భారతీయులకు ప్రతీ విషయంలో అవసరమవుతున్న గుర్తింపు కార్డు.. ఆధార్. దేశ ప్రజలకు ఇది ఒక ప్రాథమిక గుర్తింపు కార్డుగా మారింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం నుంచి కోవిడ్ టీకాలు తీసుకోవడం వరకు.. ప్రతి అవసరానికి ఆధార్ తప్పకుండా ఉండాల్సిందే. పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి ముందే, వారికి ఆధార్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎవరైనా చనిపోతే.. వారి ఆధార్ కార్డు పరిస్థితి ఏంటి? అది చెల్లుబాటు అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు ఇచ్చింది. వ్యక్తులు చనిపోతే.. వారి ఆధార్ కార్డులు డీయాక్టివేట్ కావని ప్రభుత్వం వెల్లడించింది.
Aadhaar Card Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... ఈ రెండు సేవలు లభించవు
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉందా? ఇలా మార్చేయండి
ఆధార్ కార్డు హోల్డర్ చనిపోయిన తరువాత, దాని పరిస్థితి ఏంటని పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్‌ను గుర్తించి, వాటిని రద్దు చేసే ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు. కానీ దీన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. చనిపోయిన వారి పేరుతో డెత్ సర్టిఫికెట్ జారీ చేసేటప్పుడు మరణించిన వ్యక్తి ఆధార్ నెంబర్ తీసుకోవటానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి జనన మరణాల నమోదు చట్టం-1969కి సవరణలపై UIDAI సూచనలు కోరినట్లు కేంద్ర మంత్రి లోక్‌సభలో వెల్లడించారు.
Aadhaar Number: ఆధార్ నెంబర్ సరైనదేనా? వెరిఫై చేయండి ఇలా
Aadhaar Verification: ఆధార్ వెరిఫికేషన్ చేయాలా? ఈ కొత్త సర్వీస్ వాడుకోండి
ప్రస్తుతం జనన, మరణాలకు సంబంధించిన డేటాను సంబంధిత రిజిస్ట్రార్‌లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రార్ల నుంచి మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్‌ను స్వీకరించే విధానం లేదు. కానీ డీయాక్టివేషన్ ప్రక్రియను ప్రారంభించిన తరువాత.. మరణించిన వ్యక్తుల ఆధార్ వివరాలను రిజిస్ట్రార్‌లు UIDAIకు అందిస్తారు. అనంతరం చనిపోయిన వారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేస్తారు. చనిపోయిన వారి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం లేదా డెత్ సర్టిఫికెట్‌లతో లింక్ చేయడం వల్ల.. సంబంధిత ఆధార్ నంబర్లు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడవచ్చు.
ఆధార్ అనేది 12 అంకెల గుర్తింపు సంఖ్య అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నెంబర్‌కు సంబంధిత వ్యక్తుల బయోమెట్రిక్ డేటాను లింక్ చేస్తారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి UIDAI మొత్తం 128.99 కోట్ల ఆధార్ నంబర్లను జారీ చేసింది. ఆధార్ అప్‌డేట్ల కోసం యూఐడీఏఐ ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ప్రవేశపెడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, Aadhaar card, AADHAR, Lok sabha, Parliament, UIDAI