హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2023: నెట్వర్క్18 ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఆదాయపు పన్నుపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Budget 2023: నెట్వర్క్18 ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఆదాయపు పన్నుపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Budget 2023: నెట్వర్క్18 ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఆదాయపు పన్నుపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
(ప్రతీకాత్మక చిత్రం)

Budget 2023: నెట్వర్క్18 ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఆదాయపు పన్నుపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు (ప్రతీకాత్మక చిత్రం)

Budget 2023 | బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆదాయపు పన్నుపై అనేక సందేహాలు ఉన్నాయి. నెట్వర్క్18 ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఆదాయపు పన్నుపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 (Budget 2023-24) ప్రవేశపెట్టారు. బడ్జెట్ తర్వాత ప్రైవేట్ మీడియా సంస్థకు తొలిసారిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇంటర్వ్యూ ఇచ్చారు. నెట్వర్క్18 కి ఇచ్చిన ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఆదాయపు పన్నుపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్‌పై నెట్వర్క్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ జోషీ కొన్ని ప్రశ్నలు వేశారు. పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలోకి (New Tax Regime) మారాలని మీరు అనుకుంటున్నారని, 80సీ, 80డీ మినహాయింపుల్ని తొలగిస్తారా అని, ఎప్పట్లోగా ఇది జరుగుతుందని ఆయన ప్రశ్న అడిగారు.

పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలోకి మారాలని తమకు ఎలాంటి టైమ్ ఫ్రేమ్ లేదని, భారత పౌరులకు ఛాయిస్ ఇస్తున్నామని, పన్ను చెల్లింపులు, పన్ను విధానం విషయంలో సులభతరమైన, మంచి వ్యవస్థ తీసుకురావాలనుకుంటున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు. పన్ను చెల్లింపుల విషయంలో సంక్లిష్టంగా లేని వ్యవస్థను తీసుకురావాలని అనుకుంటున్నామని చెప్పారు. ట్యాక్స్‌పేయర్స్‌కి ఇప్పటికే చాలా మినహాయింపులు ఇచ్చాం అని, ఇన్స్యూరెన్స్ , మెడికల్ కవర్, సేవింగ్స్ ... ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నారు.

IRCTC Bharat Gaurav Train: మరో గుడ్ న్యూస్... సికింద్రాబాద్ నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు

కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం కొత్త పన్ను విధానం తీసుకొచ్చిందని, పన్ను చెల్లింపు విధానం సులభంగా ఉండాలని, ఎంత పన్ను చెల్లిస్తున్నారో పన్ను చెల్లింపుదారులకు తెలియాలని, తాము ఎక్కువ పన్ను చెల్లిస్తున్నామని ట్యాక్స్‌పేయర్స్ అనుకోకూడదని ప్రధాన మంత్రి మోదీ అప్పుడు తమను ఆదేశించారన్నారు. 50 శాతం మంది ట్యాక్స్‌పేయర్స్ కొత్త పన్ను విధానంలోకి మారతారని అనుకుంటున్నట్టు చెప్పారు.

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించి ఐదు మార్పులు చేసింది. ప్రస్తుతం రూ.5,00,000 వరకు వార్షికాదాయం ఉన్నవారికి రిబేట్ కారణంగా ఎలాంటి పన్నులు చెల్లించట్లేదు. రిబేట్‌తో రూ.7,00,000 వరకు పన్నులు ఉండవని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక కొత్త పన్ను విధానంలో ఉన్న 6 శ్లాబ్స్‌ని 5 కి తగ్గించారు. రూ.3 లక్షల లోపు- పన్నులు ఉండవు, రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు- 5 శాతం, రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలు- 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షలు- 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు- 20 శాతం, రూ.15 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం- 30 శాతం పన్నులు చెల్లించాలి.

Income Tax Example: లిమిట్ కన్నా రూ.10 ఆదాయం ఎక్కువా? అయితే రూ.26,001 పన్ను కట్టాల్సిందే

రూ.15.5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.52,500 బెనిఫిట్ లభిస్తుంది. అత్యధిక ట్యాక్స్ రేట్‌ను 42.7 శాతం నుంచి 39 శాతానికి తీసుకొచ్చారు. నాన్ గవర్నమెంట్ సాలరీడ్ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లో ఉన్న రూ.3,00,000 లిమిట్‌ను రూ.25 లక్షలకు పెంచారు.

First published:

Tags: Budget 2023, Network18, Nirmala sitharaman

ఉత్తమ కథలు