బంగారం... భారతీయులకు సెంటిమెంట్. పెట్టుబడిగా బంగారాన్ని కొనేవారికన్నా సెంటిమెంట్‌తో గోల్డ్ కొనేవారే ఎక్కువ. బంగారం ఓ పొదుపు మార్గం కూడా. కాస్త ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే వెంటనే గోల్డ్ కొని భవిష్యత్తుకోసం దాచుకోవాలన్న ఆలోచన భారతీయుల్లో సాధారణంగా ఉంటుంది. అంతేకాదు... ప్రతీ నెల కొంత మొత్తాన్ని గోల్డ్ స్కీమ్‌లో దాచుకుంటూ ఉంటారు. ఇక ధంతేరాస్, దీపావళి సందర్భాల్లో ఈ గోల్డ్ స్కీమ్స్ హడావుడి ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల కన్నా ఈ ఫెస్టివల్ సీజన్లో గోల్డ్ స్కీమ్‌లో చేరేవారి సంఖ్య 300-350 శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే గోల్డ్ స్కీమ్‌లో డబ్బులుదాచుకునేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం మంచిది. సరిగ్గా ఏడాది క్రితం గుడ్ విన్ జ్యువెలర్స్ స్కామ్ అందరికీ తెలిసిందే. రూ.25 కోట్ల స్కామ్ అది. గోల్డ్ సేవింగ్స్ స్కీమ్‌లో డబ్బులు దాచుకొని 1,573 మంది మోసపోయారు. పెట్టిన పెట్టుబడి కన్నా 14 శాతం అధికంగా రిటర్న్స్ వస్తాయని నమ్మించడంతో అనేక మంది ఈ స్కీమ్‌లో చేరారు. చివరకు మోసపోయారు.
ఇప్పుడు ధంతేరాస్, దీపావళి సీజన్ కావడంతో అనేక జ్యువెలర్స్ గోల్డ్ స్కీమ్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ స్కీమ్‌లో 12 నెలల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. డిస్కౌంట్ కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ఉపయోగకరమా లేదా అన్నది తెలుసుకోవడం అవసరం. బంగారాన్ని ఒకేసారి కొనడం మంచిదా లేక వాయిదా పద్ధతుల్లో కొనడం మంచిదా అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. డబ్బులు ఉన్నవాళ్లు నేరుగా బంగారాన్ని ఒకేసారి కొంటారు. అయితే డబ్బులు లేనివాళ్లు మాత్రం వాయిదా పద్ధతుల్లో బంగారాన్ని తీసుకోవాలని ఆలోచిస్తారు. అలాంటివాళ్లే గోల్డ్ జ్యువెలరీ స్కీమ్‌లకు ఆకర్షితులౌతారు. మీరు ప్రతీ నెల కొంత మొత్తం పొదుపు చేస్తూ ఉంటే... 12 నెలల తర్వాత మీరు జమ చేసిన మొత్తానికి బంగారాన్ని కొనే అవకాశం గోల్డ్ స్కీమ్ కల్పిస్తుంది. ఉదాహరణకు తనిష్క్ జ్యువెలర్స్ నెలకు రూ.30,000 నుంచి రూ.1.2 లక్షల వరకు పొదుపుచేసే అవకాశం కల్పిస్తోంది.
Gold: ధంతేరాస్‌కు ముందు బంపరాఫర్... మార్కెట్ రేటుకన్నా తక్కువకే బంగారం
Gold Price Today: ధంతేరాస్ ముందు బంగారం ధరలు ఢమాల్... ఒక్క రోజులోనే రూ.1500 పతనం
కొన్ని జ్యువెలరీ సంస్థలు చివరి ఒకటి లేదా రెండో వాయిదాను డిస్కౌంట్ రూపంలో ఇస్తాయి. అంటే కస్టమర్ 11 నెలలు వాయిదా చెల్లిస్తే చాలు. 12వ వాయిదా తామే చెల్లిస్తామని నగల సంస్థలు చెప్తాయి. ఉదాహరణకు బ్లూస్టోన్ గోల్డ్ మైన్ జ్యువెలరీ సంస్థ మొదటి వాయిదాలో 50 శాతంతో పాటు, 11వ వాయిదా పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించింది. మీరు వాయిదా పద్ధతిలో నగలు కొనడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. మొదటి ఆప్షన్ ప్రకారం మీరు ప్రతీ నెల కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు మీరు వచ్చే ఏడాది దీపావళికి రూ.3,00,000 నగలు కొనాలనుకుంటే ఇప్పట్నుంచే నెలకు రూ.25,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. 12 నెలల తర్వాత రూ.3,00,000 మొత్తంతో నగలు కొనొచ్చు. ఇక రెండో ఆప్షన్ చూస్తే ప్రతీ నెల రూ.25,000 చెల్లించి బంగారం కొనాలి. అంటే ఇక్కడ బంగారం మీకు ఇవ్వరు. రికార్డ్స్‌లో మాత్రం ఉంటుంది. ఏడాది తర్వాత మీరు అప్పటివరకు ఎంత బంగారం కొన్నారో లెక్కించి నగలు కొనొచ్చు. "ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉండటం వల్ల ఇలాంటి స్కీమ్స్ లాభదాయకంగా ఉండొచ్చు" అని బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ షెట్టి అభిప్రాయపడుతున్నారు.
గోల్డ్ స్కీమ్స్ విషయంలో చాలా విషయాలు తెలుసుకోవాలి. బంగారం ధరలు వేర్వేరు నగల షాపుల్లో వేర్వేరుగా ఉంటాయి. రోజూ బంగారం ధరలు మారుతుంటాయి. ఒక్కోసారి గంటగంటకూ ధరలు మారుతుంటాయి. ఉదాహరణకు నవంబర్ 1న కళ్యాణ్ జ్యువెలర్స్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,045 ఉండగా, రిలయెన్స్ జ్యువెల్స్‌లో రూ.49,808. ఇక తనిష్క్లో రూ.55,708 గా ఉంది. ఇందుకు కారణం రెంటల్, బంగారం కొనడానికి అయ్యే ఖర్చులు, ఇతర ఖర్చుల్ని పరిగణలోకి తీసుకోవడమే. అంతర్జాతీయంగా ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్లల్లో బంగారం ధరల్లో మార్పులతో సంబంధం లేకుండా నగల షాపుల్లో గోల్డ్ రేట్స్ ఉంటాయి. అంటే అంతర్జాతీయ మార్కెట్లలో ఆయిల్ ధరలు తగ్గినా ప్రాంతాన్ని బట్టి పెట్రోల్ ధరల్లో మార్పు ఉన్నట్టు బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి. ఇలా నగల షాపులు పారదర్శకత లేకుండా బంగారంపై వ్యాపారం చేస్తుంటాయి. బీఐఎస్ హాల్‌మార్కింగ్ స్టాండర్డ్ ఉన్నా ఇప్పటికీ ప్యూరిటీ కూడా ఓ పెద్ద మిస్టరీ. మీరు లేటెస్ట్ బంగారం ధరలు తెలుసుకోవాలంటే ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్‌కు చెందిన 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. గోల్డ్ రేట్స్ తెలుస్తాయి. https://www.ibja.co/ వెబ్సైట్లో కూడా గోల్డ్ రేట్స్ తెలుసుకోవచ్చు.
Prepaid Plans: రూ.300 లోపు Airtel, Jio, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
LIC Aadhaar Shila Plan: ఎల్ఐసీలో ఈ పాలసీ మహిళలకు మాత్రమే... లాభాలు ఇవే
ఇక జీరో వేస్టేజ్ లేదా జీరో మేకింగ్ లేదా వ్యాల్యూ అడిషన్ కాస్ట్ లాంటివి ఇలాంటి గోల్డ్ స్కీమ్స్‌కు అనుసంధానించడం కూడా తప్పే. "సాధారణంగా ఇలాంటివన్నీ కొన్ని డిజైన్లు, మోడల్స్‌కు మాత్రమే ఉంటాయి. మీరు అవి కొనేందుకు సుముఖంగా లేకపోతే మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ లాంటివి చెల్లించాలి. ఇవన్నీ కలిపితే మీరు పొదుపు చేసిన మొత్తంలో 8 నుంచి 10 శాతం రిటర్న్స్ తగ్గుతాయి" అని ఆదిల్ షెట్టి చెబుతున్నారు.
ఇలాంటి గోల్డ్ స్కీమ్స్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. వాయిదా పద్ధతుల్లో బంగారం కొనొచ్చన్న అంశంతో ఈ గోల్డ్ స్కీమ్స్ మంచివే అనిపిస్తుంది. కానీ వీటిని నియంత్రించడానికి ఎలాంటి చట్టాలు లేవు. వీటితో పాటు "అడ్వాన్స్‌గా కొంటే డిస్కౌంట్", "ఇన్స్టాల్మెంట్పై డిస్కౌంట్", "మెచ్యూరిటీ బెనిఫిట్ డిస్కౌంట్" లాంటి ప్రకటనలతో నగల షాపులు ఆకర్షిస్తుంటాయి. అయితే ఏడాది క్రితం గుడ్విన్ జ్యువెలర్స్లాగా ఒకవేళ నగల షాపులు దుకాణం ఎత్తేస్తే కస్టమర్లు తమ డబ్బును తిరిగి పొందడం కష్టమవుతుంది. ఈ కేసులో గుడ్విన్ జ్యువెలర్స్ యజమానులైన సునీల్ కుమార్, సుధీష్ కుమార్లపై ఐపీసీ 420, 406, 34, మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టారు. కానీ కస్టమర్లకు డబ్బులు తిరిగి రాలేదు. నగలూ రాలేదు. "సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై ప్రభుత్వం 2.5 శాతం ఇస్తుంటే, 6-12 శాతం రిటర్న్స్ ఇస్తామనే నగల షాపుల్ని నమ్మితే మోసపోవడం ఖాయం" అని రిద్ధి సిద్ధి బులియన్‌కు చెందిన పృథ్వీరాజ్ కొఠారి అన్నారు.
"మిమ్మల్ని ఆకర్షించేందుకు కొన్ని ఇన్స్టాల్మెంట్స్ని నగల షాపులు డిస్కౌంట్ రూపంలో ఇవ్వొచ్చు. కానీ మేకింగ్ ఛార్జీల రూపంలో వాటిని వసూలు చేస్తాయి. ధరించాలనుకుంటేనే నగలు కొనాలి. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ స్కీమ్స్ సరైన ఆప్షన్ కాదు" అని రూంగ్తా సెక్యూరిటీస్‌లో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ ప్లానర్ హర్షవర్ధన్ రూంగ్తా అన్నారు. అందుకే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడం మంచిది.
(ఈ ఆర్టికల్ మొదట Moneycontrol వెబ్సైట్లో పబ్లిష్ అయింది. ఒరిజినల్ ఆర్టికల్‌ను ఇక్కడ చదవొచ్చు.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates, Sovereign Gold Bond Scheme