#WeAreAmazon: Amazonలో విక్రయాలు చేస్తున్న లక్షల మంది చిన్నస్థాయి వ్యాపార యజమానుల ఆదర్శవంతమైన విజయగాథలు

ప్రతీకాత్మక చిత్రం

వ్యాపారస్తులకు 2020-21 నుంచి కరోనా కారణంగా చాలా కఠిన సంవత్సరంగా గడుస్తోంది. ఎన్నో స్టార్టప్‌లు, వెండార్‌లు, రీసెల్లర్‌లు తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డారు. కొందరైతే తమ వల్ల కాదని వెనక్కి కూడా తగ్గారు. అయితే Amazon భాగస్వామ్యంతో అనేక మంది విజయవంతం అయ్యారు. వారి విజయగాథలు మీ కోసం..

 • Share this:
  చిన్నస్థాయి వ్యాపారస్తులతో పాటు ప్రతి ఒక్కరికీ 2020-21 చాలా కఠిన సంవత్సరంగా గడుస్తోంది. ఎన్నో స్టార్టప్‌లు, వెండార్‌లు, రీసెల్లర్‌లు తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డారు. కొందరైతే తమ వల్ల కాదని వెనక్కితగ్గారు. అయినప్పటికీ, Amazon వారి 9 లక్షలకు పైగా ఉన్న చిన్నస్థాయి వ్యాపారస్తులు, ఎంట్రప్రెన్యూర్‌లు కలిసికట్టుగా ఉంటే అందరికీ ఆదర్శంగా నిలవచ్చని నిరూపించే విజయగాథలను బయటికి తీసుకొచ్చింది. పాండమిక్ సమయంలో మొదటిసారిగా ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపట్టిన త్రిపుర రాష్ట్రానికి చెందిన కళాకారుల నుండి సరిహద్దులు దాటి పోషణ గల జ్యూస్‌లు, విద్యాపర బొమ్మలు అమ్ముతున్న మహిళా వ్యాపారస్తుల వరకు ఉన్న ఈ విజయగాథలు, Amazon వారి కలిసికట్టుగా ఉండే చిన్నస్థాయి వ్యాపారస్తులు, విక్రేతల శక్తికి, ప్రేరణకు అద్దం పడుతున్నాయి.

  Amazonతో భాగస్వామ్యం గొప్పదనం గురించి నేటితరానికి ఉపయోగపడే బహుమతుల షాపు నిర్వహిస్తోన్న వ్యాపారస్తుడు ఇషాన్ సోనీ వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా వివిధ బ్రాంచీలకు యజమాని అయిన ఇషాన్ ఇలా అన్నారు, " లాక్‌డౌన్ తీసివేసిన తర్వాత మొదటి మూడు నెలల పాటు, నార్త్‌ల్యాండ్‌కు 25% మంది మాత్రమే వచ్చేవారు. అత్యవసరాల పరిధిలోకి రాని వాటిని అమ్ముకునే మాలాంటి చిన్నస్థాయి వ్యాపారస్తులకు ప్రజలు అవసరం. అందుకని ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు చేయడం ఒక పెద్ద సవాలుగా నిలిచింది."

  ఈ కారణంగానే సోనీ తన ఈ-కామర్స్ ప్రయాణాన్ని Amazonలో ప్రారంభించాడు, అది త్వరలోనే ఆయనకు ఆశ్చర్యపరిచే ఫలితాలను తీసుకొచ్చింది. తన స్టోర్‌లో ఆర్డర్‌లను పికప్ చేసుకుంటూ, ఆయన ఇలా చెప్పారు, " ఆన్‌లైన్‌లో వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. మాకు పాండిచ్చేరీ, అండమాన్ నికోబార్ ద్వీపాల లాంటి సుదూర ప్రాంతాల నుండి కూడా ఆర్డర్‌లు వస్తున్నాయి." ఆఫ్‌లైన్ స్టోర్ అమ్మకాలు ప్రధాన ఆదాయంగా ఉన్నప్పటికీ, తన వ్యాపార ఎదుగుదల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు చోట్లా విక్రయాలు చేయడం వల్ల భవిష్యత్తులో దీర్ఘకాలం పాటు విజయపరంపర కొనసాగించవచ్చని సోనీ అభిప్రాయపడుతున్నారు.


  అయితే ఇలా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో సమర్థవంతంగా అమ్మకాలు చేపట్టి లాభపడుతున్నది ఒక్క సోనీ మాత్రమే కాదు. ఇన్వర్టర్ బ్యాటరీల లాంటి ముఖ్యమైన ఉత్పత్తులను రీటెయిలింగ్ విధానంలో అమ్మే మహ్మద్ సిద్ధిఖీ, మొదట్లో ఆన్‌లైన్ వ్యాపారం గురించి తక్కువ అంచనా వేశారు. అయితే గత రెండేళ్లుగా దేశం పరిస్థితి బాగోలేకపోవడంతో, కష్టపడి సంపాదించిన ఆయన సేవింగ్స్ డబ్బు మొత్తం అయిపోయే పరిస్థితి వచ్చింది. "Amazonతో భాగస్వామ్యం చేసుకున్నాక, మాకు ప్రతిరోజు కనీసం ఐదు ఆర్డర్లు రావడం చూస్తున్నాం, నెల మొత్తం ఇలాగే వచ్చాయి. చివరికి, మేము కేవలం షాప్ అమ్మకాల మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది." Amazon వారి పెద్దఎత్తున్న ఉన్న నెట్‌వర్క్, వినూత్న విక్రయ ఎంపికల సహాయంతో ఆయన వ్యాపారం మెరుగుపడింది, దీంతో మళ్లీ సిద్ధిఖీ తన ఆఫ్‌లైన్ స్టోర్‌ను ఎలాంటి నష్టాలు లేకుండా తెరిచే వీలు కలిగింది.  అయితే మరి ఒక వర్గానికి సంబంధించిన, కొన్నిసార్లు మాత్రమే ముఖ్యంగా అవసరమయ్యే ఉత్పత్తులు అమ్మే వ్యాపారాల సంగతేంటి? అశ్విని మలని ఆమె కంపెనీని 2014లో ప్రారంభించింది. ఆటలు ఆడుతూ అందరికీ విద్యను దగ్గర చేసి, చిన్నారుల మేధస్సు మెరుగుపరిచే ఉద్దేశంతో ఆమె ఈ కంపెనీని మొదలుపెట్టింది. పిల్లలు ఆడుకుంటూ నేర్చుకునే డిజైనర్ బొమ్మలను ఆమె విక్రయిస్తోంది. అయితే ఆమె బొమ్మలను కొనగలిగే వారు ఒక ప్రత్యేక వర్గానికి, అవసరానికి చెందిన వారు మాత్రమే. ఆఫ్‌లైన్ విక్రయాల ద్వారా చాలా తక్కువ ఆదరణ ఉంటుంది. ఇక దేశం మొత్తం పాండమిక్‌లో పడి కొట్టుమిట్టాడుతుంటే, ఆమె ఉత్పత్తుల విక్రయాలు "సున్నాకు పడిపోయాయి." అప్పుడే ఆమె వ్యాపారాన్ని మెరుగుపరచడానికి, ఆమె దగ్గర పనిచేస్తున్న వారి శ్రేయస్సు కోసం ఆన్‌లైన్ అమ్మకాలు చేపట్టాలని మలని నిర్ణయించుకున్నారు.

  Amazon వారి సహాయంతో, స్టెప్స్ టు డూ (STEPS TO DO) ఆమె వ్యాపారం పెరగడం గురించి అశ్వని ఇలా అంటున్నారు, "వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నా మాట రాసిపెట్టుకోండి. మీరు చిన్నస్థాయి వ్యాపారస్తులైనా లేదా మీ ఇంటి నుండి ఏదైనా విక్రయిస్తున్నా, మీ వ్యాపార ప్రణాళికలో Amazon తప్పనిసరిగా ఉండాలి."


  వీళ్లు మాత్రమే కాదు ఇలాంటి విజయగాథలు ఉన్న విక్రేతలు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ Amazon వారు అందిస్తోన్న సహాయం, నెట్‌వర్క్, మార్కెటింగ్ నైపుణ్యాలను మెచ్చుకున్నారు. చిన్నస్థాయి వ్యాపారస్తుల ఎదుగుదలకు ఇది ఉత్తమ వేదికగా నిలుస్తోంది, చిన్నస్థాయి భారతీయ హస్తకళాకారులు, కంపెనీలు, సేవాసంస్థలు ఈ Amazon కుటుంబంలో చేరి, వారి వ్యాపారాన్ని పునరుత్తేజం చేసుకుంటున్నారు.

  ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు కూడా Amazon విజయపరంపరలో ఎలా భాగమవ్వాలో అనే విషయం గురించి మరింత తెలుసుకోండి.

  నిరంతర సహాయం, భారీ నెట్‌వర్క్‌తో, Amazon India వారు ఈ పోటీతత్వ మార్కెట్లో చిన్నస్థాయి వ్యాపారస్తులు తమ లక్ష్యాలను సాధించేందుకు సహాయపడుతున్నారు. కష్టపడి పని చేసే ఈ చిన్నస్థాయి వ్యాపారస్తులకు సహాయం చేయడం ద్వారా, సిమెంట్ ఇటుకతో దుకాణాలు నిర్మించి, విక్రయాలు చేసే సంస్కృతిని Amazon పారద్రోలి, ప్రతి ఒక్కరికీ తమ ఇంటి వద్ద నుండి మంచి నాణ్యత గల ఉత్పత్తిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

  ఒకవేళ మీరు కూడా మీ వ్యాపార ప్రయాణాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించాలని అనుకుంటే, ఎలా మొదలుపెట్టాలో తెలుసుకోవడానికి దిగువున ఉన్న లింక్ క్లిక్ చేయండి. https://www.amazon.in/b?node=20172002031&ld=SMINSOApartner&fbclid=IwAR0SrECWx5xGxo_pOriAYstyzGSWOZIphgJokgr98NAsSj75fvefzF5b0xg

  ఇది భాగస్వామ్య పోస్ట్.
  Published by:Nikhil Kumar S
  First published: