PF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోండి ఇలా...

EPF Online withdrawal | ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా కోసం ఈపీఎఫ్ఓ మెంబర్స్ తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN, మొబైల్ నెంబర్ లింక్ చేయాలి. యూఏఎన్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో కేవైసీ పూర్తి చేసి ఉండాలి.

news18-telugu
Updated: June 8, 2019, 12:30 PM IST
PF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోండి ఇలా...
PF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఉద్యోగులు నెలనెలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేసిన డబ్బులో అత్యవసర సందర్భాల్లో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. వైద్య ఖర్చులు, చదువులు, ఇంటి నిర్మాణం ఇలా పలు కారణాలతో ఈపీఎఫ్‌లో కొంత విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి ఎన్నేళ్లు సర్వీసులో ఉన్నారు? డబ్బులు ఎందుకోసం తీసుకుంటున్నారు? అన్న అంశాలపై విత్‌డ్రా ఆధారపడి ఉంటుంది. గతంలో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే పీఎఫ్ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. unifiedportal-mem.epfindia.gov.in వెబ్‌సైట్‌లో పీఎఫ్ విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా కోసం ఈపీఎఫ్ఓ మెంబర్స్ తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN, మొబైల్ నెంబర్ లింక్ చేయాలి. యూఏఎన్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో కేవైసీ పూర్తి చేసి ఉండాలి.

PF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా ప్రాసెస్ ఇదే...



ముందుగా మీరు EPFO అధికారిక వెబ్‌సైట్ unifiedportal-mem.epfindia.gov.in ఓపెన్ చేయాలి.
మీ UAN ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
హోమ్ పేజీలో 'online services' పైన క్లిక్ చేసి డ్రాప్ డౌన్‌లో 'claim' పైన క్లిక్ చేయాలి.
స్క్రీన్‌పై కనిపించే వివరాలను వెరిఫై చేయాలి.
మీ వివరాలు, క్లెయిమ్ ఫామ్ కనిపిస్తుంది. బ్యాంక్ అకౌంట్‌లోని చివరి 4 అంకెలు ఎంటర్ చేసి 'Proceed For Online Claim' పైన క్లిక్ చేయాలి.కొత్త స్క్రీన్‌పై ఈపీఎఫ్ క్లెయిమ్ వివరాలు కనిపిస్తాయి.
ఎందుకోసం డబ్బులు డ్రా చేసుకోవాలనుకుంటున్నారో కారణం వివరించాలి.
మొత్తం, పాక్షికం, పెన్షన్ విత్‌డ్రాయల్ క్లెయిమ్‌లో మీరు ఏది కోరుకుంటే అది ఎంచుకోవాలి.
'Get Aadhaar OTP' పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే క్లెయిమ్ సబ్మిట్ అవుతుంది.
ఎంప్లాయర్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత 10 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Jan-Dhan Account: రూ.1 లక్ష ఇన్స్యూరెన్స్, రూ.5,000 ఓవర్ డ్రాఫ్ట్... జన్ ధన్ ఖాతాతో లాభాలెన్నో

EPFO: రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా? ఇలా కలిపేయండి

SBI-Aadhaar: ఒక్క నిమిషంలో మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా...
Published by: Santhosh Kumar S
First published: June 8, 2019, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading