హోమ్ /వార్తలు /బిజినెస్ /

Warren Buffett: 92 ఏళ్లు వచ్చినా సూపర్ ఫిట్ గా వారెన్ బఫెట్.. తినేది హెల్తీ ఫుడ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!

Warren Buffett: 92 ఏళ్లు వచ్చినా సూపర్ ఫిట్ గా వారెన్ బఫెట్.. తినేది హెల్తీ ఫుడ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే!

Warren Buffett

Warren Buffett

Warren Buffett: ఇన్వెస్టర్లకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలిచిన వారెన్ బఫెట్‌కు నిన్నటితో (ఆగస్టు 30) 92 ఏళ్లు నిండాయి. ఇప్పటికీ ఆయన చురుకుగా నడవగలుగుతారు. తన వ్యాపారాలను చూసుకోగలుగుతున్నారు. ఈ వయసులో కూడా అతనెంత యాక్టివ్‌గా ఉండడానికి హెల్దీ డైట్ ఫాలో కావడమే కారణమని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

బాల్యంలోనే డబ్బులు (Money) సంపాదించాలనే ఆలోచన చేసి, యవ్వన ప్రాయంలోనే స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టి బిలియనీర్ ఎదిగిన వ్యక్తి వారెన్ బఫెట్ (Warren Buffett). పెట్టుబడి మాంత్రికుడిగా పిలిచే ఈ దిగ్గజ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్‌ (Stock Market)లో కొత్త అధ్యయనాలను లిఖించారు. తన అద్భుతమైన పెట్టుబడి సూత్రాలతో వేల కోట్ల డాలర్లు సంపాదించి అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. అలా ఇన్వెస్టర్లకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలిచిన వారెన్ బఫెట్‌కు నిన్నటితో (ఆగస్టు 30) 92 ఏళ్లు నిండాయి. ఇప్పటికీ ఆయన చురుకుగా నడవగలుగుతారు. తన వ్యాపారాలను చూసుకోగలుగుతున్నారు. ఈ వయసులో కూడా అతనెంత యాక్టివ్‌గా ఉండడానికి హెల్దీ డైట్ ఫాలో కావడమే కారణమని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆయన ఫాలో అయ్యే డైట్ ఏంటో తెలిస్తే అవాక్కవ్వక తప్పదు.జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని చాలామంది వాటిని దూరంగా ఉంటారు. కానీ వారెన్ బఫెట్ మాత్రం కోకా-కోలాలు, ఐస్‌క్రీమ్‌ బర్గర్లు, హాట్‌డాగ్స్ వంటి జంక్ ఫుడ్‌ ఇష్టంగా తింటారు. రోజూ కనీసం ఐదు కోలాలు తాగకుండా ఉండలేరు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన శరీరంలో నాలుగో వంతు కోకాకోలానే ఉంటుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.
"నేను రోజుకు 2700 కేలరీలు తీసుకుంటే, అందులో పావు వంతు కోకాకోలా ఉంటుంది. నేను కనీసం ఐదు క్యాన్ల కోలా తాగుతాను. ప్రతి క్యాన్ 12-ఔన్సులు (సుమారు 350 మి.లీ.) ఉంటుంది," అని పో ఇంటర్వ్యూలో బఫెట్ వివరించారు. అతనికి డైట్ కోక్ లేదా చెర్రీ కోక్ అంటే చాలా ఇష్టం. బఫెట్ సొంత కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే అతిపెద్ద ఆస్తులలో కోకాకోలా కూడా ఒకటి కావడం విశేషం.


బఫెట్ బ్రేక్‌ఫాస్ట్‌లో కోకాకోలా, ఐస్‌క్రీమ్‌ లేదా కొన్ని పొటాటో చిప్స్ తినడానికి ఇష్టపడతారు. లంచ్, డిన్నర్లలో ఎక్కువగా ఐస్‌క్రీమ్, కోక్, మెక్‌డొనాల్డ్స్ హాంబర్గర్‌ను తీసుకుంటారు. ఈ ఇన్వెస్టర్ తన సొంత రాష్ట్రమైన ఒమాహాలోని మెక్‌డొనాల్డ్‌లో ఫ్రీగా హాంబర్గర్‌ను తినేందుకు ఒక గోల్డ్ కార్డ్‌ను కూడా తీసుకున్నారు. అమెరికన్ రెస్టారెంట్ ఫ్రాంచైజ్ జానీ రాకెట్స్‌లో కూడా అతని వద్ద ఇలాంటి కార్డే ఉంది. బఫెట్‌కు బ్రకోలీ, ఇతర కూరగాయలు అసలు నచ్చవు.
ఇది కూడా చదవండి : మారుతి ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లోకి వచ్చేది అప్పుడే.. ధర వాటితో సమానమే ?
స్వీట్లే కాకుండా బఫెట్ ఉప్పు కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఎడమ చేతిలో ఉప్పు షేకర్‌ని పట్టుకొని పదే పదే చిలకరిస్తూ ఎక్కువగా ఉప్పు తింటుంటారు. 2500-2700 కేలరీలు గల జంక్ ఫుడ్ రోజూ అధికంగా తీసుకున్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. మరి అలాంటి అద్భుతమైన జన్యువులు (Genes) పొందడం నిజంగా ఆయన లక్ అని చెప్పవచ్చు. బఫెట్‌ ఒకసారి మాట్లాడుతూ.. జంక్ ఫుడ్ తినే ఆరేళ్ల పిల్లలలో అత్యల్ప మరణాల రేటు ఉంది. కాబట్టి ఆరేళ్ల పిల్లవాడిలా తినాలని నిర్ణయించుకున్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: BUSINESS NEWS, Junk food, Life Style, Warren Buffett

ఉత్తమ కథలు