Biryani By Kilo: ప్రముఖ దేశీయ బిర్యానీ (Chicken Biryani) బ్రాండ్ బిర్యానీ బై కిలో (Biryani By Kilo) బిర్యానీతో పాటు ఇతర ఆహార పదార్థాలను అందిస్తుంటుంది. ఈ సంస్థ ప్రస్తుతం ఇండియాలో 45 నగరాల్లోని 100కు పైగా అవుట్లెట్ల నుంచి సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ దేశంలోని ప్రతి మూలకు, ప్రపంచవ్యాప్తంగా కూడా తన సేవలను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే రెండు, మూడు ఏళ్లలో భారతదేశం అంతటా 250-300 అవుట్లెట్లను ఓపెన్ చేయాలని కోరుకుంటోంది. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా కంపెనీ డిస్నీ + హాట్‌స్టార్ (Chicken Biryani)లో ఒక కొత్త వెబ్-సిరీస్ 'దమ్ లగా కే ఇండియా'ను కూడా ప్రారంభించింది. ఈ సీజన్ నాలుగు ఎపిసోడ్స్ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి.
ఒక్క షేరు కొంటే 100 షేర్లు ఉచితం.. తెగ కొనేస్తున్న జనాలు
దమ్ లగా కే ఇండియా వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. BBK వ్యవస్థాపకుడు, కో-సీఈఓ విశాల్ జిందాల్ ప్రకారం, కంటెంట్ ఫార్మాట్ ప్రతి సంవత్సరం ఒకసారి విడుదల అవుతుంది. ఈ ఫుడ్ & ట్రావెల్ షోకు చెఫ్ రణవీర్ బ్రార్, నటి వాణీ కపూర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, సింగర్ అర్మాన్ మాలిక్, నటి ప్రణీత సుభాష్ వంటి ప్రముఖులు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. తమ కంపెనీ ఆహారాల గురించి ప్రపంచానికి తెలియజేసేలా ఈ షో నిర్వహిస్తున్నట్లు జిందాల్ తాజాగా చెప్పుకొచ్చారు.
Amazon: ఖర్చులను తగ్గించుకునే దిశగా అమెజాన్ .. లాభాలు రాని బిజినెస్ యూనిట్లపై ఫోకస్
“దమ్ లగా కే ఇండియా” షో ద్వారా తమ దమ్ బిర్యానీ సువాసనలు, రుచుల గురించి అందరికీ తెలుపుతామని జిందాల్ అన్నారు. తమ వెబ్ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ మొదలైన వాటితో సహా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్లే అవుతుందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ , కోల్‌కతా, ముంబైలో పర్యటించే నాలుగు భాగాల సిరీస్ అని.. ప్రతి నగరంలో వివిధ రంగాలకు చెందిన అచీవర్స్ ఈ షో నిర్వహిస్తారని వెల్లడించారు. భారతదేశ సంస్కృతి, చరిత్రను వివరిస్తూ బిర్యానీని మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచానికి చెప్పేలా BBK స్టోరీ చెప్పాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ షో హిందీలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ సీజన్ కోసం దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేశారట.
* రూ.1000 కోట్ల కంపెనీగా మార్చడమే లక్ష్యం
"భారతదేశంలో బ్రాండ్‌ను పెంచుకోవడమే మా ప్రధాన లక్ష్యం. మేం భారతదేశం అంతటా 250-300 అవుట్లెట్లను ప్లాన్ చేస్తున్నాం. రాబోయే 2-3 సంవత్సరాలలో BBKని రూ.1,000 కోట్ల కంపెనీగా పెంచుతాం. తరువాతి లక్ష్యం బిర్యానీ, BBKని గ్లోబల్ కంపెనీగా మార్చడం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మా బ్రాండ్‌ను వారి దేశాలకు తీసుకెళ్లడానికి చాలా పెద్ద ఫుడ్ అండ్ బేవరేజీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి." అని విశాల్ జిందాల్ పేర్కొన్నారు. బిర్యానీ, కబాబ్ డెలివరీ చైన్ బిర్యానీ బై కిలో రూ.300 కోట్ల రెవిన్యూతో ఫైనాన్షియల్ ఇయర్ 2023ని ముగించాలని లక్ష్యంగా పెట్టుకుందని జిందాల్ తెలిపారు. తమ కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా రన్ కావడానికి ప్రతి ఆర్డర్ క్వాలిటీగా సర్వ్ చేయడమే కారణమని ఆయన వెల్లడించారు. తాము వాడే బాస్మతి రైస్ రెండేళ్ల పాతవి అయి ఉంటాయని.. వాటి ధర కిలో రూ.250 వరకు ఉంటుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Biryani, Business, Chicken biryani, Food