హోమ్ /వార్తలు /బిజినెస్ /

Digital Gold: డిజిటల్ గోల్డ్ కొన్నారా? ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు ఇలా

Digital Gold: డిజిటల్ గోల్డ్ కొన్నారా? ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు ఇలా

Digital Gold: డిజిటల్ గోల్డ్ కొన్నారా? ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Digital Gold: డిజిటల్ గోల్డ్ కొన్నారా? ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Digital Gold | డిజిటల్ గోల్డ్ కొంటున్నవారు ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవడానికి ఎప్పటికీ అవకాశం ఉంటుంది. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తాము ఇన్వెస్ట్ చేసిన బంగారాన్ని ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు.

బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. షాపులో నేరుగా బంగారం బిస్కెట్లు కొనొచ్చు. లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా కొనొచ్చు. అంతేకాదు... ఇటీవల డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్ పెరిగింది. అంటే కస్టమర్లు కొనే బంగారం డిజిటల్ రూపంలో ఉంటుంది. మరి డిజిటల్ గోల్డ్ కొంటే ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకునే అవకాశం ఉండదా? చాలామందికి ఇదే డౌట్ ఉంటుంది. ఒకవేళ మీరు డిజిటల్ గోల్డ్‌లో విడతల వారీగా ఇన్వెస్ట్ చేసినట్టైతే ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు. గోల్డ్ కాయిన్స్ లేదా బిస్కిట్స్‌గా మార్చొచ్చు. ఇలా ఒక్కసారి కాదు ఎన్ని సార్లైనా మీ డిజిటల్ గోల్డ్‌ను ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకునే అవకాశం ఉంది. దీన్నే గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అంటారు. అంటే మీరు డిజిటల్ పద్ధతిలో కొన్న బంగారాన్ని ఫిజికల్‌గా మార్చుకోవడానికి ఉపయోగపడే స్కీమ్ ఇది. ఈ విషయంలో కస్టమర్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

Post Office Savings Account: బ్యాంకు కన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌తో లాభం ఎక్కువ... ఎందుకంటే

ULIP Plan: యూలిప్ ప్లాన్ అంటే ఏంటీ? ఈ ప్లాన్‌తో లాభమెంత?

ప్రస్తుతం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి సంస్థలు డిజిటల్ గోల్డ్ అమ్ముతున్నాయి. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోల్డ్ రష్ ప్లాన్‌లో భాగంగా డిజిటల్ గోల్డ్ అమ్మకాలు సాగుతున్నాయి. MMTC-PAMP లేదా సేఫ్‌గోల్డ్‌ సహకారంతో ఈ సంస్థలు డిజిటల్ గోల్డ్ అమ్మకాలు సాగిస్తున్నాయి. ప్రతీ నెల కొంత బంగారంపై పొదుపు చేసి ఒకేసారి బంగారంగా మార్చుకోవాలనుకునేవారికి డిజిటల్ గోల్డ్ మంచి పెట్టుబడి ఆప్షన్. ఇందులో మీరు కనీసం రూ.1,000 నుంచి పొదుపు చేయొచ్చు. ఒకేసారి గోల్డ్ కొనొచ్చు. లేదా ప్రతీ నెల ఫిక్స్‌డ్ పేమెంట్ చేయొచ్చు. డిజిటల్ గోల్డ్ సురక్షితమేనా అన్న అనుమానం రావొచ్చు. డిజిటల్ గోల్డ్‌కు పూర్తి బీమా, సెక్యూరిటీ ఉంటాయి. సేఫ్ గోల్డ్ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనేవారు 24 క్యారట్ ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు. జస్ట్ ఓ బటన్ క్లిక్ చేస్తే చాలు ఫిజికల్ గోల్డ్ పొందొచ్చు.

IRCTC: తెలుగు రాష్ట్ర నుంచి దక్షిణ భారతదేశ యాత్ర... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

SBI ATM cash: మీ ఏటీఎం కార్డుతో ఎంత డ్రా చేయొచ్చో తెలుసా? లిమిట్ ఇదే

ఈ స్కీమ్ కింద గోల్డ్ పొందాలనుకునేవారు మెటల్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైనా మీరు ఫిజికల్ గోల్డ్ ఆర్డర్ చేయొచ్చు. స్వచ్ఛమైన బంగారాన్ని పొందొచ్చు.

First published:

Tags: BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates, Sovereign Gold Bond Scheme

ఉత్తమ కథలు