Home /News /business /

దీపావళి సందర్భంగా Digital Gold కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ 7 విషయాలను కచ్చితంగా తెలుసుకోండి

దీపావళి సందర్భంగా Digital Gold కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ 7 విషయాలను కచ్చితంగా తెలుసుకోండి

 (ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

డిజిటల్ గోల్డ్‌ను ప్రభుత్వ గుర్తింపు పొందిన మూడు ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థలు అందిస్తున్నాయి. పేటీఎం, అమెజాన్​ పే, గూగుల్​ పే, ఫోన్​ పే వంటి ప్ర​ముఖ డిజిటల్​ ప్లాట్​ఫామ్​ల ద్వారా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

Digital Gold : దీపావళి, ధన్‌ తేరాస్ (ధన త్రయోదశి) పర్వదినాల్లో బంగారం కొనడం భారతీయులకు ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఏటా ఈ సీజన్​లో బంగారం కోనుగోళ్లు రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. అయితే ఈసారి కరోనావైరస్ మహమ్మారి దృష్ట్యా, చాలా మంది జ్యువెలరీ షాపులకు వెళ్లడానికి జంకుతున్నారు. ఫలితంగా డిజిటల్​ గోల్డ్​ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ డిజిటల్ గోల్డ్‌ను ప్రభుత్వ గుర్తింపు పొందిన మూడు ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థలు అందిస్తున్నాయి. పేటీఎం, అమెజాన్​ పే, గూగుల్​ పే, ఫోన్​ పే వంటి ప్ర​ముఖ డిజిటల్​ ప్లాట్​ఫామ్​ల ద్వారా డిజిటల్ బంగారాన్ని Digital Gold కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధర, సులభంగా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో డిజిటల్​ గోల్డ్​కు ఆదరణ పెరుగుతోంది. అయితే డిజిటల్ గోల్డ్​ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేదంటే, నకిలీ బంగారం బారీన పడే అవకాశం ఉంది.

ఇవి చదవండి..Smartphones: స్మార్ట్ ఫోన్ పేలకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...

డిజిటల్ గోల్డ్​ కొనుగోలు సమయంలో గుర్తించుకోవాల్సిన అంశాలివే..

1. ప్యూరిటీ

డిజిటల్ గోల్డ్​ను కొనుగోలు చేసే ముందు ప్యూరిటీని ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్​ నిపుణుల ప్రకారం, సేఫ్‌గోల్డ్‌ ప్లాట్‌ఫాంల నుంచి కొనే బంగారం కంటే MMTC-PAMP నుంచి కొనే డిజిటల్ బంగారం ఎక్కువ స్వచ్ఛమైనది. కాబట్టి డిజిటల్​ గోల్డ్​ కొనే ముందు ఈ అంశాన్ని పరిశీలించండి.

2. ధర

కేవలం రూ. 1 పెట్టుబడితో కూడా డిజిటల్​ గోల్డ్​ను కొనుగోలు చేయవచ్చు. అదే ఫిజికల్​ గోల్డ్​, నాణేల కొనుగోలు విషయంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇది డిజిటల్​ గోల్డ్​ కొనుగోలుకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.

ఇవి చదవండి..WhatsApp: గూగుల్‌ డ్రైవ్‌ లేకుండా కొత్త ఫోన్‌లోకి వాట్సప్​ డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా

3. స్టోరేజ్​

ఫిజికల్​ గోల్డ్​ వలే డిజిటల్​ గోల్డ్​ స్టోరేజ్​ విషయంలో భద్రత, స్టోరేజీ సమస్య ఉండదు. మీ గోల్డ్​ అత్యంత భద్రంగా ఉంటుంది. మీ అవసరానికి తగ్గట్లు మిల్లీ గ్రాముల బంగారాన్ని కూడా అమ్ముకోవచ్చు. మిగిలిన బంగారం డిజిటల్ వాలెట్​లో బ్యాలెన్స్‌గా కనిపిస్తుంది.

4. జీఎస్​టీ, ఇతర ఛార్జీలు

ఫిజికల్​ గోల్డ్​ వలే డిజిటల్ గోల్డ్​పై కూడా 3 శాతం జీఎస్​టీ వర్తిస్తుంది. డిజిటల్​ సర్వీస్​ ప్రొవైడర్లు మీ బంగారానికి అవసరమయ్యే స్టోరేజ్​ ఖర్చు, బీమా, ట్రస్టీ ఫీజు వంటి వాటి కోసం 2 నుంచి 3 శాతం అదనపు రుసుము వసూలు చేస్తాయి. కస్టమర్ డిజిటల్ బంగారాన్ని భౌతిక బంగారంగా మార్చాలనుకుంటే, పరిమాణాన్ని బట్టి మేకింగ్ ఛార్జీలు ఉంటాయి.

5. గరిష్ట హోల్డింగ్ వ్యవధి

డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులకు గరిష్ట హోల్డింగ్ వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధిలోపు బంగారాన్ని డెలివరీ ఫిజికల్​ రూపంలోకి మార్చుకోవాలి లేదంటే తిరిగి విక్రయించాలి. MMTC-PAMP సర్వీస్​ ప్రొవైడర్​ మీ డిజిటల్ గోల్డ్​ను ఐదేళ్ల పాటు హోల్డ్​ చేసేందుకు అనుమతిస్తుంది.

6. డిజిటల్ గోల్డ్​పై పన్ను

డిజిటల్ గోల్డ్​ హోల్డింగ్ వ్యవధి పెట్టుబడిదారుడు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని బట్టి నిర్ణయిస్తారు. డిజిటల్ బంగారాన్ని 36 నెలల కంటే తక్కువ ఉంచినట్లయితే, రిటర్న్‌లపై ఎటువంటి పన్ను విధించరు. అయితే, లాభాలపై 4 శాతం సెస్‌తో పాటు 20 శాతం పన్ను విధిస్తారు.

7. డిజిటల్​ గోల్డ్​కు ప్రతికూల అంశం

డిజిటల్​ గోల్డ్​ కొనుగోళ్లు, అమ్మకాలకు ఎటువంటి రెగ్యులేటరీ మెకానిజం ఉండదు. ఇదే డిజిటల్​ గోల్డ్​కు ప్రతికూల అంశంగా చెప్పవచ్చు. అయితే, ఫిజికల్​ గోల్డ్​ విషయంలో మాత్రం సెబీ కంట్రోలింగ్​ ఉంటుంది. అందుకే, వీటికి రీసేల్​ వాల్యూ ఉంటుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Gold, Gold price

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు