Home /News /business /

WHAT ARE THE BENEFITS OF HEALTH INSURANCE WHY BUY A HEALTH PLAN IN 20 YEARS GH VB

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్‌తో లాభాలేంటి..? 20 ఏళ్లలోనే హెల్త్ ప్లాన్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి..?

ప్రతాకాత్మక చిత్రం

ప్రతాకాత్మక చిత్రం

ఇప్పటి యువత తమ ఆర్థిక విషయాలను నిర్వహించుకోవడంలో చురుగ్గా ఉంటున్నారు. అందుకే, 20 నుంచి 30 ఏళ్లలోపే ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు.

కరోనా(Corona) తర్వాత ఆరోగ్య బీమాకు (Health Insurance) ప్రాధాన్యత పెరిగింది. లక్షల కొద్దీ మెడికల్ బిల్లులను (Medical Bills) చెల్లించలేక అనేక మంది హెల్త్ ప్లాన్లు (Health Plans) తీసుకుంటున్నారు. ఆరోగ్య బీమా కేవలం పెద్ద వారికి, వృద్ధులకు మాత్రమే అని గతంలో ఎక్కువ మంది యువకులు (Youth) భావించేవారు. అయితే కరోనా తర్వాత క్రమంగా యువకుల మైండ్​సెట్​లో మార్పు వచ్చింది. ఎవరికైనా, ఏ సమయంలోనైనా జీవితం, ఆరోగ్యం అనిశ్చితిలో పడవచ్చని తెలుసుకున్నారు. ఇప్పటి యువత తమ ఆర్థిక విషయాలను నిర్వహించుకోవడంలో చురుగ్గా ఉంటున్నారు. అందుకే, 20 నుంచి 30 ఏళ్లలోపే ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అయితే చిన్న వయసులోనే ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా అనేక లాభాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం.

Realme GT Neo 2: త్వరలోనే రియల్​మీ జీటీ నియో 2 డ్రాగన్ బాల్ జెడ్​ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే.. .


చిన్న వయసులో ఆరోగ్య బీమా తీసుకుంటే కలిగే లాభాలు..
తక్కువ ప్రీమియం..
ఏ ఆరోగ్య బీమా అయినా చిన్న వయసులోనే కొనుగోలు చేస్తే ప్రీమియం ఛార్జీలు తక్కువగానే ఉంటాయి. మీకు 30 ఏళ్లు దాటితే ప్రీమియాలు పెరుగుతాయి. 20 ఏళ్ల వయసులో ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తే.. అదే బీమా కొనుగోలు చేయడానికి సరైన సమయం. ఎటువంటి క్రిటికల్​ సమస్యలూ లేనప్పుడు మరింత తక్కువ ప్రీమియంకే బీమా వస్తుంది. 20 ఏళ్లలోపు వ్యక్తులు రూ. 5 లక్షల కవర్ మొత్తానికి సంవత్సరానికి సగటున రూ. 8,000 ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్లలోపు వ్యక్తులు అదే కవర్ మొత్తానికి సగటున రూ. 12,000 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీ వయసు పెరిగే కొద్ది జీవనశైలి వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల ప్రీమియం ఎక్కువ అవుతుంది.

తక్కువ ఆరోగ్య సమస్యలు..
గుండె జబ్బులు, మూత్రపిండ వైఫల్యం, మధుమేహం, క్యాన్సర్ మరెన్నో అనారోగ్యాలకు క్లిష్టమైన వ్యాధులకు ఆరోగ్య బీమా పథకం కవరేజీ అందిస్తుంది. అయితే, మీకు ఈ వ్యాధులు సంక్రమించిన తర్వాత, మీ ప్రీమియం బాగా పెరుగుతుంది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే, బీమా కంపెనీ ఈ వ్యాధులలో దేనికైనా కవరేజీని అందించకుండా శాశ్వత మినహాయింపును కూడా ఇవ్వవచ్చు. అందుకే మీరు 20 ఏళ్ల వయసులో ఆరోగ్య బీమాను కొనుగోలు చేసినట్లయితే, సురక్షితంగా ఉంటారు.

Sexual Desires: ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు.. యువకులతో సెక్స్ చేయడానికి కారణం ఏంటి..?


మీ పొదుపును రక్షిస్తుంది..
మీరు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే రూ. 5 లక్షల కవరేజీతో ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మీ ఆసుపత్రి బిల్లుల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. రూ. 5 లక్షల ఆరోగ్య బీమా అనేది మీ సేవింగ్స్ ఖాతాలో రూ. 5 లక్షల అత్యవసర నిధిలా పనిచేస్తుంది. దీన్ని మీరు వైద్య ప్రయోజనాల కోసం ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. తద్వారా, మీ పొదుపు నుంచి వెచ్చించాల్సిన అవసరం ఉండదు.

వెయిటింగ్ పీరియడ్‌..
ఏ ఆరోగ్య బీమా కంపెనీకైనా తమ పథకాలకు కొన్ని వేచి చూసే సమయాలు ఉంటాయి. వేర్వేరు ముందస్తు రోగాలకు వేర్వేరు వేచి చూసే సమయాలుంటాయి. ఇవి ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఒక్కోసారి నాలుగేళ్ల వరకూ ఉంటాయి. అత్యవసరంగా బీమా కావాలి అని అడిగినా.. వేచి చూసే సమయాన్ని తగ్గించలేరు. కాబట్టి జీవితంలో ఎంత ముందుగా బీమా తీసుకుంటే అత్యవసరంలో అంత మంచిది.
Published by:Veera Babu
First published:

Tags: Health benefits, Health Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు