హోమ్ /వార్తలు /బిజినెస్ /

Loan EMI: లోన్ ఈఎంఐ వరుసగా 3 నెలలు కట్టకపోతే ఏమౌతుంది? బ్యాంకులు ఏం చేస్తాయంటే?

Loan EMI: లోన్ ఈఎంఐ వరుసగా 3 నెలలు కట్టకపోతే ఏమౌతుంది? బ్యాంకులు ఏం చేస్తాయంటే?

 లోన్ ఈఎంఐ వరుసగా 3 నెలలు కట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

లోన్ ఈఎంఐ వరుసగా 3 నెలలు కట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

EMI | లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెలా ఈఎంఐ కట్టాలి. ఒకవేళ ఈఎంఐ కట్టకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరుసగా మూడు నెలలు ఈఎంఐ కట్టకపోతే ఏమౌతుందో, బ్యాంకులు ఏం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Home Loan | ఎప్పుడు ఎలాంటి అవసరం పడుతుందో తెలీదు. కొన్నిసార్లు అనుకోకుండా పెద్ద ఆపద రావొచ్చు. లేదంటే ఆర్థికంగా చాలా అవసరం పడొచ్చు. చేతిలో డబ్బులు (Money) ఉంటే సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఒకవేళ లేకపోతే? అప్పుడు చాలా మంది అప్పు తీసుకుంటూ ఉంటారు. లేదంటే బ్యాంక్ (Bank) నుంచి లోన్ (Loan) తీసుకుంటారు. లేదంటే కొంత మంది కార్ లోన్, హోమ్ లోన్ వంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. అవసరం ఏదైనాసరే ఇలా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే.. తర్వాత ప్రతి నెలా ఈఎంఐ కడుతూ వెళ్లాలి.

  ఒకవేళ ఈఎంఐ కట్టకపోతే? ఒక నెలా అంటే పర్లేదు. వరుసగా రెండు నెలలు, 3 నెలలు లోన్ ఈఎంఐ చెల్లించలేకపోతే? ఏమౌతుంది? బ్యాంకులు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాయి? ఏం చేస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హోమ్ లోన్ తీసుకున్న వారు తొలి నెలా ఈఎంఐ కట్టలేకపోతే.. అప్పుడు బ్యాంకులు వారికి ఎస్ఎంఎస్ రూపంలో రిమైండర్ పంపుతాయి. లేదంటే ఈమెయిల్ పంపొచ్చు. అలాగే ఈ మెయిల్‌లో లోన్ ఈఎంఐ చెల్లించేందుకు పేమెంట్ లింక్ కూడా ఉంటుంది. లోన్ ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు ఔట్‌స్టాండింగ్ లోన్ అమౌంట్‌పై 1 నుంచి 2 శాతం పెనాల్టీ విధిస్తాయి.

  రైతుల కోసం స్పెషల్ లోన్ స్కీమ్.. వెంటనే రూ.50 వేలు పొందొచ్చు!

  రెండో నెల కూడా ఈఎంఐ కట్టలేని పరిస్థితి వస్తే? అప్పుడు బ్యాంక్ నుంచి వార్నింగ్ వస్తుంది. లోన్ ఈఎంఐ అమౌంట్‌, పెనాల్టీ చార్జీలను వెంటనే చెల్లించాలంటూ బ్యాంకులు రుణ గ్రహీతలకు మెసేజ్‌లు లేదా మెయిల్స్ పంపుతాయి. ఒక నెల ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు సాధారణంగానే చూస్తాయి. అయితే రెండో నెల ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు అలర్ట్ అవుతాయి. రెండు ఈఎంఐ డబ్బులను వెంటనే చెల్లించాలని కోరతాయి.

  బ్యాంక్ చౌక బేరం.. తక్కువ ధరకే ఇల్లు, ప్రాపర్టీ కొనేయండి!

  ఇక మూడో నెల కూడా ఈఎంఐ కట్టకపోతే మాత్రం.. అప్పుడు బ్యాంకలు మీ లోన్ అకౌంట్‌ను మైనర్ డిఫాల్ట్ కింద పరిగణిస్తాయి. అంటే మొండి బకాయిగా చూస్తాయి. మీ లోన్‌ను ఎన్‌పీఏగా మార్చడానికి ముందు బ్యాంక్ మీకు నోటీసులు పంపుతుంది. మీకు రిమైండర్లు వస్తూనే ఉంటాయి. మూడు నెలలు లేదంటే 90 రోజులు ఈఎంఐ కట్టకపోతే అప్పుడు బ్యాంకులు మీ ప్రాపర్టీని వేలం వేయడానికి రెడీ అవుతాయి. అలాగే బ్యాంకులు లోన్ రికవరీ కోసం థర్డ్ పార్టీని కూడా నియమించుకోవచ్చు. అంతేకాకుండా ఒకే బ్యాంక్‌లో రెండు మూడు రుణాలు కలిగి ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు సక్రమంగా చెల్లించే రుణాలను కూడా ఎన్‌పీఏలుగా పరిగణిస్తారు. దీని వల్ల క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. లోన్ ఈఎంఐ కట్టలేకపోతే.. అప్పుడు బ్యాంక్ అధికారులతో మాట్లాడండి. లోన్ సెటిల్‌మెంట్ చేసుకోండి. మారటోరియం,గ్రేస్ పీరియడ్ వంటి ఆప్షన్లను ఉపయోగించుకోండి. లోన్ రిస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Banks, Cibil score, Credit score, EMI, Home loan

  ఉత్తమ కథలు