హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Card: ఆ రూల్ అమలు చేయడానికి మేం రెడీ... ప్రకటించిన ఎస్‌బీఐ

SBI Card: ఆ రూల్ అమలు చేయడానికి మేం రెడీ... ప్రకటించిన ఎస్‌బీఐ

SBI Card: ఆ రూల్ అమలు చేయడానికి మేం రెడీ... ప్రకటించిన ఎస్‌బీఐ
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Card: ఆ రూల్ అమలు చేయడానికి మేం రెడీ... ప్రకటించిన ఎస్‌బీఐ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Card | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లావాదేవీల కోసం ప్రకటించిన కొత్త నియమనిబంధనల్ని తాము అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌బీఐ కార్డ్ ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టోకెనైజేషన్ రూల్‌ను తాము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ విభాగం అయిన ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ రామ మోహన్ రావు అమర ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం తాము అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎస్‌బీఐ కార్డ్ ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డ్ నుంచి కొత్తగా క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్ (Cashback SBI Card) లాంఛైన సంగతి తెలిసిందే. ఈ లాంఛింగ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ వినియోగదారుల డేటాను రక్షించడం, డేటా లీకేజీ కాకుండా చూడటానికి భరోసా ఇవ్వడం కోసం కార్డ్ టోకెనైజేషన్ చాలా మంచి చర్య అని రామ మోహన్ రావు అమర తెలిపారు. ఇప్పటికే పెద్ద మర్చెంట్స్ అందరూ టోకెనైజ్ చేసి ఉంటారని తాను భావిస్తున్నానని అన్నారు.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కార్డ్ టోకెనైజేషన్ తప్పనిసరి. క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ ఉపయోగిస్తున్నవారు తమ కార్డ్ టోకెనైజ్ చేయాల్సిందే. లేకపోతే కార్డుతో పేమెంట్ చేసిన ప్రతీసారి కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. వాస్తవానికి ఈ రూల్స్ జూలై 1 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కొన్ని రోజులు గడువు పొడిగించమని కోరాయి. దీంతో సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించింది. అంటే అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ టోకెనైజ్ చేయడం తప్పనిసరి.

Post Office Scheme: ఓ పదేళ్లు ఇలా పొదుపు చేస్తే రూ.16.26 లక్షలు మీవే

క్రెడిట్ కార్డ్ సంస్థలు, బ్యాంకులు, మర్కెంట్స్ కార్డ్ టోకెనైజేషన్‌పై కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నాయి. ఆర్‌బీఐ కూడా కార్డ్ టోకెనైజ్ ఎలా చేయాలో వివరించింది. సింపుల్ స్టెప్స్‌తో మీరు మీ కార్డును టోకెనైజ్ చేయొచ్చు. ఆ స్టెప్స్ ఇక్కడ తెలుసుకోండి.

కార్డ్ టోకెనైజేషన్ స్టెప్స్


Step 1- ఏదైనా ఇకామర్స్ వెబ్‌సైట్ లేదా మర్చంట్ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేసి పేమెంట్ ప్రాసెస్ ప్రారంభించండి.

Step 2- చెకౌట్ సమయంలో మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి.

Step 3- Secure your card లేదా Save card as per RBI guidelines ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

Step 4- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీకి వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి.

Step 5- మీ కార్డు వివరాలకు బదులుగా టోకెన్ జనరేట్ అవుతుంది.

Step 6- మీరు మళ్లీ అదే వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ట్రాన్సాక్షన్ చేస్తే మీ కార్డులోని చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి.

Bank Account: బ్యాంక్ అకౌంట్ కోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవసరం లేదు... ఈ ఒక్క నెంబర్ ఉంటే చాలు

ఈ సింపుల్ స్టెప్స్‌తో మీరు మీ కార్డ్ టోకెనైజ్ చేయొచ్చు. అక్టోబర్ 1 నుంచి గతంలోలాగా మీ కార్డు వివరాలు సేవ్ చేసే ఆప్షన్ ఉండదు. అయితే ఒకవేళ మీరు కార్డ్ టోకెనైజ్ చేయకూడదనుకుంటే మాత్రం మీరు ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపే ప్రతీసారీ మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ వివరాలు ఎంటర్ చేయాలి. అంటే కార్డ్ నెంబర్, సీవీవీని ప్రతీసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

కార్డ్ టోకెనైజ్ అంటే ఏంటీ?


కార్డ్ టోకెనైజ్ అంటే మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుకు ఓ టోకెన్ క్రియేట్ అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఉన్న పద్ధతి ప్రకారం మీరు ఓ క్రెడిట్ కార్డు వివరాలను వేర్వేరు సైట్లలో సేవ్ చేస్తే అన్ని సైట్లల్లో వివరాలు ఒకేలా ఉంటాయి. కార్డ్ టోకెనైజేషన్ పద్ధతిలో మీ కార్డు వివరాలు సదరు మర్చెంట్ డేటా బేస్‌లో ఉండవు. కార్డు వివరాలకు బదులుగా ఓ టోకెన్ క్రియేట్ అవుతుంది. మీరు వేర్వేరు సైట్లల్లో కార్డును టోకెనైజ్ చేస్తే ఆ టోకెన్ నెంబర్ కూడా వేర్వేరుగా ఉంటుంది. దీని వల్ల మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉండదు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Credit cards, Personal Finance, Reserve Bank of India, Sbi card

ఉత్తమ కథలు