EPF Withdraw: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలా? నిబంధనలివే...

EPF Withdraw | రెండు నెలల పాటు ఉద్యోగం లేకుండా ఉన్నారంటే ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అయిన మొత్తం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. లేకపోతే 100 శాతం విత్‌డ్రా కుదరదు. 50 శాతం వరకే విత్‌డ్రా చేసుకోవచ్చు.

news18-telugu
Updated: March 25, 2019, 5:05 PM IST
EPF Withdraw: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలా? నిబంధనలివే...
EPF Withdraw: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలా? నిబంధనలివే...
news18-telugu
Updated: March 25, 2019, 5:05 PM IST
డబ్బు పొదుపు చేస్తే ఎప్పటికైనా అవసరానికి ఆదుకుంటుంది. ఈపీఎఫ్ కూడా అంతే. ఉద్యోగంలో ఉన్నప్పుడు నెలనెలా మీరు ఈపీఎఫ్ రూపంలో చేసే పొదుపు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మరి మీరు కూడా మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని అనుకుంటున్నారా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిబంధనలు తెలుసుకోండి. మీరు రెండు నెలల పాటు ఉద్యోగం లేకుండా ఉన్నారంటే ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అయిన మొత్తం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. లేకపోతే 100 శాతం విత్‌డ్రా కుదరదు. 50 శాతం వరకే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్(PF) పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవాలంటే ఈ నిబంధనలు వర్తిస్తాయి.

Read this: Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 21 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

Want to Withdraw amount from Employees' Provident Fund account? Know these EPFO rules | EPF Withdraw: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలా? నిబంధనలివే...



విద్య


ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ పిల్లలు పోస్ట్ మెట్రిక్యులేషన్ చదవాలనుకుంటే మూడు సార్లు పాక్షికంగా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఏడేళ్ల సర్వీస్ పూర్తైనవారికే వర్తిస్తుంది. మూడు విత్‌డ్రాయల్స్‌లో 50 శాతం వరకే అనుమతిస్తారు.


ఆస్తి కొనుగోలు


ఐదేళ్ల సర్వీస్ పూర్తైన ఈపీఎఫ్ సభ్యులు ఇల్లు, ఫ్లాట్ కొనేందుకు లేదా ఇంటి నిర్మాణం కోసం అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ కారణంతో ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇల్లు కొనేందుకు లేదా నిర్మించేందుకు 36 నెలల బేసిక్ వేతనం, డీఏ, లేదా ఎంప్లాయీ, ఎంప్లాయర్ షేర్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ సైట్ కొనాలంటే 24 నెలల బేసిక్ వేతనం, డీఏ, లేదా ఎంప్లాయీ, ఎంప్లాయర్ షేర్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ ఇల్లు, స్థలం ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ పేరుమీద లేదా జీవిత భాగస్వామి పేరు మీద ఉండాలి.
Loading...
Read this: March 31 Deadline: ఈ 5 పనులకు మార్చి 31 డెడ్‌లైన్... త్వరగా పూర్తిచేయండి

save money, money saving tips, investment plans, tax saving, personal finance, financial tips, డబ్బు పొదుపు, డబ్బు ఆదాకు మార్గాలు, సేవ్ మనీ, మనీ సేవింగ్ టిప్స్, ఇన్వెస్ట్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్


హోమ్ లోన్ చెల్లింపు


ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ హోమ్ లోన్ చెల్లించేందుకు కూడా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. 10 ఏళ్లు సర్వీస్ పూర్తైన వారికి మాత్రమే 36 నెలల బేసిక్ వేతనం, డీఏ లేదా ఎంప్లాయీ, ఎంప్లాయర్ షేర్ లేదా అసలు, వడ్డీ మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు.

పెళ్లి


ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ తమ పెళ్లి లేదా కూతురు, కొడుకు, సోదరుడు, సోదరి పెళ్లి కోసం పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ ఏడేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. రిటైర్మెంట్ వరకు మూడుసార్లు ఈ కారణంతో విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి:-


 

Photos: సముద్రంలో రెస్టారెంట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

IPL Offer: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తారా? రీఛార్జ్ ఆఫర్లు ఇవే

WhatsApp: ఒక మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేశారు? ఇక లెక్క తేల్చనున్న వాట్సప్

Credit Score: క్రెడిట్ స్కోర్ తగ్గిందా? ఇలా పెంచుకోవచ్చు
First published: March 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...