Capital Gains Tax: స్టాక్ మార్కెట్లో ఈక్విటీలపై, ఇతర ఆస్తుల పెట్టుబడులపై విధించే ట్యాక్స్‌లు గందరగోళంగా ఉన్నాయని పలు సందర్భాల్లో ప్రభుత్వం పేర్కొంది. వీటిని సింప్లిఫై చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అయితే లాంగ్ టర్మ్ ఈక్విటీల(Long term equity)పై పన్ను పెరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రూల్స్(Capital gains tax rules)లోని కొన్ని నిబంధనలను మార్చాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రూల్స్‌పై జరుగుతున్న ప్రచారం నిజమైతే వచ్చే బడ్జెట్లో మార్పులను చూడవచ్చు. రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ మాట్లాడుతూ.. వేర్వేరు ఆస్తులకు వేర్వేరు కాలపరిమితి, పన్ను రేట్లు ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు.
కాంప్లికేటెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్లు ఆస్తి రకం, హోల్డింగ్ వ్యవధిపై ఆధారపడి ఉంటాయి. హోల్డింగ్ వ్యవధి ఆధారంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(LTCG) లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(STCG) ట్యాక్స్ విధిస్తారు. ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం పాటు ఉన్న ఈక్విటీలపై వచ్చే లాభాలను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. 15 శాతం ట్యాక్స్ విధిస్తారు. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం హోల్డ్ చేసే ఈక్విటీ షేర్లపై వచ్చే లాభాలను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు, వీటిపై 10 శాతం ట్యాక్స్ విధిస్తారు. ఏదైనా ఇతర డెట్, గోల్డ్, ప్రాపర్టీలను మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పరిధిలోకి వస్తుంది.
షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 15 శాతం ట్యాక్స్
ఈక్విటీల నుంచి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 15 శాతం ట్యాక్స్ ఉండగా.. డెట్, గోల్డ్, లేదా ఏదైనా ఇతర ప్రాపర్టీలపై ఇన్కమ్ స్లాబ్ రేట్ల ఆధారంగా పన్ను విధిస్తారు. ఈక్విటీ కాని ఆస్తుల నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై ఇండెక్సేషన్ తర్వాత 20 శాతం ట్యాక్స్ విధిస్తారు. ఇండెక్సేషన్ అనేది క్యాపిటల్ గెయిన్స్ వద్దకు వచ్చే ముందు ద్రవ్యోల్బణం కోసం ధరను సర్దుబాటు చేయడం. మీడియా నివేదికల ఆధారంగా.. క్యాపిటల్ గెయిన్స్ స్వభావాన్ని షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్‌గా నిర్ణయించడానికి హోల్డింగ్ పీరియడ్లలో ఏకరూపతను తీసుకురావడం ద్వారా ట్యాక్స్ స్ట్రక్చర్‌ను సింప్లిఫై చేయాలని ప్రభుత్వం చూస్తోంది. క్యాపిటల్ గెయిన్స్‌ను లాంగ్ టర్మ్‌గా పరిగణించాలంటే ఈక్విటీల హోల్డింగ్ వ్యవధిని మూడు సంవత్సరాలకు పెంచే యోచనలో ఉంది. దీంతో 10 శాతం ట్యాక్స్ చెల్లించడానికి ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎక్కువ కాలం పాటు ఉంచాల్సి రావచ్చు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌లో ఈక్విటీలపై 15 శాతం ట్యాక్స్‌ను తొలగించి, ఇతర అసెట్స్‌తో సమానంగా తీసుకురావచ్చు.
సింప్లిపికేషన్ అవసరం
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) తన బడ్జెట్ ప్రపోజల్లో.. డెట్-బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ (లిస్టెడ్ లేదా అన్‌లిస్టెడ్) యూనిట్లను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణించేందుకు కనీస హోల్డింగ్ వ్యవధి 36 నెలలుగా సూచించింది. అయితే భారతదేశంలో గుర్తింపు పొందిన ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయిన బాండ్లు/డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, డెరివేటివ్‌లు మొదలైన లిస్టెడ్ సెక్యూరిటీలలో ప్రత్యక్ష పెట్టుబడులు, జీరో-కూపన్ బాండ్లను (లిస్టెడ్ లేదా అన్‌లిస్టెడ్) లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణించేందుకు హోల్డింగ్ వ్యవధి కేవలం 12 నెలలు.
ట్యాక్స్ పెంచే అవకాశం లేదు
లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలు, జీరో-కూపన్ బాండ్లలో (లిస్టెడ్ లేదా అన్‌లిస్టెడ్) డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ హోల్డింగ్ పీరియడ్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి కోసం హోల్డింగ్ పీరియడ్ ఏకరీతిగా ఉండాలని పేర్కొంది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల యులిప్‌లలో పెట్టుబడుల ఉపసంహరణ, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఎగ్జిట్‌పై కూడా క్యాపిటల్ గెయిన్స్‌కి సంబంధించి AMFI ట్యాక్స్‌లో సమానత్వాన్ని కోరింది. ఈక్విటీల నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై అధిక పన్ను విధించాల్సిన అవసరాన్ని రెవెన్యూ కార్యదర్శి గతంలో నొక్కిచెప్పినప్పటికీ, దేశంలో ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం రేటును పెంచే అవకాశం లేదు. అయితే పెట్టుబడిదారులు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రూల్‌లో కొన్ని మార్పులకు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
N.A షా అసోసియేట్స్, డైరెక్ట్ ట్యాక్స్, భాగస్వామి గోపాల్ బోహ్రా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒక నిర్దిష్ట అసెట్‌ను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్గా పరిగణించాలంటే వేర్వేరు హోల్డింగ్ పీరియడ్లు ఉన్నాయని చెప్పారు. ఇది పన్ను చెల్లింపుదారులకు చాలా గందరగోళాన్ని సృష్టిస్తుందని, వివిధ పన్ను రేట్లు, హోల్డింగ్ పీరియడ్ల మధ్య సమానత్వాన్ని తీసుకురావడం ద్వారా సింప్లిఫై చేయడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget