పండుగ సీజన్లో లభించే ఆఫర్లలో అవసరమైన వస్తువులు కొనుక్కోవాలని ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఈ సమయంలోనే గృహోపకరణాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లు తదితరాలపై కంపెనీలు, ఈ కామర్స్ వెబ్సైట్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ ఆఫర్లలో బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై ఇన్స్టాంట్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో పాటు నో కాస్ట్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (No-Cost Equated Monthly Instalment) ఆప్షన్ కూడా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ (No Cost EMI Offers) ద్వారా ప్రొడక్ట్స్ కొనేవారు ఎక్కువ.నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి? దీంతో నిజంగా డబ్బు ఆదా అవుతుందా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.
నో-కాస్ట్ EMI ఆఫర్ ద్వారా వినియోగదారులు అదనపు వడ్డీ(Interest) లేదా ఛార్జీలు(Charges) లేకుండా వాయిదాలలో వివిధ ప్రొడక్టులను కొనుగోలు చేయవచ్చు. ఏదైనా వస్తువును కొనుగోలు చేయడానికి నో-కాస్ట్ EMI లేదా జీరో-కాస్ట్ EMI ఆప్షన్ సెలక్ట్ చేసుకున్నప్పుడు.. ఆ ప్రొడక్ట్ కోసం చెల్లించాల్సిన మొత్తాన్ని నెలవారీ వాయిదాలలో చెల్లించాలి. ఎలాంటి వడ్డీ లేదా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అనేక బ్యాంకులు వివిధ ఆప్షన్లతో నో-కాస్ట్ EMI ఆఫర్లను అందిస్తాయి. కొన్ని బ్యాంకులు జీరో-డౌన్ పేమెంట్ ప్లాన్లను కూడా అందిస్తాయి. ఇందులో ముందస్తుగా ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. సులభంగా నెలవారీ వాయిదాలను చేయవచ్చు.
5G Internet Speed: 5G డౌన్లోడ్ స్పీడ్ 500 ఎంబీపీఎస్... లేటెస్ట్ డేటాలో ఆసక్తికరమైన నిజాలు
మరోవైపు కొన్ని బ్యాంకులకు డౌన్ పేమెంట్‌గా కనీస మొత్తం అవసరమవుతుంది. మిగిలిన మొత్తాన్ని EMIలలో చెల్లించాల్సి ఉంటుంది. నో-కాస్ట్ EMI ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటున్నప్పుడు.. అవసరానికి అనుగుణంగా వివిధ రీపేమెంట్ టెన్యూర్లను ఎంచుకోవచ్చు. 3 నెలల నుంచి 24 నెలల వరకు టెన్యూర్ ఆప్షన్ ఉంటుంది.
5G Internet Speed: 5G డౌన్లోడ్ స్పీడ్ 500 ఎంబీపీఎస్... లేటెస్ట్ డేటాలో ఆసక్తికరమైన నిజాలు
ఏదైనా వస్తువును కొనుగోలు చేయడానికి నో-కాస్ట్ EMI సరైన ఆప్షన్‌గా భావించినప్పుడు తెలుసుకోవాల్సిన ఇతర అంశాలు ఉన్నాయి. నో-కాస్ట్ EMI మొత్తంపై ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ.. ప్రొడక్ట్ వాస్తవ ధరను మాత్రమే చెల్లిస్తారని అర్థం కాదు. బ్యాంకులు నో-కాస్ట్ EMI కోసం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. అంటే వడ్డీని ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేసే అవకాశం ఉంది. అదనంగా నో-కాస్ట్ EMIని ఎంచుకునే సమయంలో ఆ ప్రొడక్ట్‌పై అప్పటికే ఉన్న ఇతర డిస్కౌంట్లు పొందే అవకాశం లేదు. కాబట్టి ఈ అంశాలను విశ్లేషించి నో-కాస్ట్ EMIని సెలక్ట్ చేసుకోవాలి. నో-కాస్ట్ EMI స్కీమ్‌ని పొందాలని నిర్ణయించుకునే ముందు నిబంధనలు, షరతులను పూర్తిగా తెలుసుకోవడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Flipkart, Online shopping