Home /News /business /

WHAT HAPPENS WHEN YOU MISS YOUR BNPL PAYMENT DETAILS HERE GH VB

BNPL: ఇండియాలో బై నౌ పే లేటర్​ సర్వీసులకు ఫుల్​ డిమాండ్​.. నిబంధనలు మీరితే అంతే ఇక.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియాలో బీఎన్‌పీఎల్‌(బయ్‌ నౌ పే లేటర్‌) (BNPL- Buy Now Pay Later) ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే బీఎన్‌పీఎల్‌ వినియోగించే సమయంలో విధించే కోతలు, సక్రమంగా తిరిగి చెల్లించకపోతే ఎదురయ్యే చిక్కులు, అందే సేవల్లో ఉండే పారదర్శకతపై(Transperency) అవగాహన అవసరం.

ఇంకా చదవండి ...
ఇండియాలో బీఎన్‌పీఎల్‌(బయ్‌ నౌ పే లేటర్‌) (BNPL- Buy Now Pay Later) ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే బీఎన్‌పీఎల్‌ వినియోగించే సమయంలో విధించే కోతలు, సక్రమంగా తిరిగి చెల్లించకపోతే ఎదురయ్యే చిక్కులు, అందే సేవల్లో ఉండే పారదర్శకతపై(Transparency) అవగాహన అవసరం. ఈ రోజుల్లో చాలా ఎక్కువగా బయ్‌ నౌ పే లేటర్‌ అనే పదం వినిపిస్తోంది. ఇండియాలో ప్రస్తుతం బీఎన్‌పీఎల్‌ ఇండస్ట్రీ విలువ రూ.22,500 కోట్ల నుంచి రూ.26,250 కోట్ల మధ్య ఉంది. 2026వ సంవత్సరానికి రూ.3.37- రూ.3.75 లక్షల కోట్లకు చేరుతుందని రెడ్‌సీర్‌ అనే కన్సల్టెన్సీ సంస్థ చెబుతోంది. యువత, సెల్ఫ్‌ ఎంప్లాయర్స్‌ (Self Employed) ఎక్కువగా ఈ బీఎన్‌పీఎల్‌ సేవలను వినియోగిస్తున్నారు. వారి ఆర్థకి పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం.

PIB Fact Check: 10వ తరగతి బోర్డు పరీక్షలు నిజంగానే రద్దు కానున్నాయా..? వైరల్​ అవుతున్న పోస్ట్​లు..


ఇండియాలో క్రెడిట్‌కార్డులు వినియోగిస్తున్న వారు 67 మిలియన్ల మంది మాత్రమే. బ్యాంకులు ఆర్థికంగా ముందున్న 100 మిలియన్ల ప్రజలనే లక్ష్యం చేసుకొని పని చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే పనిలో బీఎన్‌పీఎల్‌ ఇండస్ట్రీ నిమగ్నమైంది. మార్కెట్లో బీఎన్‌పీఎల్‌ సేవలను ఆయా సంస్థలు రెండు రకాలుగా అందిస్తున్నాయి. అవి పేమెంట్ ఫైనాన్ష్‌(Payment Finance), ట్రాన్సాక్షన్‌ ఫైనాన్ష్‌(Transaction Finance). లేజీపే, సింప్ల్‌ వంటి సంస్థలు అందిస్తున్న సేవలు పొందాలంటే క్రెడిట్ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ సమాచారం అందించకుండా ఈజీగా చివరికి ఓటీపీ(One Time Password)లు కూడా రాకుండా నగదు వినియోగించుకోవచ్చు.

వ్యాలెట్‌కు డబ్బు యాడ్‌ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాటిల్లో వినియోగించిన మొత్తాన్ని తిరిగి 15 రోజుల్లో చెల్లించాలి. ట్రాన్సాక్షన్‌ ఫైనాన్షలో పెద్ద మొత్తంలో నగదు వినియోగించుకొనే సదుపాయం ఉంది. ఈఎమ్‌ఐ రూపంలో తిరిగి చెల్లించాలి. లేజీ పే బిసినెస్‌ హెడ్‌ అనూప్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ‘ఇండియాలో బయ్‌ నౌ పే లేటర్‌ సేవలు అభివృద్ధి చెందుతున్నాయి. అవసరం, అవకాశాలను ఈ రంగం కల్పిస్తోంది. డిఫెరెడ్‌ పేమెంట్‌ అనేది వేగంగా చెల్లింపులు జరిపే సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తుంది.

Free LPG Cylinder: బంపర్ ఆఫర్.. అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు: ఇలా చేస్తేనే!!


ఎలాంటి ప్రక్రియ లేకుండా సులువుగా జరిగే పేమెంట్స్‌ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 15 రోజుల్లోగా తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మరో వైపు అవసరాలకోసం ఉండేవారికి కూడా ఈ రంగం ఉపయోగపడుతోంది. పెద్ద మొత్తంలో నగదు వెచ్చించి వస్తువులు కొనలేని వారు దీని ద్వారా కొనవచ్చు. ఈఎమ్‌ఐల రూపంలో చెల్లించవచ్చు. చాలా తక్కువ మొత్తం వడ్డీతో 3 నుంచి 12 నెలల మధ్య తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుందని’ వివరించారు. డీఫాల్ట్‌ పే ఆప్షన్‌ ద్వారా సకాలంలో నగదు చెల్లింపు జరుగకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, వడ్డీ తప్పక చెల్లించాల్సిందేనా అనే అంశంలో స్పష్టత లేదు. ఒక్కో కంపెనీ ఒక్కో తరహాలో స్పందించవచ్చు. నిర్దిష్ట పాలసీ అంటూ ఏదీ లేదు.
బీఎన్‌పీఎల్‌ సేవల్లో విధించే ఛార్జెస్‌ ఇవే..

ప్రాసెసింగ్‌ కాస్ట్‌(Processing Cost): డిజిటల్‌ బీఎన్‌పీఎల్‌ సేవలు అందించే సంస్థలు సాధారణంగా రూ.0- 99 వరకు లోన్‌పై ఛార్జ్‌ చేస్తారు.

లేట్‌ పేమెంట్‌ ఛార్జెస్‌(Late Payment Charges): వినియోగించిన మొత్తాన్ని గడువులోగా చెల్లించకపోతే తిరిగి చెల్లించే వరకు లేట్‌ పేమెంట్‌ ఛార్జెస్‌ కట్టాలి.

ఇంట్రస్ట్‌ రేట్స్‌(Interest Rates): లేట్‌ పేమెంట్‌పై ఒక్కో కంపెనీ ఒక్కోలా ఇంట్రస్టులు విధిస్తున్నాయి. కొన్ని లేట్‌ పేమెంట్‌ ఛార్జస్‌ మాత్రమే విధిస్తుండగా.. కొన్ని సంస్థలు అదనంగా 2- 3 శాతం వడ్డీ కూడా వసూలు చేస్తున్నాయి.

ఇతర ఛార్జెస్‌(Other Charges): బీఎన్‌పీఎల్‌ సంస్థలు లోన్‌ రీపేమెంట్‌ తేదీకి ముందే నగదు తిరిగి చెల్లించేస్తే కూడా ఛార్జెస్‌ విధిస్తున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Bank, Bank charges, Banks, Business, Buy now, Pay later

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు