వరకట్నం ఎంత తీసుకోవాలో తెలుసా?

Shiva Kumar Addula | news18
Updated: June 14, 2018, 6:51 PM IST
వరకట్నం ఎంత తీసుకోవాలో తెలుసా?
  • News18
  • Last Updated: June 14, 2018, 6:51 PM IST
  • Share this:
మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? కట్నం గురించే ఆలోచిస్తున్నారా?  ఎంత తీసుకోవాలన్న దానిపై మీ ఫ్యామిలీ ఏకాభిప్రాయానికి రాలేక పోతోందా? ఐతే ఈ వెబ్ పోర్టల్ మీకు సాయం చేస్తుంది. ఎంత కట్నం తీసుకోవాలో సలహా ఇస్తుంది. మీ వయసు, రంగు, వ్రుత్తి, జీతం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని వరకట్నాన్ని కాలుక్యులేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ  వెబ్ పోర్టల్ పై తీవ్ర దుమారం రేగుతోంది.

http://www.dowrycalculator.com/ఇప్పుడీ వెబ్ సైట్ హాట్ టాపిక్ గా మారింది. సైట్ లోకి  ఎంటర్ కాగానే వయసు, కులం, జీతం, ఉద్యోగం చేస్తున్న దేశం, ఎత్తు, గతంలో జరిగిన పెళ్లిళ్ల సంఖ్య, తండ్రి ఉద్యోగం వంటి వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఎంటర్ చేశాక..కాలుక్యులేట్ డౌరీ బటన్ క్లిక్ చేస్తే..డౌరీ రేట్ చూపిస్తుంది. అంటే మీరు ఎంత కట్నం తీసుకోవచ్చో  చెబుతుంది.తెల్లగా ఉంటే ఒకలా.. నల్లగా ఉంటే మరోలా..డ్రీమ్ డౌరీని చూపిస్తుంది. 25 ఏళ్ల బ్రాహ్మణ ఐఏఎస్ అధికారి కోటి రూపాయల వరకు కట్నం తీసుకోవచ్చని సదరు వెబ్ సైట్ చెబుతుంది. దాంతో పాటు భూములు, ఖరీదైన ఆభరణాలు, విదేశీ యాత్ర బోనస్ గా పొందవచ్చని సూచిస్తుంది. ఇక తెల్లగా ఉండి అమెరికాలో  ఇంజినీర్ గా పనిచేస్తూ నెలకు 2 లక్షలకుపైగా సంపాదిస్తే.. 3 కోట్ల వరకు కట్నం తీసుకోవచ్చట.ఇక 30 ఏళ్లు ఉండి.. సాదాసీదా ఉద్యోగం చేస్తే..35 లక్షల వరకు కట్నం తీసుకోవచ్చని సదరు వెబ్ సైట్ ఉచిత సలహా  ఇస్తోంది. ప్రస్తుతానికి తక్కువగానే  ఉన్నా.. భవిష్యత్ మీరు మరింత మంచి కట్నంపొందే అవకాశముందని నీతులు కూడా చెబుతుంది. మీ డ్రీమ్ డౌరీని సాధించే వరకు అలుపెరగని క్రుషి చేయాలని పనికిమాలిన ప్రోత్సాహం అందిస్తోంది.

ఇటీవల ఈ వెబ్ సైట్ గురించి కాంగ్రెస్ నేత జ్యోతరాదిత్య సింధియాకు తెలిసింది. వరకట్నం తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తున్న సదరు సైట్ పై తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటని.. వెబ్ సైట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, కేంద్ర శిశు సంక్షేమశాఖకు  ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేశారు.భారత్ లో వరకట్నం నిషేధం. దాన్ని తీసుకోవడం చట్టరీత్యా నేర. వరకట్నం వేధింపుల కారణంగా ఏటా ఎంతో మంది చనిపోతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( ఎన్ సీ ఆర్ బీ) 2016 లెక్కల ప్రకారం.. దేశంలో జరుగుతున్న వరకట్న నేరాల్లో 9.5 శాతం నేరాలు యూపీలో, 8.9 శాతం మధ్యప్రదేశ్ లో, 8.8 శాతం మహారాష్ట్ర, 8.7 శాతం కేరళలో జరుగుతున్నాయి.

2015 ఆన్ లైన్ వివాహ వేదిక Shaadi.com లో కూడా ఈ తరహా  కాలుక్యులేటర్ నే తీసుకొచ్చింది. ఐతే అది వరకట్నకాలుక్యులేటర్ కాదు. వరకట్నం వల్ల సంభవిస్తున్న మరణాలను కాలుక్యులేట్ చేస్తుంది. ప్రజల్లో వరకట్నం తీసుకోవద్దనే అవగాహన కల్పించేందుకే ఆ ప్రయత్నం చేసింది. మొత్తంగా dowrycalculator పై తీవ్ర దుమారం రేగుతోంది. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా, మహిళా సంఘాలు కోరుతున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: May 30, 2018, 9:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading