బీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. బ్యాంకు మోగో అనే వినూత్న క్యాంపెయిన్​ను చేపట్టింది. బ్రాండ్ వ్యూహంలో భాగంగా మ్యూజికల్ లోగో (మోగో), మొగోస్కేప్ (సోనిక్ పాలెట్)లను సృష్టించింది. వీటిలో ఆహ్లాదకరమైన సిగ్నేచర్​ ట్యూన్​ను చేర్చింది. ఎస్​బీఐ మోగో ప్రమోషన్​ను ‘ది బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్’ అనే ట్యాగ్​లైన్​తో చేపట్టింది. ఈ ట్యూన్​ ఎంతో మెలొడీగా అనిపిస్తుంది. ఎస్​బీఐకి రెండు వందల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉంది. గత 66 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయి బ్యాంకింగ్​ సేవలందిస్తుంది. ఈ సందర్బంగా ‘‘అయామ్​​ ఎస్​బీఐ” అనే ఐకానిక్ ఎస్​బీఐ బ్రాండ్​ ప్రమోషన్​ను చేపట్టింది.

భారతదేశంలోనే కాదు విదేశాల్లో సైతం విభిన్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఈ కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా “ది బ్యాంకర్​ టు ఎవ్రీ ఇండియన్​” అనే ట్యాగ్​లైన్ రీలాంచ్​ చేసింది. అంతేకాదు, ‘హమ్ సాత్ హై’ అనే లిరిక్స్​తో కూడిన ఒక కొత్త సాంగ్​ను విడుదల చేసింది. కస్టమర్ ప్రయాణంలోని ప్రతి దశలో ఎస్​బిఐ ఎలా తోడుగా ఉంటుందనేది ఈ సాంగ్​లో వివరించింది.

ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా ఎస్​బీఐ దేశంలోనే అతిపెద్ద కమర్షియల్​ బ్యాంకుగా రాణిస్తుంది. 30 కోట్ల మంది భారతీయుల సొంతింటి కల నెరవేర్చిన అతి పెద్ద రుణదాతగా నిలిచింది.
Published by:Krishna Adithya
First published: