హోమ్ /వార్తలు /బిజినెస్ /

Diwali Holidays: గుడ్ న్యూస్.. వీరికి 10 రోజులు దీపావళి సెలవులు!

Diwali Holidays: గుడ్ న్యూస్.. వీరికి 10 రోజులు దీపావళి సెలవులు!

గుడ్ న్యూస్.. వీరికి 10 రోజులు దీపావళి సెలవులు!

గుడ్ న్యూస్.. వీరికి 10 రోజులు దీపావళి సెలవులు!

Employees | కంపెనీలు ఉద్యోగులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో కంపెనీలు వారి ఎంప్లాయీస్‌కు కొత్త కొత్త సెలవులు అందిస్తున్నాయి. తాజాగా ఒక కంపెనీ పది రోజుల దీపావళి హాలిడేస్ ఇచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Diwali 2022 | కంపెనీలు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఉద్యోగులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉద్యోగుల (Employees) ఒత్తిడి తగ్గించడానికి, వారి పునరుత్తేజం వంటి వాటి కోసం కొత్త విధానాన్ని అనుసరిస్తున్నాయి. సెలవులు (Holidays) అందిస్తున్నాయి. ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్ ఉయ్‌వర్క్ తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇండియన్ ఎంప్లాయీస్‌కు ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో అదిరే శుభవార్త అందించింది. ఎక్స్‌టెండెడ్ బ్రేక్ అందిస్తున్నట్లు ప్రకటించింది.

కంపెనీ ఉద్యోగులకు 10 రోజుల విరామం అందించింది. ఈ హాలిడే బ్రేక్‌లో ఉద్యోగులు పని నుంచి దూరంగా ఉండి, తమ ప్రియమైన వారితో కలిసి వేడుకలు చేసుకోవచ్చు. పది రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా, ఆఫీస్ పనులకు దూరంగా ఉండొచ్చు. తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు.. వచ్చేది ఎప్పుడంటే?

ఫ్లెక్సిబిలిటీ, వర్క్ లైఫ్ ఇంటీగ్రేషన్, పండుగ వేడుకల ఆనందాన్ని పంచుకోవడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉయ్‌వర్క్ పేర్కొంది. పండుగ సీజన్‌లో ప్రియమైన వారితో సంతోష సమయాన్ని గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. దీని ద్వారా ఉద్యోగులు వారి బిజీ రొటీన్‌కు జీవితానికి దూరంగా ఉండి తమను తాము పునరుద్ధరించుకునే అవకాశం లభిస్తుందని, ఈ లక్ష్యంగానే తాజా హాలిడే బ్రేక్ ప్రకటించామని కంపెనీ తెలిపింది.

బంగారం, వెండి కొనాలనుకునే వారికి అదిరే గుడ్ న్యూస్.. ఏకంగా రూ.1,400 పడిపోయిన ధరలు!

2021లో తొలిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని కంపెనీ తెలిపింది. అంటే కంపెనీ రెండో సారి తన ఉద్యోగులకు ఇలాంటి హాలిడే బ్రేక్ అందిస్తోందని చెప్పుకోవచ్చు. ఉయ్‌వర్క్ చీఫ్ పీపుల్ అండ్ కల్చర్ ఆఫీసర్ ప్రీతి శెట్టి మాట్లాడుతూ.. 2022లో తమ వ్యాపారం మరింత అభివృద్ధి చెందిందన్నారు. ఉద్యోగులు అన్ని అంతర్గత బెంచ్‌మార్క్‌లను అధిగమించారని తెలిపారు. బ్రాండ్‌గా తాము సాధించిన విజయానికి కంపెనీ సహ ఉద్యోగుల కృషే కారణమని చెప్పారు. 10 రోజుల విరామం అనేది ప్రతి ఉయ్‌వర్క్ ఉద్యోగి స్ఫూర్తికి కృతజ్ఞతా గుర్తుగా చెప్పుకోవచ్చన్నారు. తమను తాము రీసెట్ చేయడానికి, తిరిగి శక్తిని పొందేందుకు సమయాన్ని కేటాయించడం చాలా కీలకమని, అందుకే తాము 10 రోజుల దీపావళి సెలవులను వార్షికంగా సాంప్రదాయంగా మార్చాలని నిర్ణయించుకున్నామని వివరించారు.

కాగా కేవలం పది రోజుల దీపావళి సెలవులు మాత్రమే కాకుండా ఉయ్‌వర్క్ ఇండియా కంపెనీ తన ఉద్యోగులకు వెల్‌నెస్ లీవ్, ఎంప్లాయీస్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ (ప్రొఫెషనల్ కౌన్సెలింగ్‌ అందించడం వంటివి), కమ్యూనిటీ సేవ కోసం ఇంపాక్ట్ లీవ్, ఇన్‌క్లూసివ్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వంటి సేవలు కూడా అందిస్తోంది. కాగా ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్ సైట్ మీషో కూడా ఇలాంటి సెలవులునే ప్రకటించిన విషయం తెలిసిందే.

First published:

Tags: Diwali, Employees, Holidays, Jobs in Hyderabad

ఉత్తమ కథలు