బ్యాంకులు (Banks) లేదా నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీ(NBFC)లు లేదా మైక్రో ఫైనాన్షియర్స్ వద్ద మనం లోన్స్ (Loans) తీసుకుంటాం. ఒక వ్యక్తికి లోన్ మంజూరు చేయాలంటే ముందుగా అతని క్రెడిట్ స్కోర్ (Credit score)ను విశ్లేషిస్తారు. లోన్‌ను అతను తిరిగి చెల్లిస్తాడని నిర్ధారించుకున్నాకే రుణాలను (Loans) మంజూరు చేస్తారు. రుణాన్ని తాజాగా పొడిగించడం, ఇప్పటికే ఉన్న రుణ బాధ్యతలను బదిలీ చేయడం, పాలసీ ప్రీమియం చెల్లించడం వంటి విషయాల్లోక్రెడిట్ నివేదికలు (Credit data) కీలక పాత్ర పోషిస్తాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే.. కొత్తగా రుణం పొందడానికి అవకాశాలు సన్నగిల్లుతాయి. లేకపోతే రుణ అప్లికేషన్‌ను షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, NBFCలు పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది. తక్కువ క్రెడిట్ స్కోర్ (Low credit score) కారణంగా ఎదురయ్యే అవాంతరాలను పరిశీలిద్దాం.
రుణాలపై అధిక వడ్డీ రేటు
మంచి క్రెడిట్ స్కోర్ కస్టమర్‌తో పోలిస్తే తక్కువ క్రెడిట్ స్కోర్ (Low credit score) ఉన్న కస్టమర్‌ను సబ్‌ప్రైమ్ రుణగ్రహీతగా పరిగణిస్తారు. దీంతో వీరికి ఇచ్చే రుణాలు, అడ్వాన్సులపై అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. అధిక వడ్డీ రేటు.. రుణదాతల నుంచి తీసుకున్న అప్పుు, దానిపై పెరిగిన వడ్డీ మొత్తానికి వర్తిస్తుంది. ఫలితంగా వీరు ఎక్కువ క్రెడిట్ స్కోర్ సాధించిన కస్టమర్‌తో పోల్చితే ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఇన్సూరెన్స్‌పై అధిక ప్రీమియం
ఇన్సూరెన్స్ (Insurance) సంస్థలు ముందుగా నిర్ణయించిన దానికంటే తక్కువ క్రెడిట్ స్కోర్ (Bad credit score) కలిగి ఉంటే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ ప్రీమియాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. తక్కువ క్రెడిట్ స్కోర్ కస్టమర్‌లు పాలసీ మెచ్యూరిటీ వ్యవధి పూర్తయ్యేలోపు మరిన్ని క్లెయిమ్‌లను ఫైల్ చేసే అవకాశం ఉంది. తక్కువ క్రెడిట్ స్కోర్ (Low credit score) అంతిమంగా సబ్‌ప్రైమ్ రుణగ్రహీతల ఆర్థిక వైఖరిని ప్రతిబింభిస్తాయి. వీరు బహుళ రుణ బాధ్యతల చెల్లింపులను వాయిదా వేయడం లేదా చెల్లించలేమని చేతులెత్తేసి ఉంటారు. లేకపోతే వారి ఆదాయానికి మించి అప్పులు చేసి ఉంటారు.
హోమ్ లోన్స్ కోసం నిరీక్షణ
తక్కువ క్రెడిట్ స్కోర్ (Low credit score) కారణంగా హోమ్ లోన్ (Home loan) వంటి పెద్దమొత్తంలో రుణ సదుపాయాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో వీరు పడే ఇబ్బందులను దృష్టిలోపెట్టుకుని అధిక రుణ మొత్తాన్ని పొడిగించడానికి రుణదాతలు ఇష్టపడరు.
తరచూ విచారణలు, బ్యాక్ గ్రౌండ్ విశ్లేషణ
తక్కువ క్రెడిట్ స్కోర్ (Low credit score) కారణంగా రుణ గ్రహిత క్రెడిట్ యోగ్యతను నిర్ధారించుకోవడానికి వారి ఆర్థిక స్థితిని, బ్యాక్ గ్రౌండ్‌పై విచారణ చేపడతారు. మీరు ఆటో రుణం, గృహ రుణం, బంగారంపై రుణం లేదా సెక్యూరిటీలపై రుణంతో సహా అత్యంత సురక్షితమైన క్రెడిట్ సౌకర్యాల కోసం దరఖాస్తు చేసినప్పటికీ మీరు తనఖా పెట్టే డాక్యుమెంట్లు లేదా ఆస్తుల వివరాలను బ్యాంకులు కచ్చితంగా క్రాస్ చెక్ చేస్తాయి.
కష్టతరంగా వ్యక్తిగత, వ్యాపార రుణాల లభ్యత
వ్యక్తిగత రుణాలు (Personal loans), నాన్-కొల్లేటరలైజ్డ్ బిజినెస్ లోన్‌లు సురక్షితంకాని క్రెడిట్ లైన్‌లుగా కొనసాగుతున్నందున.. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి రుణాల సేకరణలో సవాళ్లను ఎదుర్కొంటాడు. బ్యాంకులు, మైక్రో ఫైనాన్షియర్లు, ప్రత్యేక క్రెడిట్ సంస్థలు, డిజిటల్ రుణదాతలు కొంత పరిమితి వరకు సబ్‌ప్రైమ్ రుణగ్రహీతలను ఆన్‌బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రుణగ్రహీత క్రెడిట్ ప్రవర్తనలో మెరుగుదల చూపకపోతే వారి దరఖాస్తులను పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.