హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pre-Approved Loans: అప్పు కావాలా? ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఈజీగా తీసుకోవచ్చు ఇలా

Pre-Approved Loans: అప్పు కావాలా? ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఈజీగా తీసుకోవచ్చు ఇలా

Loan on Shares: మీ దగ్గర ఉన్న షేర్లపై లోన్.. వడ్డీ చాలా తక్కువ.. ఎంతవరకు  ఇస్తారంటే ?

Loan on Shares: మీ దగ్గర ఉన్న షేర్లపై లోన్.. వడ్డీ చాలా తక్కువ.. ఎంతవరకు ఇస్తారంటే ?

Pre-Approved Loans | అప్పు కావాలా? బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బ్యాంకు మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తుందేమో ఓసారి ఆరా తీయండి. ఈ లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు తమ ప్రస్తుత కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ అందిస్తాయి. క‌స్ట‌మ‌ర్ల‌ క్రెడిట్ ప్రొఫైల్స్ బ్యాంకుల ఎలిజిబిలిటీ క్రైటీరియాకు స‌రిపోయిన త‌రువాతే రుణాలు మంజూరు చేస్తాయి. సాధారణంగా వినియోగ‌దారుల‌ క్రెడిట్ స్కోరు, నెలవారీ ఆదాయం, జాబ్‌ ప్రొఫైల్, ఉద్యోగం చేస్తున్న‌సంస్థ‌ ప్రొఫైల్, గ‌త‌ లావాదేవీల ఆధారంగా రుణ అర్హత (లోన్ ఎలిజిబిటిటీ)‌ను నిర్ధారిస్తారు. సంబంధిత‌ బ్యాంకులో డిపాజిట్లు చేసే వినియోగ‌దారుడికి మంచి క్రెడిట్ స్కోరు, అద్భుతమైన లావాదేవీలు, రీపేమెంట్ హిస్ట‌రీ, త‌గినంత అకౌంట్‌ బ్యాలెన్స్ ఉంటేనే బ్యాంకులు ప్రీ అప్రూవుడ్ లోన్‌ను ఇస్తాయ‌ని పైసాబజార్ సంస్థ డైరెక్ట‌ర్ గౌర‌వ్ అగ‌ర్వాల్ చెబుతున్నారు. క్రెడిట్ కార్డు వాడేవారి క్రెడిట్ స్కోర్లు, బిల్ రీపేమెంట్ హిస్ట‌రీ బాగుంటే, సంబంధిత బ్యాంకులు క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కు ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని గౌర‌వ్ తెలిపారు.

PM SVANidhi: చిరు వ్యాపారులకు రుణాలు... రూ.163 కోట్లు ఇచ్చిన మోదీ ప్రభుత్వం... అప్లై చేయండిలా

SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు లేవా? డిపాజిట్ మెషీన్‌లో ట్రై చేయండి ఇలా

ఎవాల్యుయేష‌న్ పూర్త‌యితేనే


ప్రీ అప్రూవుడ్ లోన్లు ఇచ్చే ముందు బ్యాంకులు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటాయి. వాటిలో క్రెడిట్ ఎవాల్యువేష‌న్ ముఖ్య‌మైన‌ది. ప్రీ అప్రూవుడ్ లోన్‌ను కేవ‌లం అప్పు ఇవ్వ‌డానికి ఇచ్చే ద‌ర‌ఖాస్తుకు ఆహ్వానంగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాలి. ఎందుకంటే బ్యాంకులు క్రెడిట్ ఎవాల్యువేష‌న్ చేసిన త‌రువాతే లోన్ అప్రూవ‌ల్ చేస్తాయి. బ్యాంకులు అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటాయి కాబ‌ట్టి, ప్రీ అప్రూవుడ్ లోన్స్ తొంద‌ర‌గా ఆమోదించే అవ‌కాశం ఉంది. ప్రీ అప్రూవుడ్ లోన్‌కు అప్లై చేయాల‌న్నా, బ్యాంకులు అప్రూవ్ చేయాల‌న్నా కస్టమర్ కొన్ని వివ‌రాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాలి. బ్యాంకులు లోన్‌కు సంబంధించిన వివ‌రాలను ఎస్ఎంఎస్ ద్వారా లింక్ రూపంలో పంపుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా ఫోన్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా తమకు పంపిన లింకులకు వినియోగ‌దారులు స్పందించడం ద్వ‌రా ప్ర‌క్రియ‌ను సుల‌భంగా పూర్తి చేయ‌వ‌చ్చు. లోన్ ప్రాసెసింగ్ సిస్టం మొత్తం సుల‌భంగా ఫోన్ ద్వారానే బ్యాంకులు పూర్తి చేస్తాయి.

Gold FD Scheme: మీ దగ్గరున్న బంగారానికి వడ్డీ వస్తుంది... ఎలాగో తెలుసుకోండి

SBI Loan: ఎస్‌బీఐలో మీ లోన్ భారం తగ్గించుకోవడానికి రూల్స్ ఇవే

ప్రీ అప్రూవుడ్ లోన్ల వ‌ల్ల లాభాలేంటీ?


రుణ పంపిణీ: ప్రీ అప్రూవుడ్ లోన్ తీసుకోవాల‌నుకునే వ్య‌క్తులు ఇంత‌కు ముందే ఆ బ్యాంకులో క‌స్ట‌మ‌ర్‌గా ఉంటే రుణ ప్ర‌క్రియ సుల‌భంగా పూర్త‌వుతుంది. తక్కువ వ్యవధిలోనే వినియోగ‌దారుల బ్యాంకు ఖాతాకు లోన్ మొత్తాన్ని జ‌మ‌ చేస్తారు.

డాక్యుమెంటేషన్: ప్రీ-అప్రూవ్డ్ లోన్‌ పొందే ప్రక్రియను సుల‌భంగా పూర్తి చేయ‌వ‌చ్చు. సాధార‌ణ రుణాల మాదిరిగా లోన్ అప్రూవ‌ల్ కోసం భారీ డాక్యుమెంటేషన్, ఇత‌ర పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి.

షూరిటీ అవసరం లేదు: ఈ రుణాలు పొందటానికి రుణగ్రహీతలు ఎటువంటి షూరిటీల‌ను, సెక్యూరిటీల‌ను బ్యాంకుల‌కు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు.

రీ పేమెంట్ ఫెసిలిటీ: ఈ ప‌ద్ధ‌తిలో లోన్ తీసుకున్న‌వారు ఈఎంఐల రూపంలో రీపేమెంట్ చేయొచ్చు. సంబంధిత బ్యాంకుల్లో ఇంత‌కుముందే ఖాతా ఉన్న కస్టమర్లు EMI లను చెల్లించడానికి ఆటో-డెబిట్ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. స్టాండ‌ర్డ్ రీపేమెంట్ టెన్యూర్‌ను 12 నుండి 60 నెలల వ‌ర‌కు ఎంచుకోవ‌చ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank loans, Car loans, Gold loans, Home loan, Housing Loans, Personal Finance, Personal Loan

ఉత్తమ కథలు