ట్యాక్స్ ఫైలింగ్ (Tax Filing)ను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఎన్నో కొత్త సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆదాయం, ఇన్‌కమ్ సోర్స్ ఆధారంగా ట్యాక్స్ పేయర్స్‌ను అనేక విభాగాలుగా వర్గీకరించింది. ఒక్కో వర్గం వారికి నిర్ధిష్ట నియమ, నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూల్స్ వర్తిస్తాయి. వీటి ప్రకారమే వ్యక్తులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఈ లిస్ట్‌లో ITR-1 లేదా సహజ్ ఫారమ్ అనేది ఒకటి. రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తుల కోసం ఈ ఫారమ్‌ను ప్రవేశపెట్టారు. జీతం, పెన్షన్ లేదా వడ్డీ ఆదాయం ఉన్న ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్ ITR-1 లేదా సహజ్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.
* ITR-1 లేదా సహజ్ ఫైల్ చేయడానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్
- ఫారం 16, హౌస్ రెంట్ రిసిప్ట్ (వర్తిస్తే), ఇన్వెస్ట్‌మెంట్ పేమెంట్ ప్రీమియం రసీదులు (వర్తిస్తే) అవసరం.
- ITRలు యాన్నెక్చర్స్ ఉండని ఫారమ్‌లు, కాబట్టి రిటర్న్‌తో పాటు (మాన్యువల్‌గా లేదా ఎలక్ట్రానిక్‌గా ఫైల్ చేసినా) ఎలాంటి డాక్యుమెంట్‌ను (పెట్టుబడి రుజువు, TDS సర్టిఫికేట్‌లు వంటివి) జోడించాల్సిన అవసరం లేదు.
- అసెస్‌మెంట్, విచారణ వంటి అవసరాల కోసం ఈ డాక్యుమెంట్స్‌ను ట్యాక్స్ పేయర్స్ అధికారులకు సమర్పించాల్సి రావచ్చు. అందుకే వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి.
ఇది కూడా చదవండి : ఆ నైపుణ్యాలున్న వారికే ఇండియాలో డిమాండ్.. ఉద్యోగం తొందరగా వస్తుంది!
* ITR-1 లేదా సహజ్‌ను ఎవరు ఫైల్ చేయాలి?
ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన సంపదపై ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించాలి. ఇందుకు ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.50 లక్షలకు మించని వారు ఐటీఆర్-1 ఫైల్ చేయాలి. శాలరీ, హౌస్ ప్రాపర్టీ, ఫ్యామిలీ పెన్షన్ ఆదాయం, వ్యవసాయ ఆదాయం (రూ. 5000 వరకు)తో పాటు కొన్ని ఇతర సోర్సెర్స్ నుంచి ఆదాయం ఆర్జించేవారు సహజ్ ఫారం సమర్పించాలి. ఈ లిస్ట్‌లో ఉండే ఇతర ఇన్‌కమ్ సోర్సెస్ ఇవే..
- సేవింగ్స్ అకౌంట్స్ నుంచి అందే వడ్డీ
- బ్యాంక్, పోస్టాఫీస్, కోఆపరేటివ్ సొసైటీ వంటి సంస్థల్లో డిపాజిట్ల నుంచి అందే వడ్డీ
- ఆదాయపు పన్ను వాపసు (Tax Refund) నుంచి వడ్డీ
- ఎన్‌హ్యాన్స్‌డ్ కాంపెన్షేషన్‌పై పొందిన వడ్డీ
- ఏదైనా ఇతర వడ్డీ ఆదాయం
- ఫ్యామిలీ పెన్షన్
- జీవిత భాగస్వామి ఆదాయం (పోర్చుగీస్ సివిల్ కోడ్ కింద కవర్ అయ్యేవి కాకుండా) లేదా మైనర్ ఆదాయం (ఇన్‌కమ్ సోర్స్ పేర్కొన్న విధంగా పేర్కొన్న పరిమితుల్లో ఉంటే మాత్రమే).
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, ITR Filing, Personal Finance, Tax payers, Taxes