• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • WHAT IS GOLD HALLMARKING WHY IT IS IMPORTANT FOR GOLD JEWELLERY KNOW FAQS SS

Gold Hallmarking: ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ఎందుకు? ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

Gold Hallmarking: ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ఎందుకు? ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

Gold Hallmarking: ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ఎందుకు? ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలి? తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Gold Hallmarking | హాల్‌మార్కింగ్ అంటే ఏంటీ? హాల్‌మార్క్‌లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? హాల్‌మార్క్‌తో లాభమేంటీ? అసలు హాల్‌మార్క్‌ను ఎలా గుర్తించాలి? తెలుసుకోండి.

  • Share this:
    మీరు బంగారు నగలు కొనాలనుకుంటున్నారా? ఒరిజినల్ నగలను ఎలా గుర్తించాలో తెలియట్లేదా? బంగారు నగల నాణ్యతను గుర్తించేందుకు మీకు హాల్‌మార్కింగ్ ఉపయోగపడుతుంది. 2021 జూన్ 1 నుంచి నగల షాపుల్లో కేవలం హాల్‌మార్కింగ్ ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే అమ్మాలి. వాస్తవానికి జనవరి 15 వరకే గతంలో డెడ్‌లైన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ డెడ్‌లైన్‌ను జూన్ 1 కి పొడిగించింది. కాబట్టి జూన్ 1 నుంచి షాపుల్లో అమ్మే నగలపై హాల్‌మార్క్ తప్పనిసరి. హాల్‌మార్కింగ్ లేని నగలను అమ్మకూడదు. ప్రస్తుతం నగల షాపుల్లో హాల్‌మార్క్ లేని నగలు కూడా లభిస్తున్నాయి. వాటిని కొనేవారు ఉన్నారు. మరి కొందరు హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా కావాలని అడిగేవారూ ఉన్నారు. కానీ జూన్ 1 నుంచి నగల షాపుల్లో కేవలం హాల్‌మార్క్ నగలు మాత్రమే దొరుకుతాయి.

    హాల్‌మార్క్ అంటే ఏంటీ?


    బంగారు నగల నాణ్యతను తెలిపేదే హాల్‌మార్కింగ్. అంటే నగల్లో ఉంటే బంగారం ఎంత అనే విషయాన్ని హాల్‌మార్క్ ద్వారా తెలుసుకోవచ్చు. బంగారు నగలను తయారు చేసిన తర్వాత హాల్‌మార్కింగ్ కోసం పంపిస్తారు తయారీదారులు. అక్కడ నగల్లో ఉన్న బంగారం శాతం ఎంత అని పరీక్షించి హాల్‌మార్క్ ముద్ర వేస్తారు. బంగారం బిస్కిట్ రూపంలో కొంటే 24 క్యారట్ ఉంటుంది. కానీ 24 క్యారట్ బంగారంతో నగలు తయారు చేయడం సాధ్యం కాదు. అందులో ఎంతో కొంత ఇతర లోహాలను కలపాల్సి ఉంటుంది. అలా ఎంత శాతం కలుపుతారన్నదానిపై బంగారు నగల స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. ఆ స్వచ్ఛతనే 14 క్యారట్, 18 క్యారట్, 22 క్యారట్ అని పిలుస్తారు.

    Most Expensive Bikes: ఇండియాలో లభిస్తున్న కాస్ట్‌లీ బైక్స్ ఇవే... ధర ఎంతో తెలుసా?

    JioFiber Free Trial: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియోఫైబర్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ వివరాలివే

    హాల్‌మార్క్‌లో ఎన్ని కేటగిరీలు ఉంటాయి?


    బంగారు నగల విషయానికి వస్తే మూడు కేటగిరీల్లో హాల్‌మార్క్ ఉంటుంది. మొదటిది 14 క్యారట్. 14K అని కూడా అంటారు. ఈ కేటగిరీలో బంగారం స్వచ్ఛత 58.5 శాతం మాత్రమే. అంటే మీరు 100 గ్రాముల 14 క్యారట్ నగలు కొంటే అందులో ఉండే బంగారం 58.5 గ్రాములు మాత్రమే. మిగతాది ఇతర లోహాలు కలిసి ఉంటాయి. ఇక రెండోది 18 క్యారట్. ఈ నగల్లో బంగారం స్వచ్ఛత 75 శాతం. మీరు 100 గ్రాముల 18 క్యారట్ నగలు కొంటే అందులో ఉండే బంగారం 75 గ్రాములు. ఇక మూడోది 22 క్యారట్. ఈ కేటగిరీ నగలు పాపులర్. నగల షాపుల్లో ఎక్కువగా అమ్ముడుపోయేది 22 క్యారట్ నగలే. మీరు 100 గ్రాముల 22 క్యారట్ నగలు కొంటే అందులో ఉండే బంగారం 91.6 గ్రాములు. అందుకే 22 క్యారట్ నగలను 916 గోల్డ్ అని కూడా పిలుస్తుంటారు.

    EPF Account: జాబ్ మానేసిన తర్వాత మీ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయలేదా? ఈ విషయం తెలుసా?

    EPF Withdrawal: ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయాలా? ఎంత తీసుకోవచ్చో తెలుసుకోండి

    నగలపై హాల్‌మార్క్ ఎలా గుర్తించాలి?


    మీరు కొన్న నగలు ఏ కేటగిరీకి చెందినవో తెలియాలంటే ఆ నగలపై ఉన్న హాల్‌మార్క్‌ను పరిశీలించాలి. హాల్‌మార్క్‌తో పాటు నగల స్వచ్ఛతను కూడా నగలపై ముద్రిస్తారు. ఇలాంటి అధికారిక ముద్రలు లేకుండా అవి 22 క్యారట్ నగలే అని అమ్ముతున్నారంటే నగల స్వచ్ఛతపై అనుమానించాల్సిందే. మీకు 22 క్యారట్ బంగారు నగలే అమ్ముతున్నారన్న గ్యారెంటీ ఉండదు. ఒకవేళ హాల్‌మార్క్ ఉంటే మోసపోయే అవకాశాలు తక్కువ. బంగారు నగలు మాత్రమే కాదు బంగారం, వెండితో తయారు చేసే ఎలాంటి వస్తువులైనా హాల్‌మార్క్ ఉంటేనే స్వచ్ఛతకు గ్యారెంటీ. ఇప్పుడైనా జూన్ 1 తర్వాతైనా మీరు నగలు కొనాలనుకుంటే హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలు తీసుకోవడం వల్ల మోసపోకుండా ఉంటారు.

    గతంలో కొన్న నగల పరిస్థితి ఏంటీ?


    మీరు ఇప్పటికే నగలు కొన్నట్టైతే స్వచ్ఛత పరీక్ష చేయించొచ్చు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS గుర్తింపు పొందిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్లకు వెళ్లొచ్చు. ప్రతీ రాష్ట్రంలో, ప్రతీ జిల్లాలో ఈ సెంటర్లు ఉంటాయి. ఎక్కడెక్కడ ఈ సెంటర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి https://bis.gov.in/ వెబ్‌సైట్‌ చూడండి.
    Published by:Santhosh Kumar S
    First published: