హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Photo Update: ఆధార్ కార్డుపై మీ ఫోటో నచ్చలేదా? సింపుల్‌గా మార్చేయండి ఇలా

Aadhaar Photo Update: ఆధార్ కార్డుపై మీ ఫోటో నచ్చలేదా? సింపుల్‌గా మార్చేయండి ఇలా

Aadhaar Photo: ఆధార్ కార్డుపై మీ ఫోటో నచ్చలేదా? సింపుల్‌గా మార్చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Photo: ఆధార్ కార్డుపై మీ ఫోటో నచ్చలేదా? సింపుల్‌గా మార్చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Photo Update | మీ ఆధార్ కార్డుపైన (Aadhaar Card) ఉన్న ఫోటో నచ్చకపోతే సింపుల్‌గా మార్చేయొచ్చు. లేటెస్ట్ ఫోటో అప్‌డేట్ చేయొచ్చు. కొన్ని రోజుల్లోనే ఆధార్ కార్డుపై ఫోటో అప్‌డేట్ అవుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఒరిజినల్ ఫోటోకు ఆధార్ కార్డ్ ఫోటోకు చాలా తేడాలుంటాయి. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఆధార్ ఎన్‌రోల్ (Aadhaar Enrollment) చేయించుకున్నప్పుడు, లో క్వాలిటీ కెమెరాతో తీసిన ఫోటోకు, ఇప్పటి మొహానికి అస్సలు పోలికే ఉండదు. కొన్నిసార్లు ఆధార్ కార్డుపై ఉన్నది తమ ఫోటోనేనా అన్న డౌట్ కూడా వస్తుంది. ఆధార్ కార్డుపైన ఉన్న ఫోటో ఏమీ పర్మనెంట్ కాదు. మీరు కావాలనుకుంటే ఆధార్ కార్డుపై ఫోటో (Aadhaar Photo Update) మార్చుకోవచ్చు. ఈ అవకాశం ఇస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). ఆధార్ సేవా కేంద్రానికి లేదా ఆధార్ సెంటర్‌కు వెళ్లి సింపుల్‌గా మీ ఫోటో మార్చుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా సులభం.

ఆధార్ కార్డ్ హోల్డర్లు పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్ లాంటి వివరాలను ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేయొచ్చు. కానీ ఫోటో, బయోమెట్రిక్స్ అప్‌డేషన్ కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రానికి లేదా ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి. మీరు ఆధార్ కార్డుపై మీ ఫోటో మార్చాలనుకుంటే ఏం చేయాలో తెలుసుకోండి.

Pension Scheme: త్వరలో ఈపీఎఫ్ఓ కొత్త పెన్షన్ స్కీమ్... కనీస పెన్షన్ రూ.3,000

ఆధార్ కార్డుపై ఫోటో మార్చండి ఇలా

Step 1- ముందుగా ఆధార్ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేయండి. లేదా దగ్గర్లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లండి.

Step 2- అక్కడ ఆధార్ అప్‌డేట్ ఫామ్ తీసుకొని పూర్తి చేయండి.

Step 3- ఫామ్ పూర్తి చేసిన తర్వాత మీ బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయాలి.

Step 4- ఆ తర్వాత మీ లైవ్ ఫోటో తీసుకుంటారు. ఆ ఫోటోనే ఆధార్ కార్డుపై అప్‌డేట్ అవుతుంది.

Step 5- ఆ తర్వాత రూ.100 చెల్లిస్తే అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఉన్న అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ జాగ్రత్తగా భద్రపర్చుకోండి.

మీరు ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయడానికి రిక్వెస్ట్ చేసిన తర్వాత 90 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి ముందుగానే మీ వివరాలు అప్‌డేట్ కావచ్చు. మీ వివరాలు అప్‌డేట్ అయ్యాయో లేదో ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేస్తే తెలుస్తుంది.

Credit Card Tips: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే

ఇఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండిలా

Step 1- మీ ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో https://uidai.gov.in/ లేదా https://eaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో Download Aadhaar లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 3- ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, వర్చువల్ ఐడీ, ఆధార్ నెంబర్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఆ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

Step 4- ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

Step 5- Send OTP పైన క్లిక్ చేయాలి.

Step 6- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.

Step 7- ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

Step 8- ఇ-ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది.

మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటల్ లెటర్స్‌లో, పుట్టిన సంవత్సరం కలిపి పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే ఇఆధార్ ఓపెన్ అవుతుంది. డౌన్‌లోడ్ చేసిన ఆధార్ కార్డులో మీ ఫోటో మారిందో లేదో చెక్ చేయాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, AADHAR, UIDAI

ఉత్తమ కథలు