Home Loan Balance Transfer: రుణ బ్యాలెన్స్ బదిలీ అంటే ఏంటి...ఎలా వర్తిస్తుంది...

ఇటీవల కాలంలో బ్యాలెన్స్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ లోన్లు ఎక్కువవుతున్నాయి. అంటే ఎవరైనా రుణాలు తీసుకుని తీర్చలేని పక్షంలో ఆ రుణ మొత్తాన్ని తక్కువ వడ్డీ రేటుకు వేరే కొత్త రుణదాతకు బదిలీ చేస్తారు. అంతేకాకుండా తక్కువ వడ్డీనే కాకుండా కొత్త రుణదాతకు మెరుగైన ఫీచర్లు, సేవలను అందిస్తారు.

news18-telugu
Updated: November 16, 2020, 7:05 PM IST
Home Loan Balance Transfer: రుణ బ్యాలెన్స్ బదిలీ అంటే ఏంటి...ఎలా వర్తిస్తుంది...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఇటీవల కాలంలో బ్యాలెన్స్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ లోన్లు ఎక్కువవుతున్నాయి. అంటే ఎవరైనా రుణాలు తీసుకుని తీర్చలేని పక్షంలో ఆ రుణ మొత్తాన్ని తక్కువ వడ్డీ రేటుకు వేరే కొత్త రుణదాతకు బదిలీ చేస్తారు. అంతేకాకుండా తక్కువ వడ్డీనే కాకుండా కొత్త రుణదాతకు మెరుగైన ఫీచర్లు, సేవలను అందిస్తారు. ఇక్కడ మీకు మొదట రుణాన్ని ఇచ్చిన బ్యాంకులు చెల్లించని మొత్తాన్ని లోన్ చెల్లిస్తుంది. అంతేకాకుండా రుణ గ్రహీత మీ రుణ ఖాతాను ఇప్పుడు తీసుకునే రుణదాత నిర్ణయించిన వడ్డీ రేటుతో EMI సేవలను చేయాల్సి ఉంటుంది. గృహ రుణం, ఆస్తిపై ఇచ్చి రుణం, విద్యా రుణం, వ్యక్తిగత రుణం, ఆటో లోన్ తో సహా అన్ని రకాల రుణాలకు ఈ బదిలీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ లక్షణంతో భారత్ లోని ప్రతి ఆర్థిక వ్యవస్థ లేదా రుణదాతతో వ్యవహరించాల్సి ఉంటుంది.

రుణ బ్యాలెన్స్ బదిలీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి..

గృహ రుణం లేదా ఆస్తిపై ఇచ్చే లోన్ లాంటి భారీ రుణాలకు సంబంధించి ఏదైనా ఇతరు లోన్ కేటగిరీకి కేవలం ఖర్చు ప్రయోజనం కోసమో, తక్కువ వడ్డీ రేటు కోసం నూతన రుణదాతకు మారడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రుణాదాతలు ప్రాసెసింగ్ ఫీజును విధిస్తారు. అంతేకాకుండా రుణ కాలం ముగియడానికి కొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉండి, చెల్లించని మొత్తం తక్కువగా ఉన్న స్థితిలో బ్యాలెన్స్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ సదుపాయం మంచిది కాదు.

ప్రారంభ సంవత్సరాల్లో రుణం వైపు EMIలకు సేవలు అందిస్తుంటే.. వడ్డీ రేటులో 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు కోసం రుణ బ్యాలెన్స్ బదిలీ, మీ కోసం భారీ వడ్డీ అవుట్ గోను ఆదా చేయడంలో చాలా దూరం వెళ్తుంది. ఒక్క బేసిస్ పాయింట్ ఒక్క శాతంలో వందో వంతు ఉంటుంది.

రూ.50 లక్షల మీ గృహ రుణంపై 12 శాతం వడ్డీ అనేది ప్రధాన మొత్తంపై సురక్షితమైన రేటు. అంటే ఇది రూ.58,01,513లు చెల్లించాల్సి ఉంటుంది. రుణ బ్యాలెన్స్ బదిలీ ద్వారా వడ్డీ 11.5 శాతానికి తగ్గితే 15 ఏళ్ల కాలంలో చెల్లించాల్సిన మొత్తంలో రూ.55,13,708లు. అంటే 3 లక్షల రూపాయలు ఆదా అవుతుంది.

తిరిగి చెల్లించడంలో క్లీన్ క్రెడిట్ కలిగిన రుణ గ్రహీతకు ఇలాంటి సౌకర్యం సులభంగా వర్తిస్తుంది. అంతేకాకుండా మునుపటి EMI చెల్లింపులపై డీఫాల్ట్ చేయాల్సిన పనిలేదు. ప్లస్ డాక్యూమెంటేషన్ ఉంది.
రుణ బ్యాలెన్స్ బదిలీకి డాక్యూమెంటేషన్ అవసరం..

ఒకవేళ ఇది మీరు ముందస్తుగా ఆమెదించిన లోన్ అయితే.. మీరు రుణాన్ని ఇతర క్రెడిట్ కార్డుల నుంచి హెచ్ డీఎఫ్సీ క్రెడిట్ కార్డుకు బదిలీ చేసినప్పుడు డాక్యూమెంటేషన్ అవసరం లేదు. గృహ రుణ బ్యాలెన్స్ బదిలీ విషయంలో డాక్యూమెంటేషన్ విస్తృత ఆధారమైనవి. అన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
1. ఇప్పటికే ఉన్న రుణదాత నుంచి రుణ బ్యాలెన్స్ బదిలీ కోసం సమ్మతి లేఖ
2. రుణదాత నుంచి రుణ ఒప్పందం
3. NOC
4. మొదటి రుణదాత నుంచి జప్తు లేఖ
5. ఆస్తి పత్రాలు- ఆస్తి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, స్టాంప్ డ్యూటీ పేపర్లు, చెల్లింపు రశీదులో యజామాన్యాన్ని రుజువు చేసే పత్రాలు
6. గృహ రుణ ప్రకటన
7.పోస్ట్ డేటెడ్ చెక్కులు
8. మీ ఆదాయానికి రుజువుగా ఆర్థిక పత్రాలు, శాలరీ స్లిప్స్, ఫారం 16, మీ జీతం ఖాతా బ్యాంక్ స్టేట్ మెంట్ వంటి మీ రుణ చెల్లించే సామర్థ్యానికి మద్దతు ఇవ్వడం

రుణ బ్యాలెన్స్ బదిలీ ప్రయోజనాలు..
కొత్త రుణదాతకు రుణ బ్యాలెన్స్ బదిలీ చేయడం వల్ల రుణ పదవీకాలంపై తగ్గిన వడ్డీ రేటుతో పాటు కొంత మేరకు పొదుపు చేయవచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ సదుపాయాన్ని పొందడంలో పాల్గొన్న ప్రాసెసింగ్ ఛార్జీల కంటే ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా దాని కోసం వెళ్లాలి. రుణ బ్యాలెన్స్ బదిలీతో అందుబాటులో ఉన్న టాప్-అప్ లోన్ నిబంధన కూడా ఉంది. ఇది తీవ్రమైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎంచుకోవాలి.

అలాగే రుణం బ్యాలెన్స్ బదిలీని మీ రుణాన్ని తిరిగి అంచనా వేయడానికి ఓ మార్గంగా చూడాలి. గృహ రుణం లాంటి దీర్ఘకాలిక పదవీకాల రుణాల విషయంలో తరచుగా బ్యాలెన్స్ బదిలీ ద్వారా మీరు మీ రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. అంతేకాకుండా క్లియర్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవచ్చు.
Published by: Krishna Adithya
First published: November 16, 2020, 7:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading