హోమ్ /వార్తలు /బిజినెస్ /

E-bank Guarantee: E-బ్యాంక్ గ్యారెంటీ అంటే ఏంటి..? దీనికి పాపులారిటీ ఎందుకు పెరుగుతుంది..?

E-bank Guarantee: E-బ్యాంక్ గ్యారెంటీ అంటే ఏంటి..? దీనికి పాపులారిటీ ఎందుకు పెరుగుతుంది..?

E-bank Guarantee: E-బ్యాంక్ గ్యారెంటీ అంటే ఏంటి..? దీనికి పాపులారిటీ ఎందుకు పెరుగుతుంది..?

E-bank Guarantee: E-బ్యాంక్ గ్యారెంటీ అంటే ఏంటి..? దీనికి పాపులారిటీ ఎందుకు పెరుగుతుంది..?

E-bank Guarantee: యెస్ బ్యాంక్ (Yes Bank) ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ సిస్టమ్‌ను ప్రారంభించింది. నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (NeSL) భాగస్వామ్యంతో e-BGని తాజాగా లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ ఏంటి, దీనికి ఎందుకింత క్రేజ్‌? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సాధారణంగా నిర్దిష్ట మొత్తంలో డబ్బులు కట్టేలా బ్యాంకులు హామీ ఇచ్చేదే బ్యాంకు గ్యారంటీ (Bank Guarantee). బ్యాంక్ గ్యారెంటీ ప్రాసెస్‌లో చాలా రాతపని, వెరిఫికేషన్ ఉంటుంది. అందుకే బ్యాంకు హామీని జారీ చేయడానికి 3-4 పని దినాలు పట్టవచ్చు. దీనివల్ల బిజినెస్‌లకు చాలా తలనొప్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారంగా ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీని (e-BG) బ్యాంక్స్ తీసుకొస్తున్నాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు యెస్ బ్యాంక్ (Yes Bank) కూడా ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ సిస్టమ్‌ను ప్రారంభించింది. నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (NeSL) భాగస్వామ్యంతో e-BGని తాజాగా లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ ఏంటి, దీనికి ఎందుకింత క్రేజ్‌? వంటి వివరాలు తెలుసుకుందాం.

e-BG అనేది బ్యాంక్ గ్యారెంటీ ఫిజికల్ డాక్యుమెంటేషన్ అవసరాన్ని తొలగించే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్. ఇది వ్యాపారాలు బ్యాంక్ గ్యారెంటీలను పొందేందుకు వేగంగా, మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. సాధారణంగా బ్యాంక్ గ్యారెంటీ కోసం 3-4 పని దినాలు పడుతుంది. అయితే కొత్త e-BG సిస్టమ్‌తో, వ్యాపారాలు కొన్ని నిమిషాల్లో బ్యాంక్ గ్యారెంటీ పొందవచ్చు.

ఇది గ్యారెంటీ కోరుకునే వ్యాపార సంస్థకు, దానిని అందించే బ్యాంకు రెండింటికీ సమయం, కృషిని ఆదా చేస్తుంది. SBI, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు e-BG విధానాన్ని ఆల్రెడీ తీసుకొచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు ఈ ఎలక్ట్రానిక్ వ్యవస్థను తీసుకువచ్చే అవకాశముంది.

ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ (e-BG) డిజిటల్ ప్రక్రియ పేపర్ బేస్డ్ ప్రాసెస్‌ను భర్తీ చేస్తూ రుణదాతకు త్వరగా గ్యారెంటీ ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. e-BGతో NeSL పోర్టల్‌లో టెక్స్ట్-జనరేషన్, ఈ-స్టాంపింగ్, ఈ-సైనింగ్, హోస్టింగ్‌తో సహా మొత్తం ప్రక్రియను క్షణాల్లోనే పూర్తి చేయవచ్చు. ఇది ఫిజికల్ డాక్యుమెంట్ల అవసరాన్ని తొలగిస్తుంది. సమయాన్ని ఆదా చేస్తుంది, అదే సమయంలో మోసం లేదా తారుమారు చేసే అవకాశాలను కూడా పూర్తిగా తగ్గించేస్తుంది. అందుకే బ్యాంకులు ఈ ప్రక్రియను ఆశ్రయిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : కారు కొనాలనుకునే వారు ఈ ఏడు రోజుల్లో కొనేయండి.. లేదంటే ఫసక్కే!

* అప్లికేషన్ ప్రాసెస్

ఇక ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీ (e-BG) కోసం దరఖాస్తు చేసుకునే విషయానికి వస్తే.. ఈ ప్రక్రియలో ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడం, ప్రివ్యూ ద్వారా వివరాలను చెక్ చేసుకోవడం, నిర్ధారించడం, డాక్యుమెంట్‌పై డిజిటల్ స్టాంప్ చేయడం, సంతకం చేయడం వంటివి ఉంటాయి. ఇక ఫైనల్ e-BG వెర్షన్ అనేది NeSL (నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్) పోర్టల్‌లో స్టోర్ అవుతుంది. దీనిని యాక్సెస్ చేయడానికి లబ్ధిదారులు NeSL పోర్టల్‌లో చెక్ చేయవచ్చు. e-BGని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేయవచ్చు లేదా అవసరమైన విధంగా డిజిటల్ ఫార్మాట్‌లో సేవ్ చేయవచ్చు.

* ఫీచర్స్, బెనిఫిట్స్

జారీ చేసిన అన్ని e-BGలకు కేంద్ర రిపాజిటరీగా NeSL పనిచేస్తుంది. ఇది e-BGలను ఈజీగా బదిలీ చేయడానికి, స్టోర్ చేయడానికి తోడ్పడుతుంది. e-BGకి సంబంధించిన అన్ని అప్‌డేట్‌లు నేరుగా లబ్ధిదారునికి, పాల్గొన్న ఇతర పార్టీలకు తెలుస్తాయి. ఎలక్ట్రానిక్ బిజినెస్ రిజిస్ట్రేషన్ అమలు చేయడం వల్ల వ్యాపార ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ పని సులభతరం అవుతుంది. వెరిఫికేషన్ కూడా ఈజీగా జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ గడువు ముగిసేలోపు సంబంధిత పార్టీలు అలర్ట్స్ పొందుతారు. మొత్తంమీద, eBG వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది.

First published:

Tags: Banking, Personal Finance, Sbi, YES BANK

ఉత్తమ కథలు