news18-telugu
Updated: November 18, 2020, 2:38 PM IST
ప్రతీకాత్మకచిత్రం
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) భారతదేశంలో అత్యంత ఇష్టపడే పొదుపు సాధనాల్లో ఒకటి. బ్యాంక్ ఎఫ్డీలు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఎంచుకోవడానికి అనేక రకాల కాలపరిమితులను అందిస్తున్నాయి. FD డిపాజిట్లను విస్తృతంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు - అకాల ఉపసంహరణతో ఎఫ్డీలు, అకాల ఉపసంహరణ లేకుండా ఎఫ్‌డిలు. ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే, డిపాజిటర్లు తమ FD డిపాజిట్ల నుంచి ముందస్తు ఉపసంహరణను ఎంచుకోవచ్చు. ఇలా చేస్తే కొంత మొత్తాన్ని డిపాజిటర్ బ్యాంకుకు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
ఫిక్స్ డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) కోసం SBI ముందస్తు ఉపసంహరణ నియమాల గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇలా ఉన్నాయి. SBI ఎఫ్‌డిల నుంచి రూ. 5 లక్షల వరకు ముందస్తు ఉపసంహరణకు, అన్ని మెచ్యూరిటీలలో 0.50 శాతం జరిమానా చెల్లించాలి. SBI ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి రూ. 5 లక్షలకు పైన, కానీ రూ.కోటి కంటే తక్కువకు ఉపసంహరించుకోవటానికి, బ్యాంక్ 1 శాతం చొప్పున జరిమానాను నిర్ణయించింది. రోజుల కన్నా తక్కువ వ్యవధిలో ఉన్న డిపాజిట్లపై వడ్డీ చెల్లించదు
SBI తాజా ఎఫ్డీ వడ్డీ రేట్లు
7 రోజుల నుంచి 45 రోజుల వరకు - 2.9 శాతం
46 రోజుల నుంచి 179 రోజుల వరకు - 3.9 శాతం
180 రోజుల నుంచి 210 రోజుల వరకు - 4.4 శాతం
211 రోజుల నుంచి 1 సంవత్సరం కన్నా తక్కువ - 4.4 శాతం1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కన్నా తక్కువ - 4.9 శాతం
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కన్నా తక్కువ - 5.1 శాతం
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కన్నా తక్కువ - 5.3 శాతం
5 నుంచి 10 సంవత్సరాల వరకు - 5.4 శాతం.
Published by:
Krishna Adithya
First published:
November 18, 2020, 2:38 PM IST