ఇ-పాస్‌పోర్టుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల పాస్‌పోర్ట్ సేవా దివస్ రోజున విదేశాంగ మంత్రి జైశంకర్... పౌరులకు త్వరలో చిప్ ఉన్న ఇ-పాస్‌పోర్టులు జారీ చేస్తామని ప్రకటించారు. నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌తో కలిసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇ-పాస్‌పోర్టుల్ని జారీ చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో మరోసారి ఇ-పాస్‌పోర్ట్ గురించి చర్చ మొదలైంది. అసలు ఇ-పాస్‌పోర్ట్ అంటే ఏంటీ? ఇప్పుడు ఉన్న పాస్‌పోర్టు కన్నా భిన్నంగా ఎలా ఉంటుంది? ఇ-పాస్‌పోర్ట్‌తో కలిగే లాభాలేంటీ? అన్న ప్రశ్నలు, సందేహాలు చాలామందిలో ఉన్నాయి. మరి ఇ-పాస్‌పోర్ట్ ఎలా ఉంటుందో? లాభాలేంటో తెలుసుకోండి.
ఇ-పాస్‌పోర్ట్ అంటే ఏంటీ?
భారత పౌరులకు ఇ-పాస్‌పోర్టులు ఇవ్వాలన్న నిర్ణయం ఇప్పటిది కాదు. 2017వ సంవత్సరంలోనే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల దగ్గర వెరిఫికేషన్ ప్రక్రియ సులువుగా, వేగంగా జరిపేందుకు ఇ-పాస్‌పోర్టులు ఉపయోగపడ్తాయి. ఇ-పాస్‌పోర్టులు ఉంటే వెరిఫికేషన్ కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. విదేశాంగ శాఖ త్వరలో జారీ చేసే ఇ-పాస్‌పోర్టులో చిప్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులో ఉండే చిప్ లాంటిదే ఇ-పాస్‌పోర్టులో ఉంటుంది. ఇందులో పాస్‌పోర్ట్ హోల్డర్ పేరు, అడ్రస్, వేలిముద్రలతో పాటు 30 ప్రయాణాలకు సంబంధించిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఇ-పాస్‌పోర్టులో ఈ చిప్ చాలా కీలకం. చిప్ పాడైందంటే ఎయిర్‌పోర్టులో ఆథెంటికేషన్ సాధ్యం కాదు.
ఇ-పాస్‌పోర్టు కోసం కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ-కాన్పూర్, నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్‌కు చెందిన నిపుణులు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాస్పోర్టుతో పోలిస్తే పేపర్ క్వాలిటీ, ప్రింటింగ్ బాగుంటుంది. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లుంటాయి. ఇప్పటికే ఇ-పాస్‌పోర్టుల తయారీకి నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌కు అప్రూవల్ ఇచ్చింది కేంద్రం. అయితే ఇ-పాస్‌పోర్ట్ తయారీకి ఎలక్ట్రానిక్ కాంటాక్ట్‌లెస్ ఇన్లేస్ కావాలి. వీటిని సమకూర్చేందుకు నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్‌కు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఇ-పాస్‌పోర్ట్ ప్రోటోటైప్‌ను అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబరేటరీలో పరీక్షించారు. మొదటి దశలో అధికారులు, దౌత్యవేత్తలకు ఇ-పాస్‌పోర్టులు జారీ చేస్తుంది విదేశాంగ శాఖ. ఆ తర్వాత పౌరులకు ఇ-పాస్‌పోర్టులు తీసుకోవచ్చు.
Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్
ఇవి కూడా చదవండి:
New Rules: జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే...
LG Smartphone: రూ.9,999 ధరకే ట్రిపుల్ కెమెరా ఫోన్... ఎల్జీ సంచలనం
WhatsApp: పాత ఫోన్లల్లో వాట్సప్ బంద్... కొత్త ఫోన్ కొనాల్సిందేPublished by:Santhosh Kumar S
First published:June 27, 2019, 11:23 IST