WE CAN BUY LAND CHEAPLY NEAR YADADRI TEMPLE AND BIBINAGAR AREAS NS
Hyderabad Real Estate: హైదరాబాద్ కు సమీపంలో ఇళ్ల స్థలం గజం రూ.16 వేలకే.. ఎక్కడో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ కు సమీపంలో అతి తక్కువ ధరకే ఇళ్ల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారు లేదా ల్యాండ్ పై పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
కరోనా (Corona) అందరి ఆలోచనను మార్చి వేసింది. మహమ్మారి మన మధ్యకు వచ్చినప్పటి నుంచి సొంతంగా ఇల్లు, స్థలాలు ఉండాలనుకునే వారి పెరిగి పోయింది. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం ఈ రెండేళ్లుగా జోరుగా సాగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు హాట్ కేకుళ్లా అమ్ముడు పోతున్నాయి. ఇళ్ల స్థలాల అమ్మకాలు, నిర్మాణాలు సైతం భారీగా జరిగాయి. అయితే.. చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు నగరంలో ఇళ్లు, స్థలాలు కొనే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు జీహెచ్ఎంసీకి సమీప ప్రాంతాల్లో తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా తక్కువ ఖర్చుతో పాటు సిటీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. లేకపోతే భవిష్యత్ లో మంచి ధర వచ్చాక వాటిని అమ్ముకుని నగరంలోనే ఇళ్లు లేదా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసుకోవచ్చు.
హైదరాబాద్ కు సమీపంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం యాదాద్రి. సీఎం కేసీఆర్ అత్యంత శ్రద్ధ తీసుకుని యాదగిరి గుట్ట ఆలయాన్ని పున:ర్నించిన విషయం తెలిసిందే. ఇంకా రీజనల్ రింగ్ రోడ్డు కూడా యాదాద్రి జిల్లా నుంచి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అక్కడ ఇళ్ల స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. యాదాద్రి నుంచి ఉప్పల్ కు 55 కి.మీ దూరం ఉంటుంది. కారులో అయితే.. గంట సేపట్లో అక్కడికి చేరుకోవచ్చు. బస్సు, ఇతర వాహనాల ద్వారా అయితే.. గంటన్నరలోపే వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో డిమాండ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. Investment Tips: రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్‌లో ఏది బెస్ట్..? ఆ వివరాలు పూర్తిగా ఇలా..
యాదాద్రి ఆలయానికి సమీప ప్రాంతాల్లో గజం ప్రస్తుతం రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ప్రాంతాల్లో అన్ని అనుమతులతో కూడిన వెంచర్లు ఏర్పాటు చేశాయి. మా వెంచర్ నుంచి ఆలయ గోపురం దర్శనం కలుగుతుందంటూ అనేక సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఇంకా తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు కావాలనుకుంటే మాత్రం యాదాద్రికి సమీపంలో వరంగల్ హైవే నుంచి 8 కిలో మీటర్ల దూరంలో గజం రూ.5000 వేల లోపే లభిస్తోంది. ఇంకా సిటీకి మరింత దగ్గరగా స్థలం కావాలనుకుంటే మాత్రం బీబీ నగర్ ను ఎంచుకోవచ్చు. యాదాద్రి నుంచి బీబీ నగర్ వరకు గజం రూ.16 నుంచి రూ.20 వేలు పలుకుతోంది. మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వెళ్తున్నా కొద్దీ ఈ ధర తక్కువగా ఉంటుంది. ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో అయితే గజం రూ.30 వేల వరకు ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.