హోమ్ /వార్తలు /బిజినెస్ /

Auto Sweep-In: సేవింగ్స్ అకౌంట్‌పై FD వడ్డీ అందుకునే అవకాశం.. ఆటో స్వీప్-ఇన్ ఆప్షన్‌ ప్రత్యేకతలివే..

Auto Sweep-In: సేవింగ్స్ అకౌంట్‌పై FD వడ్డీ అందుకునే అవకాశం.. ఆటో స్వీప్-ఇన్ ఆప్షన్‌ ప్రత్యేకతలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Auto Sweep-In: కస్టమర్లకు తమ డబ్బుపై అధిక రాబడిని పొందే అవకాశాలను బ్యాంకులు కల్పిస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ఆటో స్వీప్‌ ఇన్‌ ఆప్షన్‌ను కొన్ని బ్యాంకులు పరిచయం చేశాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కస్టమర్లకు తమ డబ్బుపై అధిక రాబడిని పొందే అవకాశాలను బ్యాంకులు కల్పిస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌ (Investment) స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ఆటో స్వీప్‌ ఇన్‌ (Auto Sweep-In) ఆప్షన్‌ను కొన్ని బ్యాంకులు పరిచయం చేశాయి. దీనిద్వారా సేవింగ్స్‌ అకౌంట్‌ లేదా కరెంట్‌ అకౌంట్‌లో డబ్బులు తక్కువగా ఉండటంతో.. ఏదైనా ట్రాన్సాక్షన్‌, పేమెంట్‌ చేయలేకపోతే.. బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి అవసరమైన నగదును సేవింగ్స్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాయి. దీనివల్ల ఎఫ్‌డీ వడ్డీ రేటుపై ఎలాంటి ప్రభావం ఉండదు.

ఆటో-స్వీప్ ఆప్షన్‌ అనేది సేవింగ్స్‌ అకౌంట్‌, ఎఫ్‌డీ అకౌంట్‌ కలయిక. ఇది వడ్డీ రూపంలో అధిక రాబడిని పొందడానికి సేవింగ్స్ అకౌంట్‌లో ఉన్న నిధులను కూడా ఉపయోగిస్తుంది. ఈ సదుపాయంలో FD విలువతో సంబంధం లేకుండా సేవింగ్స్‌ అకౌంట్‌ లేదా కరెంట్ అకౌంట్‌కు వర్తించే యావరేజ్‌ బ్యాలెన్స్‌ను మెయింటైన్‌ చేయాల్సి ఉంటుంది.

* ఆటో స్వీప్-ఇన్ ప్రయోజనాలు

ఆటో స్వీప్-ఇన్ ఆప్షన్‌ సేవింగ్స్‌, ఎఫ్‌డీ అకౌంట్‌ ప్రయోజనాలు అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌, సేవింగ్స్ అకౌంట్‌ లింక్‌ అవుతుంది, మానిటరీ లిమిట్‌ నిర్ణయిస్తుంది. FDకి ట్రాన్స్‌ఫర్‌ చేయడం వల్ల అమౌంట్‌ లిక్విడిటీని కోల్పోదు. సేవింగ్స్‌ అకౌంట్‌కు నిర్ణయించిన లిమిట్‌ను దాటి నగదు ఉన్నప్పుడు.. ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఈ విధంగా సేవింగ్స్ అకౌంట్‌ బ్యాలెన్స్‌కు అదనపు వడ్డీ లభిస్తుంది.

* HDFC స్పెషల్ అకౌంట్స్

బ్యాంకులు వివిధ ప్రొడక్టుల పేర్లతో స్వీప్-ఇన్ సౌకర్యాలను అందిస్తాయి. ఉదాహరణకు HDFC బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్‌ స్వీప్‌ ఇన్‌ ఫెసిలిటీని సేవింగ్స్‌మ్యాక్స్ అకౌంట్‌, ఉమెన్స్‌ సేవింగ్ అకౌంట్‌, కిడ్స్‌ అడ్వాంటేజ్‌ అకౌంట్‌ పేరిట అందిస్తోంది. సేవింగ్స్‌మ్యాక్స్ అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ.1,25,000 దాటితే, రూ.1,00,000 కంటే ఎక్కువ మొత్తం FDలోకి స్వీప్ అవుతుంది.

ఉమెన్స్‌ సేవింగ్స్‌ అకౌంట్‌: ఈ అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ.1,00,000 దాటితే, రూ. 75,000 కంటే ఎక్కువ మొత్తం FDలోకి స్వీప్ అవుతుంది. కిడ్స్‌ అడ్వాంటేజ్‌ అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ.35,000 దాటితే, రూ.25,000 కంటే ఎక్కువ మొత్తం FDలోకి స్వీప్ అవుతుంది.

* ఎస్‌బీఐ మల్టీ ఆప్షన్‌ డిపాజిట్‌ స్కీమ్‌

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ (MODS) ఉంది. MODS అనేది సేవింగ్స్‌ లేదా కరెంట్ అకౌంట్‌(వ్యక్తిగతం)కి లింక్ అయిన టర్మ్ డిపాజిట్స్‌. నార్మల్‌ టర్మ్ డిపాజిట్స్‌ మాదిరిగా కాకుండా నిధులు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. ఒక కస్టమర్ అవసరాన్ని బట్టి రూ.1000 మల్టిపుల్స్‌లో MODS అకౌంట్‌ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. MODS అకౌంట్‌లోని బ్యాలెన్స్ మొత్తానికి ఇనీషియల్‌ డిపాజిట్ సమయంలో వర్తించే టర్మ్ డిపాజిట్ రేట్లు వర్తిస్తాయి.

ఇది కూడా చదవండి : డిడక్షన్ లిమిట్ పెంపు, జీఎస్టీ తగ్గింపు.. కొత్త బడ్జెట్‌పై ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఆశలు, అంచనాలు..

MODS ఫీచర్లు

ఈ డిపాజిట్లు పూర్తిగా లిక్విడ్‌గా ఉంటాయి. రూ.1000 మల్టిపుల్స్‌లో చెక్/ATMలు/INB ద్వారా ఎన్ని సార్లు అయినా విత్‌డ్రా చేసుకోవచ్చు. 1 నుంచి 5 సంవత్సరాల వరకు డిపాజిట్ల కాలవ్యవధి ఉంటుంది. TDS వర్తిస్తుంది. నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. MODSలో ఆటో స్వీప్ సౌకర్యం కోసం, మినిమం థ్రెషోల్డ్ బ్యాలెన్స్, మినిమం రిజల్ట్ బ్యాలెన్స్ వరుసగా రూ.35,000, రూ. 25,000 ఉండాలి. థ్రెషోల్డ్ లిమిట్‌ ఎగువ పరిమితి ఆటో స్వీప్ సదుపాయాన్ని పొందడం కోసం మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. స్టాండలోన్‌ MODని థ్రెషోల్డ్ స్థాయితో సంబంధం లేకుండా కనీసం రూ.10,000తో e-MODతో సహా కస్టమర్‌లు ఓసెన్‌ చేసుకోవచ్చు.

* కోటక్‌లో సేవింగ్స్‌ మ్యాక్స్‌ అకౌంట్‌

కోటక్ మహీంద్రా బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రయోజనాల ప్రకారం.. స్వీప్-ఇన్ ఫెసిలిటీ కస్టమర్‌కు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ సౌలభ్యాన్ని, ఫిక్స్‌డ్-డిపాజిట్ అకౌంట్‌ లాభదాయక వడ్డీ రేటును అందిస్తుంది. FDలలో పెద్ద మొత్తాలను లాక్-ఇన్ చేయకూడదనుకునే ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. మిగులు డబ్బు ఏదైనా ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లో లాక్‌ ఇన్‌ కాకుండా, వాటిపై వడ్డీని పొందేందుకు ఆటో స్వీప్‌ ఇన్ ఉపయోగపడుతుంది.

First published:

Tags: FD rates, Interest rates, Personal Finance, Saving account, Sbi

ఉత్తమ కథలు