హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్‌ తీసుకొనే సమయంలో మీ వ్యాధుల గురించి వెల్లడించలేదా? ఎదురయ్యే సమస్యలు ఇవే..

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్‌ తీసుకొనే సమయంలో మీ వ్యాధుల గురించి వెల్లడించలేదా? ఎదురయ్యే సమస్యలు ఇవే..

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్‌ తీసుకొనే సమయంలో మీ వ్యాధుల గురించి వెల్లడించలేదా? ఎదురయ్యే సమస్యలు ఇవే..

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్‌ తీసుకొనే సమయంలో మీ వ్యాధుల గురించి వెల్లడించలేదా? ఎదురయ్యే సమస్యలు ఇవే..

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు సమయంలో ముందుగా ఉన్న వ్యాధుల గురించి ఉద్దేశపూర్వకంగా లేదా ఇతర కారణాలతో తెలియజేయకపోతే.. క్లెయిమ్ విషయంలో ఇబ్బందులు ఎదువర్వొచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కరోనా (Covid-19) అనంతరం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (Health Insurance) డిమాండ్‌ పెరిగింది. భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు హెల్త్‌ ఇన్సూరెన్స్ పాలసీలు అవసరం. అయితే పాలసీ (Policy)తీసుకొనే సమయంలోనే ఏవైనా వ్యాధులు ఉంటే సంబంధిత ఇన్సూరెన్స్‌ కంపెనీ (Insurance Company) కి తెలియజేయాలి. డయాబెటిస్ లేదా హైపర్‌టెన్షన్ వంటి ముందస్తు జబ్బులు ఉంటే.. ముందుగానే సంస్థ దృష్టికి తీసుకెళ్లి.. అధిక ప్రీమియంతో, ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వెయిటింగ్‌ పీరియడ్‌తో కవరేజీ పొందవచ్చు. కానీ పాలసీ కొనుగోలు సమయంలో ముందుగా ఉన్న వ్యాధుల గురించి ఉద్దేశపూర్వకంగా లేదా ఇతర కారణాలతో తెలియజేయకపోతే.. క్లెయిమ్ విషయంలో ఇబ్బందులు ఎదువర్వొచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసుకుందాం.

* క్లెయిమ్‌పై ప్రభావం

వ్యాధుల గురించి ముందుగా తెలియజేయకపోతే పరిస్థితులు సంక్లిష్టంగా మారతాయి. క్లెయిమ్‌ను దాఖలు చేసిన తర్వాత వ్యాధుల గురించి దాచిన విషయం తెలిస్తే ఇన్సూరెన్స్‌ కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. కొన్ని సందర్భాల్లో పాలసీని రద్దు చేయవచ్చు. పాలసీని కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే సమస్య ఉండదు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు డిఫాల్ట్‌గా, ఆసుపత్రిలో చేరడానికి దారితీసే అనారోగ్యాలను కవర్ చేస్తాయి. కానీ పాలసీ రెన్యువల్‌ సమయంలో కొత్తగా వచ్చిన వ్యాధులను బహిర్గతం చేయాలి.

* తీవ్రమైన అనారోగ్యాలతో జాగ్రత్త

మధుమేహం, మూర్ఛ లేదా మూత్రపిండ వ్యాధి కారణంగా డయాలసిస్ వంటి నిరంతర చికిత్స అవసరమయ్యే అనారోగ్యాలను దాస్తే.. బీమా సంస్థ కఠినంగా వ్యవహరిస్తుందని ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, క్లెయిమ్స్, రీఇన్స్యూరెన్స్ చీఫ్, సంజయ్ దత్తా మనీకంట్రోల్‌తో చెప్పారు.

గతంలో ఫ్రాక్చర్, కంటిశుక్లం లేదా అపెండిసైటిస్ సర్జరీ వంటివి ప్రభావం చూపవని, గత రెండేళ్ళలో కోవిడ్-19 బారిన పడడం కూడా ప్రస్తుతానికి పెద్ద అవరోధం కాదని చెప్పారు. నిరంతర చికిత్స, క్లిష్టమైన అనారోగ్యాలు లేదా జీవనశైలి పరిస్థితులు బహిర్గతం చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి : వారికి అదిరే గుడ్ న్యూస్.. వీరికి భారీ షాక్! అక్టోబర్ 1 నుంచి..

* ఫ్రీ-లుక్ టైమ్‌లో సరిదిద్దుకోవాలి

పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఇన్సూరెన్స్‌ కంపెనీ వద్ద వివరాలు దాచి ఉంచితే.. 15-రోజుల ఫ్రీ-లుక్ టైమ్ (పాలసీని రిటర్న్ చేయగల సమయం) ఇంకా ముగియకపోతే, వీలైనంత త్వరగా లోపాన్ని సరిదిద్దుకోవచ్చు. ఫ్రీ-లుక్ వ్యవధిలోపు పాలసీదారు ముందుగా ఉన్న అనారోగ్యాన్ని ప్రకటిస్తే, వర్తించే పూచీకత్తు మార్గదర్శకాల ప్రకారం పాలసీని అండర్‌రైట్ చేసే అవకాశం ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఉంటుందని టాటా-AIG జనరల్ ఇన్సూరెన్స్‌ ప్రెసిడెంట్, హెడ్ పరాగ్ వేద్ మనీకంట్రోల్‌తో చెప్పారు.

పొరపాటును సరిదిద్దుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో పాలసీ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. కనీసం ఎనిమిది సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రీమియంలు చెల్లిస్తే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మారటోరియం నియమాలు అమలులోకి వస్తాయి. దీంతో పాలసీని రద్దు చేయడం సాధ్యం కాదు. అయితే సంబంధిత ఇన్సూరెన్స్‌ సంస్థకు ఇలాంటి విషయాలు తెలియజేయడానికి ముందు.. బ్యాకప్ అవకాశాలను పరిశీలించాలి. రెన్యూవల్‌ చేయగలరో లేదో చూడాలి. లేదా మరో సంస్థకు పోర్ట్‌ అవుతున్నప్పుడు అనారోగ్యాలను ప్రకటించడానికి ప్రయత్నించాలి. కొత్త ఇన్సూరెన్స్‌ కంపెనీ కవర్‌ను పొడిగించడానికి సిద్ధంగా ఉందో లేదో చూడాలి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health Insurance, Personal Finance

ఉత్తమ కథలు